అక్షర

వైవిధ్యభరిత కథల ప్రతినిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాతినిధ్య కథ 2015
(కథల సంకలనం)
సంపాదకులు: ప్రమీల
ప్రతులకు: అన్ని
ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
సంకలనాల్లోని కథల్లో వస్తువైవిధ్యానికీ, విస్తృతికీ ఎక్కువ అవకాశం వుంది. భిన్న ప్రాంతాలకూ, వర్గాలకూ, మతాలకూ, కులాలకూ చెందిన మనుషుల జీవన విధానాలూ, వారి స్వభావాల్లోని వైచిత్రీ, వారికే సంబంధించిన ప్రత్యేక సమస్యలూ - ఆ కథల్లో సాంద్రతరంగా చిత్రితమయ్యే అవకాశమూ ఎక్కువగానే ఉంది. కథ సీరీస్, కథా వార్షిక (ఆగిపోకముందు), కథావాహిని, మా కథ వంటి సంకలనాలూ, జిల్లావారీ వచ్చిన సంకలనాలూ ఈ వాస్తవాన్ని నిరూపిస్తున్నాయి. ఆ కోవలోని ప్రచురణగా- ‘ప్రాతినిధ్య కథ’- 2012నుంచీ వెలువడుతోంది. 2015 సంకలనం గురించిన సమీక్ష ఇది. ఈ సంకలనంలో 16 కథలున్నాయి. ‘దీనిలో భిన్నవర్గాలకు, భిన్న కులాలకు, భిన్న మతాలకు, భిన్న జెండర్స్‌కీ, తెలుగు భాషలో భిన్న మాండలికాలకు ప్రాతినిధ్యం లభించింది’ అన్నారు సంకలనానికి ముందుమాట రాసిన డా.దార్ల వెంకటేశ్వరరావుగారు.
వినోదిని రాసిన ‘కట్ట’కథతో మొదలైంది ఈ సంకలనం. ఇంటి దగ్గర మరుగుదొడ్డి లేని ఆడవాళ్ల అవస్థల్ని చెబుతుంది ఈ కథ. ఆ అవస్థ ‘అనుభవించినోళ్లకే తెలుస్తుంది’ అంటుంది ఈ కథ చెప్పిన దళిత పేద పిల్ల. ఈ వాస్తవం ఒక చేదు మాత్ర. ఒక విషపు ముద్ద. ఇనే్నళ్ల స్వతంత్ర భారత్‌లో ఇంకా ఈ దారుణం బరువుని మోయటం ఎంత దయనీయమో చాలా గాఢంగా ఆవిష్కరించారు వినోదిని. పాత్రోచితంగా వాడిన దళిత జన పలుకుబడి- కథానికల్లో భాషాశైలి పట్ల రచయితకి గల నిబద్ధతని సూచిస్తోంది. ‘మూడ్రాల్ముక్రాయి’- పి.విక్టర్ విజయకుమార్ రచన. ఇతి వృత్తం- రెడ్డి దగ్గరకు తీసిన వీరేశు వ్యక్తిత్వం, అస్తిత్వ స్పృహ, బతుకు విధానం, ఆలోచనా సరళి, రెడ్డి- వీరేశుల మధ్య నెలకొన్న కొన్ని భౌతిక వాస్తవాల మీద నిర్మింపబడింది. చాలా గొప్ప మనస్తాత్విక కథ. వస్తు కేంద్రీకరణం- వీరేశు దృష్టి కోణంనుంచీ కాక, అతన్ని ప్రేమిస్తున్న మాదేవి దృష్టికోణం నుండి వెలువడటంవలన- చదివించే లక్షణం పుష్కలంగా ఉన్నా- కొంచెం విశే్లషణాత్మకంగా కథని చదివే పాఠకుణ్ణి సంతృప్తిపరచదు. లోతైన అధ్యయన పటిమ, జీవిత తాత్వికత, అనుభవ సారం- ఉన్న రచయిత కథ ఇది. ‘ఓల్గా’కథానిక ‘ముదిమి సిమి’. ఎనభై ఎనిమిదేళ్ల వయస్సులో అనారోగ్యాన్ని అనుభవిస్తున్న తల్లికోసం- పెద్ద ఉద్యోగాన్ని వదులుకొని ఆమె సాన్నిహిత్యంలో, సేవలో తన బతుకు అర్ధాన్ని ఆనందించిన ఓ సుజాత కథ సంఘటనాత్మకంగా నవలా శిల్పంతో నడిచింది. సాయిపద్మ రాసిన ‘గాలికీ కుల ముంది.’ కులాంతర వివాహం కుమ్ములాటనే పునర్వచించింది. ఆధిపత్యం- స్వాభిమాన అస్తిత్వ చేతనల మధ్య సంఘర్షణ. అమృత- భర్త కులాహంకారాన్నీ, పురుషాధిక్యతనీ స్పష్టంగా తిరస్కరించి విజయపథంలో ముందుకు నడుస్తుంది! అధికార రోగ పీడిత వ్యవస్థాస్వరూపాన్నీ, తత్ సంబంధిత అనేకానేక జాడ్యాల్నీ- వ్యంగ్యాత్మకంగా ఆవిష్కరించిన కథ- పి.వి.సునీల్‌కుమార్ ‘తోక దెయ్యం చెప్పిన డిసిప్లి కథ’. ఇక, రేప్ నేరస్థులకి విధించబడే మరణశిక్షలోని సామంజస్యాన్ని ప్రశ్నించటం, పర్యావరణ విధ్వంసంలో ‘తిలాపాపం తలా పిడికెడు’కావటాన్ని చర్చకు పెట్టటం, కులం మార్పిడిలో రాజ్యప్రమేయాన్ని విశే్లషించటం, సమాజోద్ధారకులమనుకునే ’సోకాల్డ్’ రచయితల ఆలోచనాసరళిలోని డొల్లతనాన్ని బట్టబయలుచేయటం- అనే నాలుగు అవాంఛనీయతల్ని- ప్రయోగాత్మక కథన రీతిలో చెప్పిన కథ- సామాన్య రాసిన ‘అంతిమం’. చిన్న కథ ప్రాంగణంలో ఒదిగించిన చాలా విస్తృతమైన ఇతివృత్తం. దానికితోడు సంక్లిష్టమైన కథాశిల్పం! ‘తనదే ఆ ఆకాశం’ అనే కథని రాశారు పింగళి చైతన్య. కథ చెప్పే ‘నేను’ వివాహిత. అనుకూల దాంపత్యం గడుపుతోంది. ఇద్దరు పిల్లల తల్లి. ఆమెకు లక్ష్మి పరిచయమైంది. ఈమె అవివాహిత. డిజైనర్ స్టోర్ నిర్వహిస్తోంది. పిల్లల్నీ, మనుషుల్నీ ప్రేమించే స్వభావం కలిగిన నడి వయస్సుస్ర్తి. ‘నువ్ పెళ్లెందుకు చేసుకోలేదు?’ అనే ప్రశ్నతో తన ఉత్సుకతని బయటపెడుతుంది వివాహిత. ఇంకా, ఇలాంటి ప్రశ్నలతో లక్ష్మినుండి చాలా గ్రహిస్తుంది. లక్ష్మి సమాధానాల్లో- ‘వివాహ వ్యవస్థమీద నమ్మకం లేకపోవటం’అనేది కీలకమైనది. స్ర్తివాద భావజాలంలోని ఒక పార్శ్వాన్ని రేఖామాత్రంగా చిత్రించిన కథ ఇది.
మిగిలిన కథలన్నిటా కూడా రచయితల సంవేదనాత్మక చైతన్యం ప్రతిఫలించింది. ఈనాటి సామాజిక వాస్తవికత పట్ల, మనిషి బహిరంతర ప్రవర్తనల్లోని వైరుధ్యాల పట్ల- వారికిగల సంవేదన అది. కథారచన పట్ల ఆరాధనాభావంతో ఒక సామాజిక బాధ్యతని నిర్వహించాలనే చైతన్యం అది. అందువల్లనే కథలన్నీ ఆలోచనాప్రేరకంగా రూపుదాల్చాయి. ‘సంపాదకుల ముందుమాట’లో ప్రమీల, డా.సామాన్య- ‘ఇవి కుల కథలుకావు, మత కథలూ కావు, ఎత్తిపోతల కథలూ కావు. అక్షరాలా ఉత్తమ సమాజాన్ని స్వప్నిస్తున్న అత్యుత్తమ కథలు’ అన్నారు! చదివే పాఠకులే అసలైన అభిప్రాయ నిర్ణేతలు. ఆశిద్దాం వారూ అవునంటారని!

-విహారి