అక్షర

నిత్య సత్యాల కథల మాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేయి వీడని నక్షత్రం
(కథా సంపుటి)
-కొండవలస శ్రీనివాసరావు,
వెల: రూ.250/-
ప్రతులకు: ప్రముఖ
పుస్తక కేంద్రాలు
**

‘‘ఆత్మీయత, దగ్గరితనం, భావపరంపర, వరదలా కన్నీళ్ళరూపంలో బయటపడుతోంది.’’ ‘‘మనసుకు మనసు వంచనచేస్తే, మిగిలేది కన్నీళ్ళే!’’
‘ప్రేమంటే ఒక భోగం అనుకునేకంటే, ఒక త్యాగం అనుకుంటే.. మేలు.’ ‘గడ్డిపోచలోను గాజుపెంకులోనూ, అందాలు దర్శించే వయసు’- ఇలాంటి నిత్యసత్యాలు కొండవలస శ్రీనివాసరావు ‘‘రేయివీడని నక్షత్రం’’ కథా సంపుటిలో కొల్లలుగా కనిపిస్తాయి.
ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన శ్రీనివాసరావు తానున్న పరిసరాల్నే పాఠశాలగా చేసుకుని, పాఠాల చెప్పటమేకాకుండా, పాఠాలు నేర్చుకున్నారు. 71 సంవత్సరాల జీవితాన్ని తరిచిచూసిన వీరు, లోగడ ఒక కథా సంపుటి; ఒక నవల; ఒక కవితా సంపుటితో తన అనుభవాల్ని, ఆలోచనల్ని, పాఠకులతో పంచుకుని మెప్పు పొందారు. ఇది వీరి రెండవ కథా సంపుటి. ఇందులో ఇరవయ్యారు కథలున్నాయి. అయిదు కవితలున్నాయి. ఈ కథలు, కవితలు లోగడ ప్రముఖ పత్రికలలో ప్రచురించబడి ప్రాచుర్యం పొందాయి.
సంకలనాని కి ముందు మాటగా ప్రముఖ కథారచయిత బి.పి.కరుణాకర్ అన్నట్లు: ‘కథలు రాయటమంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు.. కథ మీద పట్టుసాధించాలంటే సాధన ప్రతిభ కావాలి?’ సులభ గ్రాహ్యంగా ఉండే కథలను సృష్టించటం జీనియస్‌లకు మాత్రమే సాధ్యం. మరో ప్రముఖ కథా రచయిత పి.ఎస్.నారాయణ అన్నట్లు ‘‘పాఠకులను తమ రచనల వెంట ఆసక్తితో పరిగెత్తేలా చేయాలి’’- ఈ రెండు పరిశీలనలు కొండవలస కథల పట్ల అక్షరాలా.. నిజం.
రాజవంశపు బంగరు పంజరంలో చిక్కుకుని స్వేచ్ఛకై పరితపించే ‘‘రేయి వీడని నక్షత్రం’’లోని మంజరిని తీసుకున్నా, శృంగార కథల పోటీలను నిర్వహించే పత్రికల మీద, తన నిరసన ‘‘బహుమతి’’లో ప్రకటించినా, హాపీ న్యూఇయర్ అంటూ సినిమా తారల గ్రీటింగ్‌కార్డులు తీసుకొచ్చిన కానె్వంటు పిల్లల గురించి ‘కొత్త సంస్కృతి’లో తన అయిష్టాన్ని ప్రకటించినా, రచయత కథల్లోని ఏదో ఒక పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు. కథలను ఆహ్లాదకరంగా నడుపుతూ, ఆద్యంతం ఆసక్తిగా పాఠకుడిని చివరివరకూ తనతో తీసుకెళ్ళటంలో కృతకృత్యులయ్యారు.
అయితే, కొన్నికొన్ని కథల్లో చెప్పదలుచుకున్న విషయానే్న ముఖ్య ‘టార్జెట్’గా చేసి కథనల్లటంవల్ల సహజత్వం కొంత లోపించినట్లనిపిస్తుంది. ‘మధ్యతరగతి మానవతి’లో గృహిణి శారద ఇల్లు నడపటానికి, పిల్లల కానె్వంటు ఫీజులకై వ్యభిచరించటానికి కూడా తెగిస్తుంది. భర్తే విటుడిగా ఎదురైన వేళ; ‘‘్భర్తతోకూడిన స్ర్తి సానిముండ ఎలా అవుతుంది సార్’’ అని సమర్ధించుకోవటం కొంత అసహజం అనిపిస్తుంది. అలాగే ‘‘రేయి వీడని నక్షత్రం’’లో రాజవంశపు మంజరికి కొద్దిదూరంలో చలిమంట కాచుకుంటున్న దొంగ రంగన్న కండలు తిరిగిన శరీరం చూసి, ఆహ్వానిస్తే, అంతరాత్రి ఆ భవనంలో ‘ఎలానో’ ప్రవేశిస్తాడు. అతనికి తన సర్వస్వం అర్పించి, తనను వెంట తీసుకెళ్ళమని వత్తిడి చేస్తుంది. క్షణిక సుఖంతో ఏదో అలౌకికానందం పొందటాన్ని ‘గ్లోరిఫై’ చేయకుండా ఉంటే బావుండేది.
అయితేనేం ‘మేడి పండు’ ‘‘గంజాయి వనంలో తులసి’’ లాంటి కథల్లో సంఘాన్ని సంస్కరించాలన్న తపన ఉంది. ‘సన్మానం’ లాంటి కథల్లో మహేశ్, వృద్ధదంపతులు రామయ్య జానకిల యెడ చూపిన దాతృత్వం. తన ధర్మంగా భావించటం ఎంతో ఉదాత్తంగా ఆదర్శంగా ఉంది.
‘రోజాప్రియుడు’ అన్న కథ కాని కల్పనలో దివంగత నేత జవహర్‌లాల్ నెహ్రూ తన కోటు బటన్ హోల్‌లో రోజా పువ్వును ఎందుకు ధరించే వాడో.. అన్వయించటం రచయత కల్పనా చాతుర్యం.
ప్రవాసులైనా, తెలుగు సాహిత్యం ఎడ కొండవలస శ్రీనివాసరావుగారు చేస్తున్న ఈ సాహిత్య కృషి బహుదా ప్రశంసనీయం మరియు ప్రోత్సాహనీయం.

-కూర చిదంబరం