అక్షర

స్వచ్ఛంద కవితలో తెలుగు పరిమళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పరిమళం
దీర్ఘ కవిత
రచన: వూటుకూరు
వరప్రసాద్
వెల: రూ.75/-
ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు
***
ఇదొక దీర్ఘకవిత. కవి వూటుకూరి వరప్రసాద్. వీరు విద్వాంసులు. అధ్యాపక వృత్తిలో బహుకాలము పరిశ్రమించిన వారు. నన్నయనుండి చిన్నయవరకు గల వేయేండ్ల తెలుగు కవుల ప్రాభవమును సంక్షిప్తంగా, ఈ గేయంలో ప్రస్తావించారు. అంతేకాదు ఆధునిక దళిత కవులు స్ర్తివాద కవిత్వము సామ్యవాద కవిత్వము వంటి ఉద్యమ కవిత్వములో వచ్చినవారిని కూడా స్పృశించారు. రెండు తెలుగు రాష్ట్రాల అవతరణకు సంబంధించి కొన్ని పంక్తులున్నాయి. కురుపాండవ సంగ్రామం విశ్వామిత్రుని శాపంవంటి పౌరాణికాంశములలో ఈ దీర్ఘకవిత ప్రారంభమయింది. ‘కొండకోనల్లో ఎండవానల్లో తడిపొడిగా తరలివచ్చి రేయిపొద్దుల్లో సందె సుద్దుల్లో వడివడిగా అడుగులేసి చెట్టుచేమల్లో మిట్టపల్లాల్లో గట్టుతెగిన వాడై సాగిన ‘తెలుగు కవితకు ఈ కవి అక్షరాంజలి సమర్పించారు. మద్రాసు నుండి కర్నూలుకు అక్కడినుండి హైదరాబాదుకు అక్కడినుండి అమరావతికి సాగిన ఆంధ్రుల ప్రస్థానాన్ని బైబిలులోని ఇజ్రాయిలీల వలసవలవె ఉందని అభివర్ణించారు. (పుట 55.)
‘‘ఐగుప్త నుండి కనానుకు తరలివచ్చిన యూదు ప్రజల ఆగమనంలా ఉంది’’ జాతి పురోగమనంలా వారు వాగ్దత్త భూమికి మరలి వచ్చిన మధురానుభూతిలా ఉందిట.
వరప్రసాద్ సహజంగా కవి. మంచి ఇతివృత్తం ఎన్నుకున్నారు.
తననుతాను శుద్దీకరించుకునే క్రమంలో లేఖనాలు భావధారలలో తన భావవర్ణంతో నిరంతరం తడుస్తున్న కవి ఇతడు. ఇట్టి రచయితనుండి మరిన్ని ఇతివృత్త ప్రధానమైన గ్రంథాలు ఆశింపవచ్చు.
ఇదొక నిసర్గ సుందర మనోజ్ఞామందిర నిశ్శబ్దబంధుర రసానంద వర్షిణి. తెలుగు భాషామతల్లికి కట్టిన దీర్ఘకవితల కోవెల. మత్తకోయిల కలకూజితం. రచయితకు అభినందనలు.

-ఎం.ఎస్.పి.