అక్షర

కాలక్షేపం కతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి నిరంతర పథికుడు. వేల వేల ప్రవృత్తులు గల మనుషుల మధ్య తన లోని వేల ఆలోచనలు నిరంతరం సంఘర్షిస్తూ వుంటే సాగిపోతూ వుంటాడు. ఇలాంటి సంఘణల్నే కథకులు కథలుగా స్కెచ్‌లుగా ఒక్కో చోట పెద్ద కథలుగా మలిచి మనకందిస్తూ వుంటారు.
‘దిద్దుబాట’ సంకలనంలో 26 కథలున్నాయి. ఇవన్నీ 2014లో వివిధ పత్రికల్లో ప్రచురించబడినట్టుగా రచయిత చెప్పుకున్నారు. వీటినే ఇప్పుడు కథకులు సిహెచ్ శివరామప్రసాద్ (వాణిశ్రీ) మనకందిస్తున్నారు.
సమాజంలో రోజూ ఎదురయ్యే అనుభవాలని ఒడిసిపట్టుకుని వీటికి కథ/స్కెచ్ రూపాలిచ్చి మన ముందుకు తెచ్చారు. ఇప్పటివరకు సుమారు 800 కథలు రాసిన వీరి రచనల్లో సారళ్యత వుంది. సూటిదనం ఉంది. ఎక్కడా డొంకతిరుగుడు పద్ధతి లేదు. అందుకనే వీరు అరవయి ఏళ్లనుండి కథలు రాయగలుగుతూ పాఠకలోకాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రతి రచయిత తాను సమాజానికేదో సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటాడు. అలాంటి అంతర్లీన సందేశాలే దిద్దుబాటలోని చాలావరకు కథల్లో ద్యోతకమవుతాయి.
ఆవేశం అనర్ధదాయకమని ఆలోచనకు కాస్త సమయం ఇచ్చి వాటిని పునఃపరిశీలించాల్సిందిగా చెప్పే ‘దిద్దుబాట’. పెళ్లితో చదువు ఆగిపోనవసరం లేదని చెప్పే పెళ్లిగండం.
కొన్నికథల్ని...కల్పితంగానే ఊహించుకోవాలి. సహజత్వం కొరవడినట్లుగా ఊహించుకోవాలి. పీనాసీ, పిల్లికి బిచ్చం పెట్టని, కాకికి ఎంగిలి చెయ్యి విసరని ‘రాజు’గారు చనిపోతే..,నివాళులకు యాదృచ్ఛికంగా తన పూలదండలకు గిరాకీ కలిగిందని కృతజ్ఞత, అదీ వరుసగా పదేళ్లనుండీ చూపడం కొంచెం సత్యదూరమే! (రాజుగారూ! నమస్కారం). పోతూంది అన్న ముసలి అత్త...హాస్పిటల్లోంచి స్వాస్థురాలై రావటం (ఆశాభంగం). అప్పువసూలుకు వెళ్లి అప్పు తీసుకున్న వారి కొడుకును తీసుకువస్తే అప్పు ఇచ్చిన దుర్గమ్మ పిల్లవాడితో పడే పాట్లుతో కొంచెం హాస్యం ‘అపహరణ’లో చదువరుకి కలుగుతుంది. ‘మనం మనం’ మరియు ‘ఒకగూటిపక్షులు’ లాంటి పేజీన్నర కథల్ని ‘స్కెచ్‌లు’ అనడం బావుంటుందేమో! మొత్తంమీద కథలన్నీ పాఠకుల్ని చదివించగలుగుతాయి. మంచి కాలక్షేపం కలిగించే సంకలనం ఇది.

-కూర చిదంబరం