అక్షర

చిచ్చరపిడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిచ్చరపిడుగులు (నవల)
(హకల్ బెరిఫిన్ సాహసాలు)
ఆంగ్లమూలం: మార్క్‌ట్వేన్
సంక్షిప్త స్వేచ్ఛానువాదం:
ఎమ్.వి.వి.సత్యనారాయణ
వెల: రు.60/-
ప్రతులకు: మంచిపుస్తకం,
12-13-450, వీధినెం 1
తార్నాక, సికింద్రాబాద్ 500017

ప్రసిద్ధ అమెరికన్ రచయిత మార్క్‌ట్వేన్ పిల్లల కోసం రాసిన నవల ‘టామ్‌సాయర్’ అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఆ నవలకు కొనసాగింపుగా మార్క్‌ట్వేన్ ‘హకల్ బెరీఫిన్ సాహసాలు’ పేరిట మరో నవల రాసాడు. అది కూడా ప్రపంచ భాషలలోకి అనువదింపబడి ప్రాచుర్యం పొందింది.
హకల్ బెరీఫిన్ నవలకు ఎమ్.వి.వి.సత్యనారాయణ చేసిన సంక్షిప్త స్వేచ్ఛానువాదం, ‘శ్రీవాణి పలుకు’ పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన తరువాత ఇప్పుడు పుస్తకంగా విడుదల చేసారు.
‘జిమ్’ అనే పేరుగల నీగ్రో బానిసకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రసాదించడానికి, హకల్ బెరీఫిన్ పడినపాట్లు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. రెండువందల సంవత్సరాల కిందటి అమెరికన్ గ్రామీణ జీవితం ఇందులో కనిపిస్తుంది. అప్పట్లో ఆఫ్రికా దేశాలనుంచి నీగ్రో జాతి మనుషులను ఎత్తుకొచ్చి అమెరికాలో బానిసలుగా అమ్ముతుండేవారు. పారిపోవడానికి వీల్లేకుండా వాళ్ల ఒంటిమీద పచ్చబొట్టులాంటిది వేసేవారు. ఆనాటి పరిస్థితుల్లో ఒక బానిసకు స్వేచ్ఛను ఇవ్వడానికి హకల్ బెరీఫిన్ పూనుకోవడం ఒక సాహస కార్యమే.
ఇంగ్లీషు పుస్తకానికి సంక్షిప్తంగా చేసిన అనువాదం బాగుంది. సరళమైన భాషలో అనువదించడం విశేషం.

-ఎం.వి.