అక్షర

కళ్లతో కథా ప్రపంచాన్ని చూసొద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలివాడ కాంతారావు
స్మారక కథానికా
సంకలనం-2016
-డిఎస్‌వి గోపీకృష్ణ
పేజీలు: 185
వెల: రు.100
ప్రచురణ
భారతనిధి ఫౌండేషన్
ఫ్లాట్ నెం 1
మొదటి అంతస్తు
ఎవిఆర్ ఎన్‌క్లేవ్
దొండపర్తి,టిఎస్‌ఎన్ కాలనీ, విశాఖపట్నం 530016
ఫోన్ 9866539993
**
బలివాడ కాంతారావుగారు 20వ శతాబ్దంలో పుంఖాను పుంఖాలుగా నవలలు, కథలు రాసి గణితికెక్కిన తెలుగు రచయిత. ఆయన వ్రాసిన మొదటి నవల ‘గోడమీది బొమ్మ’తోనే తన పాఠకులను సమీకరించుకోగలిగారు. ఈ రచయిత మరణానంతరం ‘్భరత నిధి’ ఫౌండేషన్ పేరుతో ఒక సంస్థను స్థాపించి, వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా డిఎస్‌వి గోపీకృష్ణగారు తెలుగు సాహిత్యానికి తగుమాత్రం ఉపాదానం కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో మొదటి భాగంగా కథల పోటీ ఏర్పరిచి ఆ పోటీలో వచ్చిన కథలను ఎంపిక చేసి ఈ సంకలనాన్ని తీసుకువచ్చారు.
ఈ సంకలనంలో మొదటిగా బలివాడ కాంతారావుగారి కథ ‘కిటికీ’ చేర్చడం ఎంతో సముచితంగా వుంది. కాంతారావుగారి అంతఃస్పూర్తికి ఈ కథ ఒక మంచి తార్కాణం.
కథానిక పోటీలో మూడు బహుమతులు, రెండు కన్సొలేషన్ బహుమతి కథలు వీటితోపాటు పదిహేను మామూలుగా ఆదరించిన కథలు ఈ సంకలనంలో వున్నాయి.
మొదటి బహుమతి కథ బతుకుమీద నిరంతర కాంక్షతో మృత్యు ధోరణినుంచి తప్పించుకుని బయటపడిన యువతీ యువకులది. ఈ కథను చక్కని చాకచక్యంతో ‘్భవనచంద్ర’ తయారుచేసారు.
అతికామాతృత వున్న భర్తనుంచి దూరం తొలగిపోయి ఆర్థిక స్వాతంత్య్రంతో ధైర్యంగా రోజులు వెళ్లదీస్తున్న యువతిని, అత్తింటి వారు తిరిగి ఆహ్వానించి దగ్గరకు చేర్చుకోవడం రెండవ బహుమతి పొందిన కథ. దీని రచయిత విహారి కథనాన్ని నిపుణంగా రూపొందించారు.
మూడవ బహుమతి పొందిన కథలో ఆగర్భ దారిద్య్రంతో మునిగిపోయినా, గర్భాన్ని అద్దెకు ఇచ్చి తాను కన్న పసివాడ్ని అమ్ముకోవడానికి నిరాకరించిన బీదరాలి కథ. ఇది సలీం రచన. స్ర్తి మనస్తత్వాన్ని చక్కగా అర్ధం చేసుకున్న వాతావరణం మనకు కన్నులకు కడుతుంది.
ఇలాగే తతిమా కథలన్నీ కూడా ప్రపంచాన్ని రకరకాల కన్నులతో చూపి చదువరులను అలరింపచేస్తాయి. రైతుల కష్టాలు చెప్పే కథలు, రూరల్ రికనస్ట్రక్షన్ అనే గాంధీకలను గుర్తు చేసే కథ, పిల్లకు ఇష్టపడ్డ గౌను కొనివ్వలేని ఆవేదన, కాటన్ దొరను గురించిన ఊహా చిత్రం, అత్యవసరమైన ఒప్పుదల కూర్చిన మొదటిరాత్రిలో ఒక వితంతువు, ఒక విధురుడు కొత్త తరహాలో దాంపత్యం సాగించడం, వాటి సన్నివేశాలు కథలలో చోటుచేసుక్నుయి. సోది చె ప్పేవాళ్లను పోషించడం కూడా గ్రామస్తుల బాధ్యతే అని గుర్తు చేస్తారు ఒక సర్పంచి ఒక కథలో. కొడుకు బర్త్‌డే ఘనంగా గడుపుకుందామన్న ఉధ్యోగస్తుడు తప్పనిసరిగా చేయాల్సిన రైలు ప్రయాణంలో బిచ్చగాళ్ల పేదరికం చూసి స్పందించి వాళ్లకు డబ్బు దానం చేయడం మరో కథలో కనిపిస్తుంది. మరో కథలో తల్లి ప్రేమను కాకిపిల్లలా నమూనాతో గాని అర్ధం చేసుకోలేని కాలేజి లెక్చరరు కనిపిస్తాడు. తెలుగు పుస్తకాలు అమ్ముకోలేని రచయిత దగ్ధ మరో కథలో ప్రదర్శితమవుతుంది. ఇలా అన్ని కథలు ఏదో ఒక కోణాన్ని సూటిగా, ఘాటుగా చూపిస్తాయి.
కథా, నవలా రచయిత పేరిట ప్రారంభించిన ఫౌండేషన్ వారు ఇలా కథల సేకరణతో, ప్రచురణతో తృప్తిపడడం కాకుండా ఆ రచయిత యొక్క రచనా వైవిధ్యాన్ని, లాలిత్యాన్ని, ప్రగాఢతను ప్రస్పుటం చేసే విమర్శ గ్రంథాన్ని వ్రాయించి ప్రచురించితే ఆ రచయితకు న్యాయం జరిగినట్టవుతుంది. భవిష్యత్ రచయితలకు దారి దీపంగా వుంటుంది. ఫౌండేషన్ వారు ఈ సూచనను ఆదరించడం యుక్తం. ఇది మొదటి ప్రచురణ కనుక రచయిత యొక్క సాహితీ ప్రయాణాన్ని, జీవన గమనాన్ని తెలిపే అనుబంధాలు చేర్చడం చారిత్రక అవసరం.

-ఎస్వీ