అక్షర

ఆరోగ్యకరమైన హాస్యం... వ్యంగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్భలే మంచి చౌక బేరము’ హాస్య కథానికలు
సింహప్రసాద్
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
***
ఈనాటి ఏ పత్రికా పాఠకులకైనా బాగా పరిచితమైన పేరు సింహప్రసాద్. ఆయన నాలుగు దశాబ్దాల పైబడి సాహితీ కృషి సాగిస్తున్నవారు. మూడువందల కథలూ, 56 నవలలూ, అనేక కవితలూ, నాటికలూ రాశారు. కాగా, 50 కథలకూ, 12 నవలలకూ వివిధ పత్రికల నుండి బహుమతులు పొందారు. ఇదొక అపూర్వమైన, అరుదైన విజయం. ఈ ‘్భలే మంచి చౌక బేరము’ సింహప్రసాద్ హాస్య కథానికల సంపుటి. 12 కథలు ఉన్నాయి. అదనంగా ‘ఝలక్’ పేరున వున్న హాస్య వ్యంగ్య కథనాలు- రాజకీయ లహరి- బోనస్‌గా వచ్చాయి.
హాస్య కథానికలకి పాఠకాదరణ తక్కువ అని ఒక అభిప్రాయం ఉన్నది. దీనికి ఒక కారణం హాస్య కథ అనగానే దానిలో ఈనాటి సినిమా టైపు వెకిలి వేషాల, చేష్టల ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉండటమే. రెండవ కారణం ఆ కథల్లో ‘మెలోడ్రామా’ ఆధిపత్యమూ అధికమవడం. ఈ కారణాలకి కడగా, అచ్చమైన హాస్యాన్ని తమ కథల్లో రంగరించారు సింహప్రసాద్.
ఇందుకు ముందుగా వారు అభినందనీయులు.
‘్భలే మంచి చౌక బేరము’ సంపుటిలోని కథలు సంభాషణల ద్వారా, సంఘటనల ద్వారా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన హాస్యాన్ని ఒలికించాయి. మొదటి కథ ‘్భలే మంచి చౌక బేరము’ - ‘‘4తి7 కేవలం యాభై వేలు మాత్రమే’ అని మొదలై ప్లాట్ల అమ్మకం, కొనుగోలు చుట్టూ తిరుగుతుంది. చివరికి ప్రజలు ఎగబడి కొనబోయిన, కొంటున్న సైట్‌లు- వారు మరణించిన తర్వాత సమాధులు ఏర్పాటుచేసుకోవటానికి ఉద్దేశించినవనే ముక్తాయింపు! అమ్మకందారు ‘మీ పేరు సత్యనారాయణ. మీ ఆవిడ పేరు సత్య గనుక వీటి దగ్గర్లో చిన్న ఆర్చీ కట్టి ‘సత్య , సత్యనివాస్’ అని పేరు పెడతాం. ఆ ఖర్చు మేమే భరిస్తాంలెండి’ అని భరోసా ఇస్తాడు. వీరిద్దరూ ‘హమ్మయ్య! ఇంక మేం నిశ్చింతగా చచ్చిపోవచ్చు’అనుకుంటూ ఆనందించారు! ఇక ‘్భగ్’బుచ్చ్భీగ్’ అనేది నగరంలో ఫంక్షన్లలో, పెళ్లిళ్లలో జరిగే విందులకి వారువీరనేది లేకుండా ఎవరైనా జొరబడే అవకాశాన్ని వినియోగించుకునే మిత్ర ద్వయం కథ. సరదాగా సాగింది ప్రహసనం! ‘మా ఆవిడ బంగారం’ సున్నితమైన మానవీయ సంబంధాల అంతర్లయతో సాగిన మంచి కథ. ఆడవాళ్లకి బంగారమంటే ఉన్న మోజు వెనుకగల అర్థాన్నీ, పరమార్థాన్నీ చాలా కథాత్మకతతో చిత్రించారు సింహప్రసాద్. ఈ కథ కన్నడంలోకీ అనువాదమైంది.
‘హోటల్ చంచల్’అనే కథ సింహప్రసాద్ కలంలో ఉన్న వ్యంగ్య బలానికి ఉదాహరణ. ముళ్లపూడి వెంకటరమణ రాజకీయ భేతాళ కథల్ని స్ఫురణకు తెచ్చింది. ఒక బతకనేర్చిన యువకుడు ఊరికి ఉత్తరంగా, జైలుకు దగ్గరగా స్టార్ హోటల్ నిర్మించి అందినంతమేరకి లాభాలార్జించటం ఇతివృత్తం. అతని విజయాలకి కారణం అక్కడి జైలు విఐపిల జైలుకావటమే. కోట్లు తిన్న పారిశ్రామికవేత్తలూ, అవినీతి నాయకులూ, మంత్రులూ, ఐఎఎస్ అధికారులూ- చాలామందికి అది నెలవు అవుతోంది. ఆయా విఐపిల బంధుమిత్ర పరివారమంతా ఇక్కడ ఈ హోటల్లో బస చేయాల్సిందే! అదీ ఆ ‘రష్’కి కారణం! ఆ యువకుడు ‘నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా హోటల్ తీహార్ కడదామని ప్లాన్ చేస్తున్నా’నంటున్నాడు! ‘గణగణ గంటలు’ పుస్త
కాల కబ్జాని కథనంగా చిత్రిస్తే, ‘కత్తెర అనగా కత్తిరించు ఆయుధము’ అనే కథ మంత్రిగారు బంగారు కత్తెరని జేబులో వేసుకుని నొక్కేసే చాకచక్యాన్ని చిత్రికపట్టి చూపింది! కూటికోసం కోటి విద్యల్లో ‘ఇచ్చట సన్మానములు చేయబడును’కూడా చేరింది కదా. దాని తతంగమంతా వచ్చింది- ‘సన్మానం’ కథలో. అతి తెలివిగా తనకింది ఉద్యోగుల మీద పడి పేరసైట్‌లా విందు భోజనాలు లాగించే బాస్‌గారికి తగిలే ఎదురుదెబ్బని ‘బాసాసురుడు’ కథ తెలియజేస్తుంది. ఇలాగే మిగిలిన కథలన్నిటా హాస్యం పండింది.
ఎంచుకున్న ఇతివృత్తాన్ని సూటిగా, సరళంగా చదువరికి చేరవేయగల కథాకథన నైపుణ్యం ఉన్న అనుభవశాలి సింహప్రసాద్. అందుకనే, ఈ కథానికలన్నీ ఒక్క పట్టున చదివింపజేస్తున్నాయి. కథలన్నిటా పూసల్లో దారంలా- మనుషుల భిన్నభిన్న మనస్తత్వాల చిత్రణ దాగివుండటాన్నీ చూస్తాము. పాఠకుల ఆదరణతోపాటు, బహుమతుల ఘనతనీ సొంతం చేసుకున్న సింహప్రసాద్ అభినందనీయులు!

- విహారి