అక్షర

అంబేద్కర్ గొప్పదనంపై వినూత్న విశే్లషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబేద్కర్ బ్రాహ్మణుడు
మరికొన్ని ఆలోచనాత్మక వ్యాసాలు
-వుప్పల నరసింహం
పేజీలు- 100..
వెల: రూ.100/-
జ్ఞానం పబ్లికేషన్స్
మిలేనియం హోమ్,
2-3-753/1/4
తులసినగర్ కాలనీ
హైదరాబాద్ - 500 013
ఫోన్- 9985781799

సంచలనాత్మకంగా ఆలోచనలు రేకెత్తించే విషయాలను ప్రస్తావిస్తూ వ్యాసాలు రాయడం వుప్పల నరసింహం గారికి కొట్టిన పిండి.
గురజాడ అప్పారావు గారు ముత్యాల సరాలలో ‘మతములన్నీ మాసిపోవును. జ్ఞానమొక్కటే నిలచి వెలుగును’అని వంద సంవత్సరాల కిందటనే చెప్పారు. మతాలు మాసిపోలేదు గాని, జ్ఞానం మాత్రం సర్వదేశ దశా కులాలలోను అవ్యాహతంగా పెరుగుతూ వస్తోంది. బ్రాహ్మణుడు అంటే ఆధిపత్యానికి పర్యాయపదం అనే చిత్రణచేస్తూ దాన్ని గురించి అనేక ప్రశ్నలు లేవదీసారు నరసింహం. చారిత్రకంగా చూస్తే బ్రాహ్మణుడు జ్ఞానానికి కూడా పర్యాయపదం అనే విషయం స్పష్టమవుతుంది. జ్ఞానం క్రమంగా మానవ స్వభావంలో విడదీయటానికి వీలులేకుండా కలిసిపోవల్సిన తరుణం ఇంకెంతో దూరంలోలేదు. అంబేద్కర్ అనే ఆయన దళిత వర్గాలకు చెందిన వాడయినా జ్ఞానానికి ప్రతీకగా నిలబడి రాజకీయ, సాంస్కృతిక వ్యవహారాలు సరిచేయగలిగాడు కనుక అతను తప్పనిసరిగా ‘బ్రాహ్మణుడే’ అని నరసింహం గారి వాదన. ఇందుకు యాదృచ్ఛికమైన కారణాలు బ్రాహ్మణ ఉపాధ్యాయులు తన ఇంటి పేరు భీమారావుకు ఇవ్వటం, చివరిరోజుల్లో ఒక బ్రాహ్మణ మహిళ అంబేద్కర్‌ని వివాహమాడడం. కులం ఏదైనా గుణం, సౌశీల్యం, లాలిత్యం, సౌకుమారం అనేవి మానవ సహజ లక్షణాలుగా పరిగణన పొందవల్సిన అవసరం ఉంది. సరికొత్త మానవాళి ఈ రూపులోనే మలుపు తిరుగుతోంది.
‘‘బౌద్ధానికి ప్రాసంగికత లేదు’’ అన్న అభిప్రాయంతో దాదాపు ఎవ్వరూ అంగీకరించరు. బుద్ధుడు సామాజికంగా లౌకికవాది. అతడు చెప్పిన జీవన సూత్రాలు అనుసరించినవాళ్ళు ఎవ్వరూలేరని, తద్వారా తరించినవాళ్ళు అసలేలేరని అనడం సరైన అభిప్రాయంకాదు. ఆదర్శాలు ఎప్పుడూ ఆచరణలకు పై అంతస్తులలోనే ఉంటాయి. కాలక్రమంలో మటుకే అవి ఆచరణతో ఊతప్రోతంగా కలిసిపోతాయి. ప్రజాజీవితం, జీవన విధానం ఈ మూడు వేల సంవత్సరాల మనుగడలో ప్రపంచమంతటా ఎంతగా పరిణతి చెందిందో గమనించినప్పుడు బౌద్ధానికి ప్రాసంగికత లేదు అనడం కంటే, సర్వదేశ దశాకాలాలకు ఇదే అన్వయ సూత్రం అనే విషయం స్పష్టపడుతుంది.
‘్ఫలే’ను గురించి రాసిన వ్యాసం, ఒద్దిరాజు సోదరులను గురించిన సారస్వత వ్యాసం చాలా ప్రామాణికమయినవి.
తతిమా వ్యాసాలన్నీ మావోయిష్టులు, వామపక్షాలు, కమ్యూనిస్టులు ప్రస్తుత రాజకీయ వాతావరణంలో విరివిగా ప్రచారం చేస్తున్న దురభిప్రాయాలను తూర్పారకట్టేది. వీటిలోని సమంజసత పాఠకులు ఎంత త్వరగా తెలిసికోగలిగితే అంత త్వరితగతిని అభ్యుదయ ప్రచారకులు కాగలుగుతారు.
అనుబంధంలో చేర్చిన ‘కోహినూర్’, ‘కె.సి.ఆర్.’ను గురించిన వార్తా వ్యాఖ్యలు సమకాలీన తెలంగాణా వైభవానికి దివిటీలు.
దళిత దౌర్జన్యం పేరుతో వ్రాసిన వ్యాసం అంతా రచయిత పడుతున్న కడగండ్లకు అక్షర రూపం. చదువరులు, సాంకేతికకర్తలు, రాజకీయవేత్తలు ఈ విషయాన్ని గమనించి తగిన చర్యలు ప్రారంభించి, రచయితకు ఎలాంటి ఆపద రాకుండా రక్షణ కల్పించాలి. తమిళనాడులో కొందరు రచయితలకు సంభవిస్తున్న అన్యాయాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలకు విస్తరించకూడదు. ఇది ఘనతరమైన సాంఘిక బాధ్యత.

-శ్రీవిరించి