అక్షర

అవయవ దానంపై అవగాహనకు మేలైన ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దానాలలో కన్నా గొప్పదానం
(అవయవదాన అవగాహనని
పెంచే కథానికలు)
డా.వేదగిరి రాంబాబు
పేజీలు: 114, ధర: రూ.60/-
ప్రతులకు: శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్,
బ్లాక్-6, ఫ్లాట్-10, హెచ్.ఐ.జి-1
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్- 500 044
9391343916
**
ఏదైనా సిద్ధాంతాన్ని, సరికొత్త ప్రతిపాదనను చదువరుల దృష్టికి సూటిగా తీసుకువెళ్ళాలంటే అందుకు ‘కథానిక’అనే సాహిత్య ప్రక్రియయే ఎంతో ఉపయుక్తమైనదని నిరూపించే కథా పుస్తకం ఇది. దానాలలో గొప్పదానం ఏది? అంటే నిదానం అని ఒక వాడుక ఉంది. నిదానం మనిషి యొక్క మనస్తత్వానికి, ఆలోచనా ధోరణికి పనికివచ్చేదే అయినా శరీరానికి సూటిగా ఉపకరించేది అవయవదానం అనే సంగతి ఇప్పుడిప్పుడే ప్రచారంలోనికి వస్తోంది. ఒక మనిషి అవయవాలను, మరో మనిషికి ఉపయోగించడం కళ్ళతో ప్రారంభమయినా (నేత్రదానం) ఇప్పుడిప్పుడు ఇతర అవయవాలను కూడ వైద్యపరిజ్ఞానం పెరిగినందువల్ల బహుతేలికగా, అలవోకగా చేయడం మనం వార్తా పత్రికల ద్వారా చూస్తూనే వున్నాం. గుండె మార్పిడి ఇదివరలో చాల ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు బ్రెయిన్‌డెడ్ అయినటువంటి మనిషి యొక్క ఇతర అవయవాలను అతడు పూర్తిగా మరణించకముందే తీసి భద్రపరచి ఇతరులకు ఉపయోగించడం అనే ప్రక్రియ అలవాటులోనికి వస్తోంది. ఈ అలవాటును, అవసరాన్ని సామాన్య జనానికి అవగాహన అయ్యేందుకు దారితీసే కథానికలను వేదగిరి రాంబాబు తమ వైద్యావిషయిక పరిజ్ఞానాన్ని అనుసరించి కథాచాతుర్యం కొరవడకుండా చక్కగా తీర్చిదిద్దారు.
‘‘ఏకారణాన్నయినా బ్రెయిన్ డెడ్ అవ్వాలి. అవయవాలకు ఏ ఇన్‌ఫెక్షన్ లేకుండా ఆరోగ్యంగా ఉండాలి. ఇంట్లోవాళ్ళు అవయవ దానానికి ఒప్పుకోవాలి. ఆ సమయంలో మన అవయవాలకు మేచ్ అయి, మార్పిడికోసం ఎదురుచూస్తున్న స్వీకర్త ఉండాలి’’. అప్పుడే అవయవదానం సాధ్యమవుతుంది. (పేజీ 23) సామాన్య బుద్ధులు మనిషి ఆరోగ్యంగా ఎలా బతకాలో చెప్పాలి కాని, శరీర అవయవాలను ఎలా దానం చేయాలో చెప్పకూడదు. ఆ ప్రచారం మంచిది కాదు. అనుకుంటా! జీవితం ఇటువంటి దురభిప్రాయాలను మార్చుకోటానికి తగిన అవకాశాలను ప్రవేశపెడుతుంది. ఈ విషయాన్ని ‘కొత్తచూపు’ కథలో సరళంగా చూపించారు.
వైద్యరంగం ఇప్పుడు ఎంతగా అభివృద్ధి చెందిందో, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తినుంచి కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, మూత్ర పిండాలు, కాలేయం, పాన్‌క్రియాస్ మాత్రమే కాకుండా బోన్‌మారో ట్రాన్స్‌ప్లానే్టటన్స్, హాండ్ ట్రాన్స్‌ప్లాన్‌టేషన్స్ విరివిగా జరుగుతున్నాయన్న విషయం రచయిత రాసిన ముందుమాటలలో వివరంగా తెలిపారు. సామాజిక కోణంనుంచి ఇటువంటి ప్రయోగం ఎంతో శ్రేయోదాయకమైనవి.
అవయవ మార్పిడి పొందిన వ్యక్తికూడ తన ఆరోగ్యాన్ని గురించి తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అనే విషయాన్ని ‘ముగింపు ఇలా మాత్రం ఉండకూడదు’అనే కథానిక స్పష్టపరుస్తోంది. ఇలా సంపుటిలో ఉన్న పదహారు కథానికలలోను ఏదో ఒక కొత్తకోణం జీవితావసరాలకు ఉపయోగించే కొత్త సూత్రం కనిపిస్తుంది. ఈ రకమైన కొత్తతరహా ప్రయోగాన్ని చేసి కథానికా రచనను మరింత ప్రయోజనకరం చేసి, కొత్త మలుపుతిప్పిన రచయిత వేదగిరి రాంబాబుగారు ప్రశంసనీయమైన పని చేశారనడం అతిశయోక్తికాదు.

-శ్రీవిరించి