అక్షర

శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుభారంభం
-చండిక సాంబశివరావు
వెల: రూ.60/-
ప్రతులకు: నియా అండ్ నిహాల్ పబ్లికేషన్స్
3-663/3, ఫ్లాట్ నెం.ఎ4
ప్రగతి ఎన్‌క్లేవ్,
ఉండవల్లి సెంటర్
తాడేపల్లి మండలం
గుంటూరు - 522 501
917893930585
***

అసలు కర్మ సిద్ధాంతం తెలియకుండానే జీవితం తెల్లారిపోతున్న అనేక మందికి ఏ విధంగా ‘కర్మ సిద్ధాంతం’ తెలియజేయాలి? అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ పుస్తకం. పుస్తకం రాస్తే మాత్రం వాళ్లు చదువుతారా? ఒకవేళ చదివినా వాళ్లకు అర్థం అవుతుందా? అర్థం కానప్పుడు అసలు రాయటమెందుకు? ఇప్పటికి ఉన్న కర్మ సిద్ధాంత గ్రంథాలు చదివి అందరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి ఈ పుస్తకం అలా ఉండకూడదు అన్న మరో ఆలోచన చుట్టూ ఈ పుస్తకం తిరుగుతుంది. ‘కర్మ సిద్ధాంతం’ గురించి అనేక మంది పుణ్య పురుషులు వివిధ గ్రంథాలలో తెలియజేసినప్పటికీ, ఆ సారాంశం కాల్పనిక సాహిత్యంలాగా పాఠకులను ఆకట్టుకోలేక పోయింది. ఫలితంగా భారతీయులందరూ నెత్తిన పెట్టుకుని పూజించాల్సిన ఈ సిద్ధాంతం ఒక వర్గం లేదా మతం నమ్మకం స్థాయిలోనే ఉండిపోయింది. కర్మ సిద్ధాంతం గురించి సాధారణ పాఠకులకు సైతం అర్థం కావాలని ఈ పుస్తకం రచించారు. కర్మను ‘ప్రశ్న-జవాబు’ రూపంలో విశే్లషించారు.