అక్షర

చక్కటి సందేశం అందించిన బాలల నాటికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోరు నష్టం,
పొందు లాభం
పిల్లల హాస్య నాటికలు,
రచన: వల్లూరు శివప్రసాద్
అమరావతి పబ్లికేషన్స్ గుంటూరు
ప్రతులకు: ప్రముఖమైన
అన్ని పుస్తకాల షాపుల్లో
**
వల్లూరు శివప్రసాద్ రచించిన ఈ పోరునష్టం, పొందులాభంలో పిల్లలకోసం రాసిన ఐదు హాస్య నాటికలున్నాయి.
వల్లూరు శివప్రసాద్ మంచి నాటక రచయిత, కథారచయిత. గుంటూరు జిల్లాకు చెందిన వల్లూరు శివప్రసాద్ వివిధ పత్రికలలో సుమారు అరవైకి పైగా కథలు రాశారు.. నాటక రచయితగా వానప్రస్థం, ఏడు గుడిసెల పల్లె, బహుజన హితాయ మొదలైన నాటకాలు రాసారు. వీరు రాసిన హింసధ్వని నాటిక ఎంతో పేరొందింది. వీరు పిల్లలకోసం నిన్ను నువ్వు దిద్దుకో, గడియారం, సత్యపాలన, బల్లికుడితిలో పడింది, స్వేచ్ఛాగీతం అనే మరికొన్ని నాటికలు కూడా రచించారు. వందేళ్ల కాలంలో తెలుగులో వెలువడిన అమూల్యమైన నాటికలతో ప్రసిద్ధ తెలుగు నాటికలు, ప్రసిద్ధ తెలుగు హాస్య నాటికలు అనే రెండు సంకలనాలు కూడా వెలువరించారు.
ఈ సంపుటిలో మొదటి నాటిక యధాలోకం తధావార్త.. నేటి ఆధునిక సమాజంలో పిల్లలకు ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది ఉపయోగమో ఏది నిరుపయోగమో తెలియచెప్పడం పెద్దల ధర్మం. అలా చెప్పకుండా తమ భావాలను, తమ ఆలోచనలను, తమ అభిరుచులను పిల్లలమీద బలవంతంగా రుద్దడంవలన జరిగేదేంటో తెలియచేస్తూ చక్కటి సందేశం అందించారు.
రెండవ నాటిక పోరు నష్టం, పొందు లాభం. అసూయ, ద్వేషం, ఎదుటివాళ్లకన్నా నేనే అధికంగా ఉండాలన్న ఆశా ఇవన్నీ మనిషిని ఎలా పతనం వైపు నడిపిస్తాయో తెలియచేసిన నాటిక..
మూడవది జీవన నైపుణ్యం ఆడపిల్లలకు మగ పిల్లలతో సమానంగా చదువు, ఉద్యోగం ఎంత అవసరమో, చదువుకోడానికి అవసరం అయితే ఎంతటి సాహసాన్నైనా ఎలా చేయచ్చో ఈ నాటిక ద్వారా చెప్పారు.. ముఖ్యంగా ఈ నాటికలో దుర్గ పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా చిత్రించారు.
అలాగే తప్పులెన్నువారు, సత్యపాలన నాటికలు చక్కటి సందేశంతో ఆసక్తికరంగా సాగాయి.
సాధారణంగా బాల సాహిత్యం అంటే బాలలకోసం పెద్దలు రాసేదా? బాలలకోసం బాలలే రాసేదా అనే సందేహం ఎప్పటినుంచో ఉంది. బాలలకు మంచి సందేశాన్ని అందిస్తూ, వారి వ్యక్తిత్వ వికాసానికి, మేధస్సుని వికసింపచేయడానికి పెద్దలు రాసినవీ, వారి ఆలోచనా పరిధికి తగినట్టు బాలలే రాసుకున్నవీ కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ పుస్తకంలో బాలలకు మంచి సందేశాన్ని అందిస్తూ శివప్రసాద్ రాసిన మంచి నాటికలున్నాయి.

-అత్తలూరి విజయలక్ష్మి