అక్షర

సమస్యలపై లోతైన అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృద్ధ ప్రపంచం
రచన: ఎం.ఆర్.కె.మూర్తి
వెల: రు.200/-
ప్రతులకు: రచయిత,
హారిక పబ్లికేషన్స్,
ప్రకాశ్‌నగర్,
నర్సరావుపేట-522601
**

ఆహార, వైద్య, విద్య, విజ్ఞాన రంగాల్లో సాధించిన ప్రగతివల్ల ప్రపంచ వ్యాప్తంగా మనిషి సగటు ఆయుఃప్రమాణం పెరగుతున్నది. మన దేశంలోనే స్వాతంత్య్రానికి పూర్వం 35 ఏళ్లుగా వున్న ఆయుఃప్రమాణం ఇప్పుడు 65కు చేరింది.
ఇది సంతోషించదగ్గ పరిణామమే! కానీ దేశం కొత్త ‘్ఛలెంజి’ల్ని ఎదుర్కోవాల్సి వస్తున్నది. పెరిగిన ఆయుఃప్రమాణంవల్ల వృద్ధుల సంఖ్య ఏటా 8.5 శాతం చొప్పున పెరుగుతున్నదట. క్రీ.శ. 2050వరకు వృద్ధుల సంఖ్య 160 కోట్లకు చేరుతుందట! జీవించి వున్న ప్రతి మూడో వ్యక్తి వృద్ధుడై వుంటాడట!
పెరుగుతున్న వృద్ధుల సంఖ్యతోపాటు వారికంటూ వుండే సమస్యలు పెరిగిపోతాయి. ఈ సమస్యల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి పరిష్కార మార్గాన్ని కనుక్కోవడం సమాజంయొక్క కనీస బాధ్యత. ఈ అధ్యయనాన్ని ళ్ఘూశఆ్యక (వార్ధక్య శాస్త్రం) అంటారట. ఈ శాస్త్రాన్ని గుర్తింఛి అధ్యయనంచేసే దిశగా తొలి ప్రయత్నం 1922లో వియన్నా (ఆస్ట్రియా) దేశంలో జరిగిందట!
వార్ధక్యం తెచ్చిపెట్టే సమస్యల్ని మనదేశం కూడా గుర్తించింది. దీన్ని సామాజిక రుగ్మతగా తీసుకుని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఎన్నో చట్టాలను నియమాలను ప్రకటించడం జరుగుతున్నది.
మాచర్ల రాధాకృష్ణమూర్తి (ఎంఆర్‌కె మూర్తి) నరసరావుపేట, గుంటూరు జిల్లాగారు విశ్రాంత అధ్యాపకులు. ప్రిన్సిపాలు. ఒక సామాజిక మాసపత్రికకు సంపాదకులుగా పనిచేసిన అనుభవం ఉంది. గొప్ప సామాజిక స్పృహ ఉంది. పలు సమస్యలపై లోతైన అధ్యయనంచేసి లోగడ ఎనిమిది గ్రంథాలను ప్రచురించిన అనుభవం వుంది. తన 76 ఏళ్ల జీవితంలో పలు పురస్కారాలు, అభినందనలు అందుకున్నారు. రోజురోజుకు పెరుగుతున్న తల్లిదండ్రులు పిల్లలమధ్య అంతరాల గురించి ఆలోచించారు. వేగంగా మారిపోతున్న సమకాలీన జీవితం, దానె్నదుర్కోవలసిన సీనియర్ సిటిజెన్ల కష్టాలు,. కడగళ్లను గమనించారు. ఈ సమస్యపై ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను లోతుగా అధ్యయనం చేసారు. సుమారు రెండేళ్ల అధ్యయనం తర్వాత ప్రస్తుత సంకలనం ‘వృద్ధప్రపంచం’ మన ముందుంచారు.
కళాశాల ప్రిన్సిపాలుగా, అధ్యాపకుడుగా ఒక పత్రికా సంపాదకుడిగా అలవరుచుకున్న అనుభవంతో పాఠకులకు ఆసక్తికరంగా వుండేట్టు ఈ పుస్తకాన్ని మలిచారు. వాక్య సారళ్యత, క్లుప్తత, లోతైన అధ్యయనశీలత ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తుంది. చెప్ప దలుచుకున్న విషయానికి హాస్యత జోడింపబడడంవల్ల ఈ గ్రంథం ఒక ఉపన్యాసంలా సాగకుండా ఒక ఆత్మీయ సంభాషణలా సాగుతుంది. హాస్య ప్రపంచం అను ఒక హాస్యధారా గ్రంథాన్ని రాసిన అనుభవంవల్ల చెప్పదలుచుకున్న విషయానికి హాస్యాన్ని కలిపి పఠనీయత పెంచారు. పుస్తకం ఆరంభమే జోక్‌లతో మొదలవుతుంది. ఎన్నోచోట్ల బొమ్మలు, బాక్సుకట్టి అందించిన వింతలు, విశేషాలు పాఠకుల్ని ఉల్లాసంగా తనవెంట తీసుకువెడతారు.
18 అధ్యాయాలు, 200 పేజీలు గల ఈ ‘వృద్ధప్రపంచం’లో మూర్తిగారు తానెన్నుకున్న విషయాన్ని పలు కోణాల్లో పరిశీలించి అందులోని మంచిచెడు, ప్లస్, మైనస్ పాయింట్లను చెపుతారు. ఎక్కడా తన అభిప్రాయం ఇది అని చెప్పకపోవడం ఈ పుస్తకం ప్రత్యేకత.
ముందుమాట రాసిన పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మాటల్లో చెప్పాలంటే- ‘ఈ గ్రంథం కేవలం వృద్ధులకో, వృద్ధాప్యానికో సంబంధించింది కాదు. అన్ని వయసులవారు చదవదగిన అమూల్యగ్రంథం ఇది’.

-కూర చిదంబరం