అక్షర

ఆధునిక సాహితీ రూపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభినవాంధ్ర సభ -1933
(బరంపురం)
-డా.తుర్లపాటి రాజేశ్వరి
వెల: రూ.75/-
ప్రతులకు: రచయిత్రి
08093520819
**
రూపకం అనేది నాటకానికి పేరు. నాటక భేదాల్ని దశ రూపకాలుగా ధనంజయుడు రాశాడు. అయితే సాహితీ రూపకం వేరు. ఇది ప్రదర్శన యోగ్యంగా, సంగ్రహంగా, గంటలోపు ప్రదర్శింపబడేలా ఉండాలి. దీనికి ప్రత్యేక లక్షణాలంటూ లేవు గానీ సాహితీ రూపకం అంటే గుర్తుకు వచ్చేది ‘్భవన విజయం.’ ఆ తర్వాత దాదాపు పాతికపైనే సాహితీ రూపకాలు వెలువడ్డాయి. తుర్లపాటి రాజేశ్వరి కవయిత్రి, రచయిత్రి. మంచి పరిశోధకురాలు. ఒరియాకి తెలుగుకి సంధానకర్తగా బరంపురంలో ఉంటున్నారు. 1933లో బరంపురం (బ్రహ్మపురం)లో అభినవాంధ్ర కవి పండిత మహాసభ జరిగింది. ఆధునిక సాహిత్య చరిత్రలో ఈ సభ ఒక గొప్ప సంఘటన. దీనిని ఇతివృత్తంగా తీసుకొని రాజేశ్వరి ఈ సాహితీ రూపకం రచించారు.
గిడుగు రామమూర్తి పంతులు సభలు ప్రారంభించగా, చిలుకూరి నారాయణరావు అధ్యక్షత వహించారు. ఈ సభల నిర్వహణలో గొప్ప పండితులు, బహు గ్రంథకర్త పంచాగ్నుల ఆదినారాయణశాస్ర్తీ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సభల స్ఫూర్తితోనే ‘నవ్య సాహిత్య పరిషత్తు’ ప్రారంభమైంది. ఈ మహామహులే కాకుండా ఈ రూపకంలో దేవులపల్లి, శివశంకరశాస్ర్తీ, వేదుల, తాపీ ధర్మారావు, శ్రీశ్రీలతో కలిపి మొత్తం పదిహేను మంది సాహితీ దిగ్గజాలు పాత్రలుగా కనిపిస్తారు. మొత్తం మీద ఈ సభ ‘వ్యావహారికాంధ్రం అపరిమిత ప్రయోజనం గలది ప్రజలలో జ్ఞానాభివృద్ధి కలగడానికి ఇది పరమ సాధనం’ అనే ఉద్దేశంతోనే జరిగింది. ఈ రూపకం ప్రదర్శిస్తే ఒకనాటి సాహిత్య వాతావరణం అవగతమవుతుంది. భాషా సంస్కరణ తొలి నాళ్లలో ఎలా జరిగిందో తెలుస్తుంది. ఈ రూపకంలో ఉదాహరణలుగా కవితలు, గేయాలు కనిపిస్తాయి. కవుల చర్చను మరింత ఆసక్తిదాయకంగా కొనసాగించవచ్చు కానీ అప్పుడది నాటకంలా మారి ప్రదర్శన సమయం ఎక్కువవుతుంది. కావాలంటే ప్రదర్శకులు మార్పులూ చేర్పులూ చేసుకోవచ్చు. ఇటువంటి సాహితీ రూపకాలు అన్ని ప్రాంతాల నుంచి రావల్సి ఉంది. *