అక్షర

ఈ రుబారుూల రుచి చూడాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జక్కని రుబారుూలు
-జక్కని వెంకట్రాజం
పేజీలు: 65
వెల: రూ.100
ప్రతులకు:
‘గురుకృప’
9440021734
***
తెలుగు పద్యం ఎత్తిన అవతారాల్లో రుబాయి ఒకటి. రుబారుూలనగానే గుర్తొచ్చేది ఉమర్ ఖయ్యాం. 12వ శతాబ్దంలో తన రుబారుూలతో లోకాన్ని ఓలలాడించిన చిరస్మరణీయుడాయన. తనెంచుకున్న రుబారుూల ప్రక్రియ ఇంగ్లీషులోకి, ఆ తర్వాత ప్రపంచంలోని ఇతర భాషల్లోకి తర్జుమా అయ్యింది. ఆ విధంగా తెలుగులోనూ రుబారుూల ప్రవేశం జరిగింది. నాలుగు పంక్తుల పద్యమైన రుబారుూలో మొదటి రెండు పంక్తుల అంత్య ప్రాస తిరిగి నాలుగో పంక్తిలో కనబడుతుంది. మూడో పంక్తిలోని ఎత్తుగడ పై రెండు పంక్తుల బాసటగా నాలుగో పంక్తిలో భావం ముక్తాయింపుగా భావపటిమ ప్రకటిస్తుంది.
జక్కని రుబారుూలులో 150 పద్యాలున్నాయి. జక్కని వెంకట్రాజం తన మనోభావాలను వీటిలో చక్కగా పలికించారు. తనకు నచ్చిన యోగ, ఆధ్యాత్మిక భావనలే కాకుండా సమాజ శ్రేయస్సును కోరుతూ లోకం పోకడలను ఎత్తిచూపారు.
కరీంనగర్ జిల్లాలోని ఆధునికుల్లో తొలి తరం రచయితల వర్గానికి చెందిన వారుగా జక్కని వెంకట్రాజంను పరిగణించవచ్చు. ప్రత్యేకంగా సిరిసిల్ల ప్రాంతంలో సాహితీ వాతావరణం శోభిల్లడానికి కృషి చేసిన వారిలో వీరొకరు. దాదాపు ఏడు పదుల వయసులో సైతం రచనా వ్యాసంగాన్ని కొనసాగించడం గమనించదగ్గది. 1973లో యువ స్వరాల్లో ఒక కవిగా, 1977లో సొంత కవితా సంపుటి ‘అర్ధరాత్రి సూర్యుడు’తో కవిలోకానికి పరిచయం అయ్యారు.
జక్కని రుబారుూల్లో ఉన్న భాషా సౌందర్యం, పదాల పరుగు, లయ విన్యాసము రచనలకు సొబగులద్దాయి. రుబారుూలపై కవి తనకున్న సాధికారితపై విశ్వాసంతో-
రుబారుూలు రాయగలను/ ప్రభావాలు వేయగలను/ సభాసదుల చేత నేను/ ‘వహ్వా’ అనిపించగలను’ అని తొలి పద్యమే రాసుకున్నారు.
పర్యావరణ పరిరక్షణగా-
‘గుట్టలు ధ్వంసం జేతురు/ పట్టణాలు నిర్మింతురు/ పర్యావరణంబు చెరచి/ వికృతంగ జీవింతురు’ లాంటి రుబారుూలు ఇంకా ఉన్నాయి.
బడిలో విరిసిన పిల్లలు/ తోటను పూచిన మల్లెలు/ మనసుకు హాయిన గొలిపే/ పున్నమి వెనె్నల జల్లులు - ఈ పద్యంలోని భావం మాదిరే ఈ రుబారుూలు కూడా వెనె్నల జల్లులే.
దీర్ఘ వాక్యాలతో కూడిన రుబారుూలు జక్కని చక్కని కావ్య ప్రతిభను ప్రదర్శిస్తాయి. వీటిలో ఉన్న తాత్వికత ఋషుల బోధనలకు దగ్గరగా ఉంది.
వేదనలు లేనట్టి బ్రతుకులు విశ్వమందున దొరకకుండును, కాలమహిమను దెలియ జీవిత కాలమే సరిపోదు సుమీ అనే పద్యాపంక్తులు గురుతత్వాన్ని బోధిస్తాయి.
ఆధునికత పేరిట పైపై మెరుగుల మర్యాదలు, నటనలు, బంధువుల అవసరార్థం ప్రేమలు, బంధాలు సహజంగానే వయోవృద్ధులకు విరక్తిని కల్గిస్తాయి. తాను చూసిన ఈ కొత్తతరం వ్యవహారాల్ని తన రుబారుూలోకి దింపారు రచయిత.
మనుషుల నైజాన్ని-
అవసరానికి దరికి జేరచు అణకువెంతో చూపుచుందురు... అవసరమ్ములు తీరినంతనె లెక్క మమ్ముల జేయకుందురు’ అని విశే్లషిస్తారు.
గత ఇరవై ఏళ్లుగా ప్రభాకర్‌జీ రూపొందించిన సిద్ధ సమాధి యోగ ఆచార్యులుగా శిక్షణ ఇస్తున్నందువల్ల దాని ప్రభావం ఈ రుబారుూల్లో అధికంగా చోటు చేసుకుంది.
డా.తిరుమల శ్రీనివాసాచార్య, ఆచార్య మసన చెన్నప్ప అభినందన చందనాలు ఈ కవికి దక్కాయి.
ఆధునిక కవులకు, పాఠకులకు విభిన్న ప్రక్రియలో కవిత్వాన్ని పరిచయం చేయడంలో జక్కని వెంకట్రాజం ఆలోచన, కృషి ఫలించింది.

-బి.నర్సన్