అక్షర

ఆనందం.. ఆహ్లాదం.. ఈ కథానికల సారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తేనె చంద్రుడు’ సింహప్రసాద్ ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
***

45 ఏళ్లనుంచీ సాహిత్య కృషిని సాగిస్తున్న సీనియర్ రచయిత సింహప్రసాద్. రాసిన 287 కథల్లోనూ 50 కథలకు వివిధ పత్రికల నుంచీ బహుమతులు వచ్చాయంటే అది మెచ్చుకోవలసిన ఘన విజయం. అలాగే 56 నవలలు పత్రికల్లో వస్తే, వాటిలో 12 నవలలు బహుమతి నవలలంటే- అదేం సాధారణ విశేషం కాదు. ఈనాటి పత్రికా పాఠకులకందరికీ సింహప్రసాద్ పేరు బాగా పరిచితం.
‘తేనె చంద్రుడు’ సింహప్రసాద్ పదవ కథాసంపుటి. ఆహ్లాదకథానికల సంపుటి. పుస్తకంలో 14 కథలున్నాయి. అన్నీ ‘స’రసమైన ఆహ్లాదాన్ని పంచుతున్నవే. అన్ని కథల్లోనూ చదువరికి హాయిగూర్చే ‘టానిక్’ దినుసులు ఉన్నాయి. అందువలన ఆరోగ్యానికీ, మానసికోల్లాసానికీ హితవు కూర్చేవిగా ఉన్నాయి.
‘తేనె చంద్రుడు’ శీర్షికే అలతి నవ్వుని ప్రసరింపజేస్తోంది. ‘హనీమూన్’కి తెలుగు సేత ఆ పేరు! కొత్త దంపతుల ఢిల్లీ, ఆగ్రా వగైరా ప్రదేశాల యాత్రావర్ణనే కథాంశం. ఆ యాత్రా గమనంలో దంపతుల విరహం, విరహంలో కొంటెతనం, కినుకలు, కవ్వింపులు-సరదాగా జాలువారాయి. వారి త్రుళ్లింతల్ని థ్రిల్లింతలు చేసి కథన కుతూహలాన్ని అందించారు రచయిత.
‘తేనె చంద్రుడు’ కథకి రెండోవేపు వంటి కథే ‘ఆనందమానందమాయె’ అన్నది. ముగ్గురు పిల్లల సంసారం కల యువ దంపతుల ‘సెకండ్ హనీమూన్’ కథ ఇది. యాత్రలో చిరుచిరు సంతృప్తినీ, కొంచెం కొంచెం ఆనందాన్నీ అనుభవిస్తున్నా ఆ దంపతులకి- ప్రత్యేకించి నందినికి అడుగడుగునా, క్షణ క్షణం ఇంటిదగ్గరి పిల్లలే గుర్తుకొస్తూ వుంటారు. ఆహ్లాదంలో ఆరాటాన్ని ఎంతో సహజంగా, ఆర్ద్రంగా ఆవిష్కరించారు రచయిత. చాలా గాఢమైన అనుభూతి ప్రధానంగా సాగిన కథనం- చదువరుల మనసుల మీదా గాఢమైన ముద్రనే వేస్తుంది. మంచి కథ.
‘కౌన్ బనేగా కరీనాపతి’ పేరులోనే ఇతివృత్తం సూచన అందుతున్నది. కరీనా తాను వరించబోయే యువకునికి ప్రశ్న పంక్తిని శరపరంపరగా సంధించటమూ వంశీ ఆ పోటీలో నిలిచి గెలవటమూ ఈ కథ!
‘సమాగమం’లో బావమరదళ్ల హాస్య ప్రహసనం.
‘మూడో పురుషార్థం’- డబ్బూ, కెరీర్ పళ్లచక్రంలో ఇరుక్కుపోయి, నలుగుతూ దాంపత్య జీవన మాధుర్యాన్ని మరచిపోకండనే సందేశాన్నిస్తున్న కథ.
ఇలాగే, మిగిలిన కథల్లోనూ ప్రేమ, అనురాగం, శృంగారం సూత్రాలు బిగిసి ఉన్నాయి. అన్నీ చదివి ఆనందించదగినవే!
ఇవి ఆహ్లాద కథానికలే అయినా - మనుషులు ఎలాంటి ప్రదేశాల్లో ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఆలోచనలు చేస్తారో, ఎలా ప్రవర్తిస్తారో అనే ‘లోపలి’యథార్థాల్ని వీటిలో అంతర్లీనంగా చిత్రించారు రచయిత. ఈ గుణ విశేషంవల్లనే అవి కాలక్షేపం కథలుకాకుండా, అనుభూతి ప్రధానమైనవిగా రూపొందాయి. రచనలోని ఈ నైపుణ్యమే సింహప్రసాద్ కథలకి కీర్తికిరీటాల్ని సంపాదించి పెడుతోంది. పుస్తకాన్ని కొని చదివి ఆనందించండి!
***

సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-వి.