అక్షర

కొత్త తరం కథల కాణాచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్వలనం (మల్లెమాల కథలు-7)
డా.మల్లెమాల వేణుగోపాలరెడ్డి
వెల: రూ.100/-
ప్రతులకు: రచయిత,
సింహపురి కాలనీ రోడ్ నెం.3, కడప
***
ఏడు కథా సంపుటాలు, నవల, నాటిక, అనువాదాలు, పురస్కారాలు సన్మాన సత్కారాలు పొందిన డా.మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డిగారు వృత్తిరీత్యా వైద్యులు. ప్రవృత్తి రీత్యా సాహితీవేత్త. ఎనిమిది పదుల వయసుకు చేరువవుతున్నా, రచనా వ్యాసంగం, ఆధ్యాత్మికం, సంఘసేవ, వైద్యవృత్తికి సమన్యాయం చేకూర్చుతూ, కాలాన్ని సమర్ధవంతంగా, తనతో లాక్కెళుతున్న వ్యక్తి. ప్రముఖ సాహితీవేత్త కేతు విశ్వనాథరెడ్డిగారన్నట్లు ‘‘డాక్టర్లకు, లాయర్లకు భిన్న జీవితాల పరిచయాలు. ఆ జీవితాల్లోని బాధలు, మంచిచెడ్డలు, ఘర్షణలూ ఇతర రంగాల్లోని వారికంటే ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది.’’ సృజనాత్మకత, పరిశీలనాశక్తి, కల్పన, సంవేదనలు ఒంటపట్టించుకున్న డా.మల్లెమాలగారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సమాజ సేవ పట్ల తన ఆసక్తిని ఆధ్యాత్మిక జిజ్ఞాసనీ, మేళవించి మంచి కథల్ని మనకందిస్తున్నారు.
గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు జీవితంలో ఎన్నో పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. విద్య, విదేశ ఉద్యోగావకాశాలు, కమ్యూనికేషన్స్, రియల్ ఎస్టేటు- ఈ రంగాల్లో మార్పులు ముఖ్యమైనవి. వీటి పట్ల రచయితలు- ముఖ్యంగా సామాజిక స్పృహ ఉన్న రచయితలు దృష్టిసారిస్తున్నారు. అనుభవంలోకి వచ్చిన, అవకాశాల్ని అలవోకగా అందిపుచ్చుకుంటూ మంచి మంచి రచనల్నీ పాఠకుల్లో ఆలోచనలు రేకెత్తించే విధంగా వ్రాస్తున్నారు. ఈ సంచికలోని పదమూడు కథల్లో రచయిత ఇవే విషయాల్ని మనముందుంచారు.
వీరి ఈ 13 కథలు మే 2015 నుండి 2016లో వివిధ పత్రికల్లో ప్రచురించబడినవే కావటం విశేషం. దీన్నిబట్టి రచయిత, మారుతున్న కాలాన్ని, మారే పరిస్థితుల్ని ఎంత ప్రతిభాపూర్వకంగా తన కథల్లోకి ఎక్కించగలిగాడో తెలుస్తుంది.
సంపన్నులూ వారి పిల్లల ఆగడాలు ‘‘్భవన మనోహరం (పే1)లో వివరిస్తే, రియల్ ఎస్టేటు ‘‘బూం’’అది తెచ్చే దుష్పరిణామాలు, భూమి మీద మమకారం వదులుకొని తండ్రులు, డబ్బుకే విలువ ఇచ్చే పిల్లలు- వీరిద్దరిలో తండ్రులు ఎలా బలి అవుతారో చెప్పబడింది (ప్రపంచీకరణ). ‘‘వ్యక్తిత్వ లోలకం’’(పే12)లో, తల్లికే, కొడుకూ, కోడలి మధ్య శూన్యతను, తల్లిని, అర్ధంచేసుకోలేకపోతే.. మనవడు, నానమ్మను ఎలా అర్థం చేసుకుని ప్రోత్సహిస్తాడో చెప్పబడింది.
‘ఇది కథకాదు’ (పే 27) ‘చీకటి వెలుగుల రంగేళీ’ (పే 47). ‘రుణ రాక్షసం’ (పే 59)- ఇవి నిజంగానే కథలు కావు. జీవితాల చిత్రీకరణ. అల్పపీడనం, తుఫానులు ఎంతటి అభివృద్ధి చెందిన నాగరిక జీవితాలనయినా అతలా కుతలం చేస్తాయని, జీవితం అంటే దీపావళి వెలుగులు, చిచ్చుబుడ్లు, మతాబాలు, పిండి వంటలే కావని, బాగా బ్రతికిన, శ్యామల లాంటి వాళ్ళ జీవితాల్లో విషాదము, చీకటీ ఉంటాయని తెలుపుతాయి. ఈమధ్యే వచ్చిన కాల్‌మనీ దురాగతాల్ని ‘‘రుణ రాక్షసం’’లో ఏకరువుపెట్టిన తీరు రచయితకు సమకాలిక సమస్యలపైన ఉన్న అవగాహన విశదమవుతుంది.
వారి కథాకథనం, శిల్పం, పాఠకుడ్ని విడవక చదివిస్తాయి. సాటి మనిషి పడే వ్యధల్ని పాఠకుల కళ్ళముందు నిలుపుతారుూకథలు. మ్యాచ్ ఫిక్సింగ్ (పే 22) చరమాంకం (పే 34) వంటి కథల ద్వారా హాస్యాన్ని కూడా పండించగలనని ఋజువుచేసారు డా.మల్లెమాల.
కథ చివరి ‘కొసమెరుపు’ వాక్యాలు. రచయిత ‘ప్రత్యేకత’గా నిలుస్తాయి. పాఠకుడిని కాసేపు అలా, ఆపి, ఆ వాక్యాల్ని మళ్ళీ మళ్ళీ చదివిస్తాయి. కొడుకులు పంచుకుపోయిన పొలం తాలూకు డబ్బు గురించి చెబుతూ (ప్రపంచీకరణం పే 12) ‘‘పోలిరెడ్డి పొలం విమానాలెక్కి వెళ్ళిపోయింది. సగం స్వదేశానికి (ముంబయిలో ఉద్యోగంచేస్తున్న కొడుకు) సగం విదేశానికి (ఎన్.ఆర్.ఐ. కొడుకు) అంటారు. అలాగే శిరస్త్రాణంలో.. (పే 46) ‘‘చచ్చి బ్రతికిన వారిలో క్రొత్తగా ఆలోచించే గుణం అసంకల్పితంగా వస్తుంది’’ అంటారు.
రచయిత భద్రలోక యువకుల గురించి వ్రాసినా (్భవన మనోహరం), ప్రకృతి వైపరీత్యాలవల్ల ఛిద్రమైన బ్రతుకుల గూర్చి వ్రాసినా (ఇది కథ కాదు), కాల్‌మనీ రక్కసి గురించి వ్రాసినా (రుణ రాక్షసం), అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే వ్రాసి, కథలకు సంపూర్ణత చేకూర్చారు. ఆధునిక మానవీయ, సమకాలీన, ఆధ్యాత్మిక దృష్టితో వ్రాసిన ఈ కథలు మానవతకు అద్దం పడతాయి.

-కూర చిదంబరం