అక్షర

మధ్యతరగతి జీవన గతిపై మాయ తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాయతెర
(కథానికా సంపుటి)
-విహారి
వెల: రు.100.. పుటలు: 118
ప్రతులకు: రచయిత
సెల్‌నంబర్: 9848025600
16-11-310/ఎ/1/1
గణపతి ఆలయం వీధి
సలీంనగర్-2, మలక్‌పేట, హైదరాబాదు-500 036
**
విహారి కలం పేరుతో ప్రసిద్ధులైన జె.ఎస్.మూర్తి కలంనుంచి పనె్నండు కథా సంపుటాలు, మూడు నవలలు, అయిదు కవితా సంపుటాలు, పదకొండు వ్యాస సంపుటాలు వెలువడ్డాయి. పదమూడవ కథా సంపుటి 3మాయతెర2 పాఠకుల ముందుకు వచ్చింది. ఈ సంకలనంలో పదిహేను కథలు పొందుపరచబడ్డాయి. అన్నీ మధ్య తరగతి జీవన పోరాటాల చుట్టు అల్లబడినవే.
మనుషులలో రెండే వర్గాలున్నాయి అనిపిస్తుంది. ఒకటి మోసగించే వారయితే రెండవ వారు మోసగింపబడేవారు. మోసపోయినవారు బలహీనులైతే ఏమీ ప్రతీకారం చేయలేకపోయినా 3మా ఉసురు తగలకపోదు2 అని సంతృప్తిపడడం జరుగుతుంది. 3పిల్లి శాపనార్ధాలకి ఉట్లు తెగుతాయా?2 అన్న సామెత అన్ని కాలాలకీ వర్తిస్తుంది. కానీ సున్నిత మనస్కులైన వారి స్పందన మరోలా వుంటుంది. భర్త మోసం చేసి తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చిన ఇల్లాలు 3మీరు మమ్మల్ని శాపనార్ధాలు పెట్టకండి4 అనడం వెనకవున్న స్పూర్తి గురించి తెలుసుకోవడానికి 3ఇల్లు- ఒక చేదుమాత్ర2 కథ చదవాలి.
జీవన యానంలో మనిషికి అనేకానేక అనుభవాలు ఎదురవుతాయి. కష్టసుఖాలు రెండు అనుభవించాల్సి వస్తుంది. 3బాధని అనుభవించడం కన్నా ఈ బాధని ఇట్లాగే అనుభవిస్తూ వుండాలనే భయం మనిషిని కృంగదీస్తుంది2 రంగనాధం, శివరాం పక్కపక్క క్వార్టర్లలో వుండడంవల్ల సన్నిహిత మిత్రులవుతారు. వారి కుటుంబాలు కూడా చేరువవుతాయి. అయిదేళ్ల తర్వాత ఇద్దరు చెరో నగరానికి బదిలీ మీద వెడతారు. ఇరవయ్యేళ్ల తరువాత కలుసుకున్న మిత్రులిద్దరు కలుసుకున్నప్పుడు అనేక విషయాలు చర్చించుకునే అవకాశం లభిస్తుంది. 3బాధని అనుభవించడం కన్నా ఈ బాధని అనుభవిస్తూనే వుండాలేమోనన్న భయం మనిషిని కృంగదీస్తుంది2 అన్న రంగనాధానికి శివరాం ఇచ్చిన సలహా చుట్టూ అల్లిన కథ 3బలీయం2.
దేశంలో నిరుద్యోగం ఒక పెనుభూతంలా పెరిగిపోతోంది. చిరుద్యోగం చాలీ చాలని జీతాలతో బతికేది కొందరైతే బలమైన కార్మిక, ఉద్యోగ సంఘాల వారి కోరికలు భిన్నంగా వుంటాయి.
జీతాలు పెంచాలి, కరువు భత్యం హెచ్చించాలి, బోనస్ పెంచాలి లాంటి కోరికలు తీర్చుకోవడానికి ఆందోళన బాట పడతారు. కనీస జీతం నెలకు ఇరవై వేలు దాటిన వారికి బదులుగా మాకురోజుకి రెండు వందలివ్వండి అన్న నిరుద్యోగుల ప్రతిపాదన అంశం కథా వస్తువుగా రాయబడిన కథ 3రానున్నది...కానున్నది2.
అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు సవ్యంగా జరిగే సందర్భాలు ఇద్దరి మధ్యా ఇచ్చిపుట్టుకునే ధోరణి ఉన్నప్పుడు గమనించవచ్చు. గడుసరి అయిన అన్నగారు 3నూరు గొడ్లను తిన్న నూట ఒకటో గొడ్డు రాకపోతుందా2 అని కాచుకుకూచున్న రాబందులా వుంటే జరిగే వ్యవహారం అపసవ్యంగానే జరుగుతుంది.
మనది అనుకున్న పదార్ధం మీద మాత్రమే మమకారం వుండాలనుకోవడం మానవ మాత్రులకు సహజం కావచ్చు కాని కోరికలు నేలమీద నిలువకపోతే మనిషి కట్టే భవంతులన్నీ పునాదిలేని మేడలే అవుతాయన్న సందేశం వున్న కథ 3పునాది లేని మేడ2.
పిల్లల అభిరుచిని గమనించకుండా తల్లిదండ్రులు తమ తీరని కోరికలని సంతానం ద్వారా తీర్చుకోవాలని ప్రయత్నించడం మధ్యతరగతిలో ఎక్కువగా గమనిస్తాము.
నువ్వు డాక్టరు కావాల్సిందే అన్న అమ్మ ఆదేశంతో కార్పొరేట్ కాలేజీ హాస్టల్‌లో చేరతాడు రమణ. అనుకున్న దానికి, అయ్యేదానికి మధ్య ఉన్న ఆంతరం వల్ల మానసికంగా కృంగిపోయిన రమణలాంటి విద్యార్థుల జీవనగాధే 3-రెప్పమాటు చూపు.
వ్యక్తాన్నించి అవ్యక్తాన్ని అందుకోవడం ఆదర్శప్రాయం అనుకున్న రచయిత కోరిక ఈ పుస్తకంలోని కథలన్నింటిలోను పొందుపరచబడింది. ప్రత్యేకంగా కథని అభినందించిన పాఠకుల పేర్లు, సెల్ నంబర్లు పుస్తకంలో పొందుపరచడం ఒక నూతన ప్రక్రియ.

-పాలంకి సత్యనారాయణ