రాష్ట్రీయం

ఆక్రమణల క్రమబద్ధీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంద గజాలలోపు స్థలాలకు అవకాశం అర్బన్ ప్రాంత ఆక్రమణదారులకు వరం

కాకినాడ, డిసెంబర్ 6: నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున మేలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆక్రమణదారుల ఆధీనంలోవున్న 100 గజాలలోపు అభ్యంతరాలు లేని ఆక్రమణల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ నిర్ణయం నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని, అనుభవిస్తున్న వారికి ఓవరం కానున్నది. ఆక్రమణల క్రమబద్ధీకరణకు డివిజన్‌స్థాయి కమిటీలు సమగ్రమైన పరిశీలన జరిపేలా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నగర, పట్టణ ప్రాంతాల్లో జనవరి 1, 2014నాటికి పేదలు తమ నివాసం కోసం ఆక్రమించుకున్న గుడిసెలు, ఇళ్లుకట్టుకున్న 100 గజాలలోపు ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించడానికి జీవో 296 ద్వారా ప్రత్యేక అవకాశాన్ని ప్రవేశపెట్టారు. 2014 ఆగస్టు 15నుండి పథకం అమల్లోకి వచ్చింది. లబ్ధిదారులు 75వేల రూపాయల లోపు వార్షికాదాయం కలిగివుండి, తెలుపు రంగు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు కలిగివుండి, క్రమబద్ధీకరణ కోసం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. నగర పాలక సంస్థ, పురపాలక సంఘాలు, నగర పంచాయితీలకు చెందిన 100 గజాలలోపు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని, వాటిని అనుభవిస్తున్న, పైఅర్హతలు కలిగిన పేదలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా భావిస్తారు. గరిష్ఠంగా 100 గజాల ఆక్రమిత స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించారు.
మీసేవ ద్వారా అందిన దరఖాస్తులను డివిజన్‌స్థాయి కమిటీలు పరిశీలిస్తాయి. సబ్ కలెక్టర్ లేక ఆర్టీవో కమిటీ అధ్యక్షుడిగా, టౌన్ ప్లానింగ్ అధికారి, తహశీల్దారు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలు 90 రోజుల్లోగా దరఖాస్తులను పరిశీలించి, ఆమోదం లేక తిరస్కరణలను ప్రకటిస్తాయి. డివిజన్‌స్థాయి కమిటీ నిర్ణయంపై 90 రోజుల్లోగా సంయుక్త కలెక్టర్‌కు దరఖాస్తుదారులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్, రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్‌ల పరిధిలోని భూములు, చెరువులు, ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏరియాలు, గ్రీన్ బెల్ట్‌లు, ప్రజా ప్రయోజనాల కోసం నిర్దేశించిన భూములు, ఫుట్‌పాత్‌లు, దేవాదాయ, ఇరిగేషన్ భూములు, ఆక్రమణలు లేకుండా ఖాళీగావున్న స్థలాలను ఈ పథకం కింద క్రమబద్ధీకరించేది లేదని ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేసింది. అసైన్డ్‌కాని ప్రభుత్వ భూములు, 1 జనవరి 2014 నాటికి నిరుపేదల నివాసంతో ఆక్రమణలతో ఉంటేనే పథకం కింద క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుందని పేర్కొంది.