అక్షర

శైవభక్తులకు మంచి కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమామహేశ్వర వ్రతము
-గంగవరం చింతామణి నరసింహాచార్యులు
పరిష్కర్త: కపిలవాయి లింగమూర్తి
వెల: రు. 60/-లు
ప్రతుల ప్రాప్తిస్థానం
శెట్టి ప్రభాకర్
హౌజ్.నెం. 21-69,70 సంతబజార్
నాగర్‌కర్నూల్
- 509 209
చరవాణి:
95533 08936
***
పార్వతీపరమేశ్వరులు ఆదిదంపతులు. కాళిదాసు వీరిద్దరినీ వాక్కుఅర్థాలుగా సంభావించారు. పార్వతీపరమేశ్వరులే సర్వసృష్టికారణం. వీరిద్దరి సంకల్పవికల్పాలే సృష్టిలయాలకు హేతువు. శివ అనని నోరు కాని శివా అనని ప్రాణి కాని ఉండదు. పరమశివుడు అర్ధనారీశ్వరుడు. శివుడుశివాని ఇద్దరూ ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిని రక్షించడంలో ఏ మాత్రం జాగుచేయరు. కనుకనే మానవులైనా దానవులైనా పరమశివుని భక్తులే అయ్యుంటారు. ఆ పరమశివుడు కరుణాంతరంగుడు. అపారకృపావత్సలుడు. భక్తదయాళుడు. శివ అని పిలిచినంతనే పలికే స్వామి పరమశివుడు. మానవుని జన్మసార్థకం కావాలంటే ఆ పార్వతీపతిని స్తుతించడమే మార్గం.
అందుకే స్కాందపురాణంలోని బ్రహ్మోత్తర ఖండంలో ఉన్న ఉమామహేశ్వర వ్రత కథను ప్రతివారు తెలుసుకొని ఆ వ్రతాచరణతో పాపక్షయం చేసుకోవాలని, అపమృత్యుదోషాలను దూరంచేసుకొని పూర్ణాయుష్కులు కావాలని గంగవరం చింతామణి నృసింహకవి ఈ వ్రతవిధానాన్ని కూర్చారు. దీన్ని డా.కపిలవాయిలింగమూర్తిగారు అందరికి చదవడానికి, అర్థం చేసుకొని ఆచరించడానికి వీలుగా పరిష్కరించారు.
స్కాందపురాణంలోని బ్రహ్మోత్తరఖండానే్న తెలుగులోకి గంగవరం చింతామణి నరసింహాచార్యులు గోపాలపేట, రామచంద్రాచార్యులు అనే ఇద్దరు రెండుపేర్లతో అనువదించారు. ఈ బ్రహ్మోత్తర పురాణానికే శివరహస్యఖండమనే పేరు కూడా ఉంది. ఇందులోని ఉమామహేశ్వర వ్రతకథను ఇద్దరూ పంచమాధ్యాయలుగా చిత్రీకరించినా సీమంతినికథ, మార్కండేయ చరిత్ర, శారదావృత్తాంతాలను రామచంద్రకవిగారు చెప్పారు. శారదావృత్తాంతాన్ని, నైధ్రువుని చరిత్ర ను చెప్పారు. అయితే వీరి రచనల్లోని శైలి నరసింహాచార్యులవారిది కొంత సంస్కృతపదబహుళమై గ్రాంథికంగా ఉండి సామాన్య చదువరులకు కష్టంగా ఉంటుందన్న ఆలోచనతో అందరికీ సులభగ్రాహ్యంగా ఉండాలన్న సదాశయంతో వ్యవహార శైలిలో కపిలవాయి లింగమూర్తిగా పరిష్కరించా రు. అంతేకాక ఈ వ్రతవిధానం లో ముందుగా చేసే కలశస్థాపన, గణపతి ఆరాధన, నవగ్రహపూజ ఇత్యాదులను సంపూర్ణంగా జతచేశారు. స్థలకాలాదులను దృష్టిలో ఉంచుకుని పూజించడానికి వీలుగా రచించిన ఈ పుస్తకం శైవభక్తులకు బహుప్రీతిని కలిగిస్తుంది. ఆయురారోగ్యాలను, సౌభాగ్యాన్నిచ్చే ఈ ఉమామహేశ్వర వ్రతాన్ని అందరూ ఆచరించడానికి వీలైన శైలితో అలరారే ఈపుస్తకాన్ని చదువరులను ఆకర్షిస్తుంది.

-రాయసం లక్ష్మి