అక్షర

అనువాదంలో ఆ బిగి ఏదీ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమర్సెట్ మామ్ కథలు
అనువాదం: ఎలనాగ,
పేజీలు: 166+
వెల: 120;
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్,
చంద్రం బిల్డింగ్స్, విజయవాడ.
ఫోన్: 0866-2430302
***

ఈ సంకలనంలో 14 కథలు, చివరన 44 పేజీల (నవలిక అనాలా?) పెద్ద కథ మరొకటి ఉన్నాయి. ఈ కథలన్నీ పత్రికలు, వెబ్ పత్రికల్లో ఇదివరకే వచ్చాయి. కథతోబాటు అంపశయ్య నవీన్ రాసిన నాలుగు పేజీల ముందుమాట కూడా ఉంది.
మామ్ అన్న పేరులో మొదటి ఎమ్ తరువాత కాక, మరొకసారి ఎ అనే అక్షరం ఉంటుంది. ఆయననెవరూ ‘మాఘం’ అనరు. అదీ మామ్ తీరు. అతను చాలా కథలు రాశాడు. బతుకుదెరువు, అంటే సంపాదనకొరకు రచనలు చేశానని చెప్పుకున్నాడు కూడా. తలిదండ్రులు లేని ఈ రచయిత యువ వయస్సులోనే రచనలు మొదలుపెట్టాడు. కాలక్షేపంకోసం అందరినీ ఆకర్షించే ఆశ్చర్యం బ్రాండు రచనలు చేసి, పేరు, డబ్బు సంపాదించుకున్నాడు. సహజంగానే మామ్ రచనల పట్టిక చాలా పొడవు చాండాడంత సాగుతుంది. అనువాదానికి ఎలనాగ ఈ కథలను ఎంచుకోవడంలో ఏదయినా లాజిక్ ఉందా? లేనట్టు కనబడుతుంది. ఒక్క సంగతి గుర్తించాలి. మామ్ తనను తాను ‘రెండవ శ్రేణి రచయితల్లో, ముందుంటాను’ అని వర్ణించుకున్నాడు. తన ప్రసిద్ధ నవలలో ఒక పాత్ర చేత ‘మెరిక్ అంటే విజయం మాత్రమే’ అని చెప్పించాడు కూడా.
ఈ అనువాద సంకలనంలో కథలు అన్నీ ఒక రకంగా లేవు. కొన్ని చమక్కు కథలు. కొలను లాంటి కథలు ‘బోర్ రకం’ అదంతా అంతు పట్టకుండా ఉంటుంది. సర్వజ్ఞుడు (అన్నీ తెలిసిన మనిషి అనవచ్చునేమో?) అన్న కథ ఆలోచనల్లోకి తోస్తుంది మామ్ కథలో కన్నా. కథనంలో బలం ఎక్కువ అనవచ్చు. ఆశ్చర్యపడేలా చేయడానికి అతను ఏమయినా చేస్తాడు. ఉద్యోగం యివ్వలేని ఒకతను, ఆ మనిషిని చంపేస్తాడంటే ఆశ్చర్యం! అయితే తాను చంపడు, చనిపోయేలా చేస్తాడు. అది మామ్ తీరు!
అనువాద పద్ధతి గురించి ముందుమాటలో నవీన్ మోమాటం లేకుండా చెప్పారు. పుస్తకంలో రీడబిలిటీ లేదు! ముందుమాట రాయడానికి నవీన్ ముఖ్యంగా బుచ్చిబాబు మీద ఆధారపడినట్టు కనిపిస్తుంది. అది వేరే సంగతి. ఎలనాగ మాటకు మాటగా అనువదించే ప్రయత్నం చేశాడు. అది మూల రచయిత పట్ల విధేయత అనుకున్నారు. అనువాద రచన, అడుగడుగునా అనువాదం అని తెలుస్తూ ఉండాలి. కానీ, మూల రచనలోని బిగి, ఇక్కడ కూడా రావాలి. ‘నాకు విస్మయం నిండిన తడబాటును కలిగిస్తుంది’ అనవలసిన అవసరం లేదు.
మామ్ ప్రధానంగా కథారచయిత. చెభోవ్, ఆలిన్ మున్రో, సింగర్ కూడా అంతే. మవుపాసాను కూడా చేర్చవచ్చునేమో? ఈళ్ల నవలలకు అంత పేరు రాలేదు. మామ్ కథలు ధనవంతులు, ఆడవాళ్ల చుట్టూ తిరుగుతాయి. ఈ సంకలనంలోని కథలన్నీ.

-కె.బి.గోపాలం