అక్షర

అమ్మవారి స్తుతికి అక్షర సుమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీదేవీ భాగవతము (తొమ్మిది రోజుల పారాయణ గ్రంథం)
వెల: రు. 60/-లు
ప్రతుల ప్రాప్తిస్థానము
సూర్యాన్‌క్లేవ్, రామాలయం ఎదుట, విశాలాక్షి నగర్,
విశాఖపట్నం- 43
ఫోన్‌నెం: 0891 2795930
9441170455
**

సర్వసృష్టిని తన కన్నుసన్నులలో వీక్షించేదేవి మణిదీపవాసిని. సృష్టిస్థితిలయాదులకు కారణభూతురాలు శక్తి. ఆ శక్తినే బ్రహ్మవిష్ణుమహేశ్వరులనుంచి ఇంద్రాది దేవతలు, సిద్ధులు, సాధ్యులు, సాధువులు, సన్యాసులు, మానవులు అసలు సృష్టియావత్తు తల్లిని స్తుతించేవారే. ఆ తల్లి కరుణను పొందడానికి కీర్తించేవారే. ఆ తల్లి అనుగ్రహవీక్షణాలుంటే చాలు మందుడు అన్నవాడు కూడా పరమజ్ఞాని అవుతాడు. పండితులకైనా, పామరులకైనా అసలు ఏ జీవి జీవించడానికి కావలసిన చైతన్యస్వరూపమే అమ్మ. ఆ అమ్మను గూర్చి ఎంత చెప్పినా తనివితీరదు. అమ్మను గూర్చి తెలుసుకోవడానికి అమ్మ తత్వాన్ని ఆకళింపుచేసుకోవడానికి అంతేకాదు అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి సులభమైన మార్గం శ్రీదేవీ భాగవత పఠనం.
దేవీ భాగవత పారాయణ చేయడానికి ఈ ఆధునిక వాతావరణం అందరికీ అనుకూలించదు. దీన్ని గమనించి అందరూ అమ్మ వాత్సల్యానురాగాలను పొందడానికివీలుగా ఆ వ్యాసకృత దేవీ భాగవతాన్ని చావలి ఆంజనేయమూర్తిగారు ‘‘శ్రీదేవీ భాగవతము’’ (తొమ్మిదిరోజుల పారాయణ గ్రంథము) అన్న చిరుపొత్తంగా రూపొందించారు. శోక్లాతో టీకాతాత్పర్యాలన్నీ చదివే ఓపిక లేదనుకొనేవాళ్లు సైతం ఈ చిరుపొత్తాన్ని చదవడం, లేక పారాయణ గ్రంథంగా ఉపయోగిస్తూ ఈ దేవీభాగవతాన్ని పఠించినవారికి అమ్మ ఆశీస్సులు అపారంగా లభిస్తాయి. చిన్మయత్వాన్ని చిద్రూపవిశేషజ్ఞురాలైన అమ్మ తత్వాన్ని అమ్మ కరుణను, దయను అందరూ పొందడానికి వీలుగా అక్షరాలను కాస్త పెద్దసైజులో ముద్రించారు. అక్కడక్కడ శ్లోకాలను ఇచ్చి, వాటి వివరణలతో దేవీ భాగవతాన్నంతా సంక్షిప్తంగా కూర్చారు. అనుబంధాలుగా దేవీ పంచరత్న స్తోత్రాలను, గాయత్రీ కవచాన్ని, కన్యకాపూజాశ్లోకాలను కూడా ఇచ్చారు.
దేవీ ఆరాధకులేకాక యావన్మందికీ ఉపయోగపడేటట్లుగా చదివే ఆసక్తిని కలిగిస్తున్న ఈ శ్రీదేవీ భాగవతాన్ని అందరూ చదవి అమ్మ పంచే అమృతాన్ని గ్రోలవచ్చు. అమ్మను అర్చించడానికి ఆశ్వీయుజ చైత్రమాసాలు విశిష్టమైనవి అని చెప్పినప్పటికీ ఈ శ్రావణంలో ఆ శక్తిస్వరూపిణి అయిన అమ్మను మహాలక్ష్మిగా భావించి కొలిచే వేళలలోకూడా ఈ శ్రీదేవీ భాగవతము చదివితే సకల సంపదలు ఒనగూరుతాయి.
***
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-ఆర్.ఎల్.