అక్షర

గుండెజబ్బు కారణాలు-నివారణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండెజబ్బు
కారణాలు-నివారణలు
-డా.్భండారు రాధాకృష్ణమూర్తి
డా.్భండారు సులోచన
వెల: రూ.90/-
ప్రతులకు: నవచేతన
పబ్లిషింగ్ హౌస్
నవచేతన బుక్‌హౌస్
అన్ని ప్రముఖ పుస్తక
కేంద్రాలలో
**
గత ముప్పై, నలభై సంవత్సరాల నుండి ఇండియాలో గుండె జబ్బు బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వ్యాధి చికిత్సకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయినప్పటికీ గుండె జబ్బుతో మరణించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ వ్యాధి ఇండియాలో ఇంత ప్రబలం కావటానికి కారణాలు ఏమిటి? దీనికి నివారణ మార్గాలు ఏవైనా ఉన్నాయా? గుండె జబ్బుకు ముఖ్యమైన కారణాలను వాటికి నివారణ మార్గాలను విశదీకరిస్తూ సాంకేతికంగా ఎక్కువ ప్రావీణ్యం లేని సామాన్య ప్రజలకు అర్థం అయ్యేటట్లు ఇంగ్లీషులో ‘హార్ట్ డిసీజ్’ అనే పుస్తకం వచ్చింది. అదే పంథాలో ఈ పుస్తకం కూడా -గుండె జబ్బు అంటే ఏమిటో, ఆ జబ్బు రావడానికి కారణాలు ఏమిటో, వాటి నివారణకు ప్రాథమిక మార్గాలు ఏమిటో తెలుసుకోవటానికి ఉపకరిస్తుంది. సాధ్యమైనంత వరకు ఇంగ్లీషు సాంకేతిక పదాలకు తెలుగు పదాలు వాడుతూ వాడుక భాషలో రాయడానికి ప్రయత్నించారు. కొన్ని సందర్భాలలో ఇంగ్లీషు పదాలు వాడారు. అవి అందరికీ అర్థం అయ్యేట్లు ఉండేట్టు ప్రయత్నించారు.