అక్షర

చదవాల్సిన కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొయిన్, రాక్షసుడు
రచన అనుష్కాశంకర్,
అనువాదం: కె.సురేశ్
పే: 106; వెల: రూ.100/-
మంచి పుస్తకం, వీధి నెంబర్-1, తార్నాక, సికిందరాబాద్- 500017.
**
ఇది పిల్లల పుస్తకం. ఇంతకూ పిల్లల పుస్తకాలంటే ఎట్లుండాలన్నచోట మొదలుపెడితే మన దేశంలో నీతి కథలు మాత్రమే పిల్లల కొరకు కేటాయిస్తారు. ప్రతి కథలో ఒక సందేశం ఉండాలి. లేకుంటే అది పిల్లల రచన కాదు. ఇక మరొక భయంకర మయిన ట్రెండ్‌లో పిల్లల రచనలు అంటూ, ప్రపం చంలోని జానపద కథలన్నింటినీ, వర్గీకరించి అందిస్తున్నారు. మామూలుగా చెప్పే వీలుండే కథలను కూడా బలవంతంగా జానపదం చేసి చెప్పి ‘శభాష్’ అనుకుంటున్నారు.
మొయిన్, రాక్షసుడు అనే ఈ కథలో నీతులు లేవు. సందేశాలు ఉంటే అవి అనుకోకుండా అందేవి మాత్రమే. పడమటి దేశాల కథల ప్రభావంతో ఈ రచయిత్రి పనె్నండుదాకా పుస్తకాలు రాసి పేరు సంపాయించుకున్నారు.
మొయిన్, రాక్షసుల మధ్యన ఒక కామా ఉంది. మొయిన్ రాక్షసుడు కాదు. మొయిన్ ప్రాణానికి ఒక రాక్షసుడు తారసిల్లుతాడు. మొయిన్ లాగే రాక్షసుడు కూడా అంతంత తెలివిగలవాడు. మన జానపద సినిమాల్లో క్రూరులతోబాటు దద్దమ్మ రాక్షసులను మనం చూచాము. ఈ రాక్షసునికి తన గురించి వర్ణించుకోవడం చేతగాదు. మొయిన్‌కు వాని బొమ్మగీయడం చేతగాదు. చేతనయిన రకంగా బొమ్మగీస్తే ‘బఫూన్’ రాక్షసుడు బయటకు వస్తాడు. కథ సాగుతుంది. అందులో పాటలు కూడా ఉంటాయి. ఈ రచయిత్రి పుస్తకాలలో అర్ధంలేని కథతోబాటు అర్ధంలేని పాటలు ఆకర్షణలుగా ఉంటాయి మరి! అందుకే పుస్తకాన్ని చదువుతూ పాడుతూ వినిపిస్తే బాగుంటుంది.
కథ సాగాలంటే అమ్మ, నాన్న, దోస్తులు, బడి, కుమారక్రిష్ణ అనే కూకీ అనే హెచ్‌ఎం సంగీతం మేష్టారు మరెందరో ఉండాలి మరి! వాండ్లంతా అట్లాగె ఎందుకున్నారు, మరో రకంగా ఉండే వీలులేదా అన్న ఆలోచన పుస్తకం చదివినవారికి కలిగితే సందేశం దొరుకుతుందేమో? వెతికి సందేశం పట్టుకుని పుస్తకాన్ని ఆదర్శగ్రంథం చేసే ప్రయత్నం అవసరమా?ఇది మంచి పుస్తకం. అందరూ చదవాలి! పిల్లలే కాదు! అందరూ చదవాలి!

- కె.బి.గోపాలం