అక్షర

మనోవిశే్లషణాత్మక చిత్రీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అంపశయ్య నవీన్ కథలు’’
ఆం.ప్ర. అభ్యుదయ
రచయితల సంఘం,
గుంటూరు.
వెల: రూ.50
పే: 110.
***
అంపశయ్య నవీన్ కథకుడు, నవలాకారుడు, విమర్శకుడు. కథకుడిగా నాలుగు సంపుటాలు వెలువరించారు. అందులోంచి ఎంపిక చేసిన పది ఉత్తమ కథల సంపుటియే ‘‘అంపశయ్య నవీన్ కథలు’’గా గుంటూరు అరసం శాఖవారు వెలువరించారు.
నవీన్ కథలు కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలలో వస్తున్న మార్పులను తెలియజేస్తాయి. మనుషులలో పెరిగిపోతున్న అవకాశవాదం, స్వార్థచింతన, వ్యాపార ధోరణిని వివరిస్తాయి. లైంగిక హింసవల్ల వైవాహిక జీవితాలు ఎలా నాశనమవుతాయో ‘‘ఎనిమిదో అడుగు’’ వివరిస్తే, అక్రమ సంబంధాలవల్ల కుటుంబాలు ఎలా నాశనమవుతాయో ‘‘ఊబి’’ కథ తెలియజేస్తుంది. వైవాహికేతర సంబంధాల వల్ల అందునా అరక్షిత సెక్స్‌వల్ల ఎయిడ్స్ సంక్రమించి ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని తెలిపే కథ ‘‘ఊబి’’. విద్యాధికులు, ఉన్నత కుటుంబాలలోని వ్యక్తుల మధ్య ఎయిడ్స్ చాపకింద నీరులా ఎలా వ్యాపిస్తుందో ఈ కథలో చూడవచ్చు. కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య వున్న పొరపొచ్చాలు, అసంతృప్తులు ఎన్ని రకాలుగా బయటపడతాయో చెప్పడానికి చిన్న ఉదాహరణ ‘‘అనంతం’’ కథ. ‘‘ఆత్మహత్యలా? హత్యలా?’’ అనే కథ రైతుల ఆత్మహత్యల వెనుకవున్న మరో కోణాన్ని చిత్రీకరించింది. ఒక ఎస్టీ అటెండర్ పోస్టును నింపడం కోసం నిజాయితీగల ప్రిన్సిపాల్ ఎన్నిరకాల ఒత్తిళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చిందో ‘‘ఓ ఉద్యోగం కోసం’’లో చూడాల్సిందే. అపరాధ భావనతో మానసికంగా నలిగిపోయి ఆత్మహత్య చేసుకోవడం ‘‘హత్య’’లో కనిపిస్తే, మనుషుల్లో వున్న స్ల్పిట్ పర్సనాలిటీని ‘‘అపకారికి ఉపకారం’’ కథలో తెలియజేస్తారు. రచయిత తన అనుభవ పరిధిలోకి వచ్చిన సమస్త విషయాలను, చూసిన సంఘటనలను సన్నివేశాలుగా, పరిచితులైన పాత్రలుగా మలచి ఈ కథలను రూపొందించారు. కల్పన తక్కువగా వుండి వాస్తవిక ధోరణిలో ఈ కథలు కొనసాగుతాయి. మానవ సంబంధాలు ముఖ్యంగా స్ర్తిపురుష సంబంధాలను ఎస్టాబ్లిష్ చేయడంలో వ్యక్తిగతభావాలకు, అభిప్రాయాలకు తావీయకుండా ఏదో ఒక ఇజానికో, ధోరణికో సపోర్టుచేసినట్లుగా కాకుండా ఆయా పాత్రల మనస్తత్వానికే వదిలేస్తూ రచనలు చేస్తుంటారు. మనస్తత్వానికి వస్తే క్షణక్షణం పరిణామం చెందే మనసులోని ప్రతిస్పందనలను వ్యక్తంచేసే చైతన్య స్రవంతి. శిల్పంలో నవీన్ తనదైన ప్రత్యేకతను సాధించారు. అయితే క్రమంగా చైతన్యస్రవంతి శిల్పంతో సాగే పెద్ద కథలను వ్రాసే పద్ధతినుండి జీవితంలోని అన్ని పార్శ్వాలను చిత్రించే చిన్న కథలు రచించే పద్ధతికి వచ్చారు. ఆ విధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారి జీవితాలకు సంబంధించిన అన్ని కోణాలను ఇతివృత్తంగా గ్రహించారు. నవీన్ కథల వస్తువులోనే కాదు. శిల్పంలోనూ వైవిధ్యాన్ని సంతరించుకున్నాయి. నవీన్ కథలన్నీ మనో విశే్లషణాత్మకాలే. పాత్రల మనోవిశే్లషణకు చైతన్యస్రవంతి బాగా నప్పుతుందని గ్రహించిన నవీన్ ‘‘అధోలోకం’’ కథను చైతన్యస్రవంతి ధోరణిలో తీర్చిదిద్దారు. ‘‘అనంతం’’ కథ రెండు పాత్రలతో సంభాషణలపరంగా కొనసాగుతుంది. శ్రీపాద తర్వాత ఈ టెక్నిక్‌ను నవీన్ సమర్ధవంతంగా పోషించగలిగారు. నాణానికి బొమ్మాబొరుసులా ఒకే ఇతివృత్తాన్ని రెండు భిన్నకోణాల్లో చిత్రీకరించిన కథ ‘‘అస్మదీయులు- తస్మదీయులు’’. ఇలా కథలకు అనువైన శిల్పాన్ని ఎన్నుకుని, ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో వారికివారే సాటి. ఈ కథలు చదవడమే మంచి అనుభూతిని కలుగచేస్తాయి.

-చక్రవర్తి