అక్షర

ఒకనాటి కథలపై స్థూల విశే్లషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీ రేఖలు
(సాహిత్య వ్యాసాలు)
-డా.వేదగిరి రాంబాబు,
వెల: రు.50/-
ప్రతులకు: వేదగిరి
కమ్యూనికేషన్స్,
హెచ్.ఐ.జి.1-, బ్లాక్ 6,
బాగ్‌లింగంపల్లి,
హైద్రాబాద్- 44
**
వేదగిరి రాంబాబు కథారచయిత మాత్రమే కాదు, కథాప్రచారకులు కూడా. తెలుగు కథకి గత వైభవం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న కార్యకర్త. వివిధ సందర్భాలలో రాసిన సాహితీ వ్యాసాల్ని రాంబాబు ‘‘సాహితీ రేఖలు’’గా తీసుకువచ్చారు. నిజంగానే కథాసాహిత్యాన్ని రేఖామాత్రంగా విశే్లషించారు. ఆయన ‘‘కొండొకచో పునరుక్తి దోషమున్నా’’ అన్నారు కానీ చాలాచోట్ల ఇది కనిపిస్తుంది. పాఠకుడికి చర్వితచర్వణంలా వుంటుంది.
గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ, బుచ్చిబాబు అంటే వేదగిరిగారికి ప్రాణం. ఎంత రాసినా ఆయనకు తనివి తీరదు. ఇందులోనూ అదే కనిపిస్తుంది. వీరితోపాటు కొవ్వలి, పాలగుమ్మి పద్మరాజులపై కూడా వ్యాసాలున్నాయి. మొదటి వ్యాసం తెలుగు కథకు స్ఫూర్తినిచ్చిన తొలితరం కథకులపై ఎంతో సమాచారం వుంది. శ్రీపాద, చింతా దీక్షితుల కథలపై సముచితంగా వివరించారు. ‘‘గిరిజనులు సంచార జీవనాన్ని సాగించేవాళ్ళ జీవితాల్ని’’ తెలుగు పాఠకులందించారు చింతాదీక్షితులు అనటం సమర్థనీయమే. వేలూరి శివరామశాస్ర్తీ, నోరి నరసింహశాస్ర్తీ, శ్రీనివాస శిరోమణి వంటివారి కథల్ని పరిచయం చేశారు. తెలంగాణ కథకులు సురవరం, పొట్లపల్లి రామారావు, సి.వి.కృష్ణారావు, వట్టికోట మొదలైన వారి కథారచనల్ని పేర్కొన్నారు.
కథా సంకలనాలపై వేదగిరిగారు సమంజసమైన అభిప్రాయం వెలిబుచ్చారు- ‘‘కథా సంకలనాలు ఎన్ని ఎక్కువ వస్తే అంతమంచిది. ఎవరి అభిరుచినిబట్టి వాళ్ళు తేవచ్చు. అందులో తప్పులేదు. కాకపోతే ఇవే సంవత్సరంలో వచ్చిన గొప్ప కథానికలనకూడదు. మేము మెచ్చిన కథానికలనవచ్చు’’. ఈ మాట కవితా సంకలనాలకూ వర్తిస్తుంది.
గిడుగు రామమూర్తిగారిపై ఎంతో సమాచారమిచ్చి ఈ తరానికి అందజేశారు. చాలామందికి తెలియని ముఖలింగ క్షేత్రం గురించి వివరించారు. ఏ భాషలోనూ కనపడని వెయ్యిన్నొక్క నవలల రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావుగారిపై వ్యాసం విశేషమైనది, కొవ్వలివారు తమ నవలల్ని ప్రచురించడానికి ‘‘కొవ్వలి బుక్‌డిపో’’ ప్రారంభించి నష్టాల పాలయ్యారు. వాడుక భాషలో నవలలు రాసి పాఠకుల్ని తయారుచేసిన ఘనత కొవ్వలి వారిదే. భమిడిపాటి జగన్నాథరావు, బలివాడ కాంతారావుల కథల గురించి రాసినవి ‘‘మొక్కుబడి’’గా వున్నాయి. వీళ్ళ గురించి ఇంకా సమగ్రంగా రాయగలిగిన సత్తావుండి కూడా వేదగిరిగారు సూక్ష్మంలో మోక్షంగా రాశారు.
వేదగిరి రాంబాబు ‘‘కథ’’అనే మాటను సహించలేరు. ‘కథానిక’అనే వాడతారు. పోరంకివారైనా, రాంబాబుగారైనా లోపలకి వెళ్తే ‘కథ’అనే వాడతారు. ‘దొంగ’ కథలో అంటారు- మళ్ళీ ‘కథానిక ‘దొంగ’ అంటారు. అందరూ పద్మరాజుగారి ‘‘గాలివాన’’ను కథ అంటే ఈయన ‘కథానిక’ అంటారు. శ్రీపాదవారి విభిన్న కథలూ కాదు, కథానికలూ కాదు... పెద్ద కథలు లేదా నవలికలు అనిపించేవి ఉన్నాయి. ఈ గందరగోళం లేకుండా ‘‘ఆధునిక కథ’’అనవచ్చు. కథాసాహిత్యం, కథా సంపుటాలు... వంటివే బహుళప్రచారం పొందాయి.

-డి.ఎన్.ఎస్.