అక్షర

‘దారి’ తప్పిన మావోల గురించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మావోయిస్టుల రక్తచరిత్ర’’
వుప్పల నరసింహం, జ్ఞానం పబ్లికేషన్స్,
వెల: రు.150/-
పేజీలు: 156,
ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు
**
గత శతాబ్దం ప్రారంభంలో ప్రపంచమంతటా ఉద్యమాలు, పోరాటాలు, విప్లవాలు చోటుచేసుకున్నాయి. ప్రజలు వలస పాలన నుంచి విడివడి తమనుతాము పరిపాలించుకునే ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టారు. కొత్త శతాబ్దం కొత్త భావజాలంతో, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభమయింది. ప్రపంచీకరణ మార్పులతో మానవ జీవితం పూర్తిగా మారిపోయింది. కమ్యూనిస్టు దేశాలు సైతం కమ్యూనిజాన్ని వదిలి ప్రజాస్వామ్య దేశాలుగా అవతరించాయి. మావోయిస్టులు దర్శించిన, దర్శిస్తున్న సమాజాన్ని ఈ లోకం ఎప్పుడో దాటిపోయింది. ముందుకు దూసుకుపోతోంది. ఆ దృశ్యాన్ని వాళ్ళు చూడ్డానికి తిరస్కరించడంతో తిరకాసు వస్తుంది. ఊతపదంలా శాస్ర్తియం.... శాస్ర్తియం అంటారేగాని మావోయిస్టుల అసలు వాస్తవాలను పట్టించుకోవడం లేదు. సాయుధ విప్లవం సమకాలీన పరిస్థితుల కనుగుణమైన కార్యాచరణ కాదని మన చుట్టూవున్న వాతావరణాన్ని బలంగా చెబుతుంది. తెలివైనవారు ఆ మార్పును పసిగట్టి వ్యూహాన్ని మార్చుకుంటారు. కాని మావోయిస్టులు అటువైపు దృష్టిపెట్టకపోగా మరింత మూర్ఖంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకోవడం- విలువైన సమయం, సంపదను, మానవ వనరులను ధ్వంసం చేయడాన్ని బుద్ధిజీవులు ఎలా సమర్ధిస్తారు?
జనారణ్యం నుంచి దండకారణ్యానికి వెళ్ళి దర్శించి రచనలుచేసిన జర్నలిస్టులు, రచయితలు ఆరాధనాభావంతో మావోయిజాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేసే లక్ష్యంతో ఆ రచనలు వెలువరించారని వుప్పల నరసింహం అభిప్రాయం. వీటితోపాటు పాణి రాసిన ‘‘జనతన రాజ్యం’’ పుస్తకాన్ని కూడా ఖండిస్తూ వుప్పల నరసింహం రాసిన కొత్త పుస్తకమే ‘‘మావోయిస్టుల రక్తచరిత్ర’’. ఇందుకు దండకారణ్యంలోని విషయాలు, మావోయిస్టుల చర్యలు, వారి జనతన సర్కారువైఖరి, స్థానిక మావోయిస్టు కమాండర్ల దుశే్చష్టలు, దౌర్జన్యాలు, కాంట్రాక్టర్లు, రౌడీలతో అంటకాగడం, అభివృద్ధిని అడ్డుకోవడం, మతిలేని హింసాత్మక సంఘటనలకు పాల్పడటం, మందు పాతరలు పేల్చడం, హత్యలు చేయడం, అమాయకులైన ఆదివాసీలను ఆట- పాటతో ఆకర్షించి వారితో ఆయుధ భాష మాట్లాడించడం లాంటి విషయాలనెన్నింటినో పేర్కొన్నారు. తేదీలవారీగా పత్రికల్లో వచ్చిన వార్తలను- సంఘటనలను వరుసగా పేర్చుకుంటూ తన విశే్లషణలతో మెరుగుదిద్ది ఈ పుస్తకాన్ని వెలువరించారు. ప్రొఫెసర్ రోహిత్‌ప్రసాద్ రాసిన ‘‘బ్లడ్‌రెడ్ రివర్’’ పుస్తకానికి సమర్ధింపుగా, ఈ పుస్తకం కొనసాగడం విశేషం.

-కె.పి.అశోక్‌కుమార్