అక్షర

వేకువ (పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేకువ
(కథాసంకలనం-2)
-కూర చిదంబరం
వెల: రూ.100/-
ప్రతులకు: సౌమిత్ర ప్రచురణలు
6-1-118/19, పద్మారావ్‌నగర్
సికిందరాబాద్-500 025.

చిదంబరం గారి రెండవ కథానికా సంపుటి ఇది. ఇందులో 23 కథానికలు ఉన్నాయి. ప్రక్రియా పరంగా చిన్న కథని చిన్న కథగానే రచించగల నేర్పూ, నిబద్ధతా రచయిత సొత్తు. చిన్న కథ, లేక కథానిక ఒకే అంశాన్ని ప్రతిపాదిస్తుంది. కేంద్రీకరిస్తుంది. ఆ అంశం మనిషి జీవితంలోని ఒక ఘటన కావచ్చు. లేదా ఒక మనస్తత్వ వీచిక కావచ్చు. కాకున్నా బతుకు పట్టకంలోని ఒక కేంద్రాన్నో, పార్శ్వాన్నో స్పృశిస్తుంది. అయితే, ఇదంతా శిల్పపరంగా ఆవిష్కృతవౌతుంది. కథానికలో మనిషి జీవితమంతా ఊకదంపుడుగా పేజీలకు పేజీలు పరచుకోదు. జీవిత నేపథ్యం ఉంటుంది. చిదంబరం గారి కథానికలకి ఈ సాంకేతిక విజ్ఞానం ఉన్నది. అందుకనే అవన్నీ ఎక్కడ మొదలవ్వాలో అక్కడే మొదలై, ఎలా నడవాలో అలాగే నడిచి, పాఠకుని తనతో నడిపించుకుంటూ, ఎక్కడ ముగియాలో అక్కడ ముగుస్తాయి. అంతేగాక, ఎలా ముగియాలో కూడా వాటికి తెలుసు. పట్టు విడుదల ఒడుపూ, కథానికా ప్రయోజనం, ప్రాధాన్యమూ తెలిసిన రచయిత వాటిని అలా నిర్వహించి చక్కని చుక్క పెడతారు. ఈ గుణ విశేషాలన్నిటికీ దాఖలాల్ని ఈ సంపుటిలోని కథానికల్లో చూడవచ్చు.