అక్షర

గిలిగింతల సాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్‌ఫెక్ట్-27
ముక్తవరం పార్థసారధి, పేజీలు:220,
వెల:రూ.150
నవచేతన పబ్లిషింగ్ హౌస్, బండ్లగూడ (నాగోల్),
హైదరాబాద్-68, ఫోన్:24224453/54

పర్‌ఫెక్ట్ అంటే తెలుగులో ఏమనాలి? ఏ రకంగానూ లోపం లేనివి అనాలా? అట్లాగున్నవి ఏమిటి? మూలకథలా? అనువాదాలా? పుస్తకమా? చదివితే తెలుస్తుంది. ఇక 27 అన్న అంకె గురించి. ఈ పుస్తకంలో ఒకే కథను రెండుసార్లు అచ్చువేశారు. అంటే ఉన్నవి 26 కథలు మాత్రమే.
అనువాద కథలు అని మొట్టమొదటే గట్టిగా చెప్పేశారు. కథల దగ్గరకువస్తే మాత్రం, కథ చివరలో మూల రచయిత పేరు, అదేదో రహస్యం అన్నట్టు చిన్నగా వేసి వదిలిపెట్టారు. మూల రచయితలు దిక్కులేని వారేమీ కాదు. మహామహుల కథలున్నారుూ ఈ సంకలనంలో. అందరివీ ఒక్కొక్క కథ మాత్రమే వుంటే సాదత్ హసన్ మంటో కథలు మూడు ఉన్నాయి. ఆలిస్ మన్రో, గాబ్రియెల్ గార్సియా మార్వెజ్, గోగోల్, కోత్సీ, సింగర్, కిప్లింగ్, హెల్మెన్ హెస్, స్టీపెన్ కింగ్ ఇంకా ఎందరో వున్నారు. అగాథా క్రిస్టీ కథ కూడా ఒకటి ఉంది. అది మిగతా వాటికన్నా పెద్దది. ఎంపిక చేసిన కథలు ఆయా రచయితల గొప్ప కథలు మాత్రం కావని అనుమానం. ప్రతి రచయితను వీలయినంతగా చదివి, వాటిలో నచ్చిన కథలను అనువదించడం ఒక పద్ధతి. ఐజక్ బషేవిస్ సింగర్ కథ చదివితే, నోబేల్ గ్రహీత సింగర్ ఇటువంటి కథలు కూడా రాశాడా? అన్న అనుమానం పుట్టింది. కొన్ని కథలను అనువాదం అనలేదు. ఫలానా రచయిత కథ ఆధారంగా అని రాశారు. అంటే అనువాదం బాగా స్వతంత్రంగా ఉందన్నమాట.
పార్థసారథి అనుభవంగల రచయిత, అనువాదకుడు. అయితే, ఈ అనువాదాలను ఒక ప్రణాళికగా చేయలేదు. అక్కడక్కడ దొరికిన కథలను అప్పుడప్పుడు అనువదించి పత్రికలకు పంపారు. కథలో ఎక్కువగా నేర ప్రవృత్తి, ఆడవాళ్ళను గురించి ఉండడం, అనుకోకుండా జరిగిందా? పత్రికల పద్ధతికి అది కుదురుతుంది గనుక అటువంటి కథలు వచ్చాయా? కాలక్షేపం కోసం చదవదలుచుకుంటే ఈ పుస్తకం బాగుందని అనాలి. చక్కని అనువాదాలు, తెలుగులోనే రాసుకున్నారు అన్నంత బాగున్నాయి. కథల నాణ్యతలోనే ఒక తీరు ఉంది. వేశ్యల గురించి ఎందుకు అన్ని కథలు? సెనే్సషనల్ లేదా గిలిగింతల సాహిత్యం ఇదంతా! అన్ని కథలు ఒకే శైలిలో నడవడం కొంత అసహజంగా ఉంది. సాహిత్యానువాదంలో మతాల రచయిత పంథా కొంతయినా తెలియాలి. వాక్య నిర్మాణం, మాటల తీరు, రచయితలు అందరిలోనూ ఒకే రకంగా ఉండదు కదా! ఇక ఏకంగా పాత్రలకు తెలుగు పేర్లు పెట్టి, కథలను మనవి, మన ప్రాంతానివిగా మార్చుకోవడం ఒక పద్ధతి. ఇది మరింత బలంగా జరిగితే, మూల రచయిత పేరు అవసరం లేదు. ఈ అనువాదకుడు వినయంగా మూల రచయితల పేర్లు చెప్పారు.
ఈ పుస్తకంలో గైడి మపాపా అని ఒక కథ వుంది. అది మపాపా కథ కాదు. ఆ రచయిత గురించినది. శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకే గారి భర్త రాసిన కథ ఒక సర్‌ప్రయిజ్. స్టీఫెన్ కింగ్ కథ, నిజంగా బాగుంది. రెండు లోకాలు అనే కథ నార్మన్ హెస్ రాసినది. అతనికి మన దేశం గురించి తెలుసు. కథ పూర్తిగా, మిగతా వాటికి భిన్నంగా వుంది. సీరియస్‌గా కథానికను, ప్రపంచ కథానికల తీరును పట్టించుకునే వారికి మాత్రం ఈ సంకలనం నిరాశే మిగిలిస్తుంది. ఊరికే చదువుతున్నా కొందరికి చిరాకు పుట్టే ప్రమాదం ఉంది.

-డి.స్వాతి