అక్షర

కథలు రాయడమెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథలు రాయడమెలా?
-శొంఠి కృష్ణమూర్తి
వెల: రూ.60/-
ప్రతులకు: నవచేతన
పబ్లిషింగ్ హౌస్
నవచేతన బుక్ హౌస్,
విశాలాంధ్ర బుక్‌హౌస్

ప్రపంచంలో వంటలు చేస్తున్న వాళ్లంతా ‘వంటలు చెయ్యడం ఎలా?’ అన్న పుస్తకం చదివి చేస్తున్నారనడం హాస్యాస్పదం. అలాగే వ్యాకరణం నేర్చుకోకుండా మాట్లాడ్డం, రాయడం రాదనటం కూడానూ.. మనుషులు మాట్లాడ్తున్న, రాస్తున్న భాషను ఆధారం చేసుకొనే వ్యాకరణజ్ఞులు వ్యాకరణ సూత్రాలు రాస్తారు. అందుకే ‘ప్రయోగ శరణంవయ్యాకరణం’ అంటారు. ఆయా రంగాల్లో వాళ్ల వాళ్ల అనుభవాల్నుంచి సిద్ధాంతాలు పుస్తక రూపం దాలుస్తాయి. అయితే సిద్ధాంత గ్రంథాలు చదవడం - వాళ్ల ప్రయోగాలకు మరింత బలం చేకూరుస్తుంది. అసలు సిద్ధాంతాలే చదవక్కర్లేదు అని అనడం శుద్ధ అనుభవ రాహిత్యం. అలాగే కథకులు కూడా - కథారచన చేసేవాళ్లు తాము చూసిన ఘటనకు స్పందించి ఓ నిర్మాణ రూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అలా వచ్చిన చాలా కథలను పరిశీలించి, విశే్లషించి, వివరించి - సందర్భాలకు అన్వయించి సూత్రబద్ధం చేసిందే సిద్ధాంత గ్రంథం. అదే ఈ ‘కథలు రాయడం ఎలా?’ అన్నది.