అక్షర

‘్ఫల్‌గుడ్’ రచనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వప్న సాకారం కథలు
రచయిత్రి: వాలి
హిరణ్మయిదేవి
వెల: రూ.150/-
ప్రతులకు: జ్యోతివలబోజు, ఫోను: 8096310140 మరియు ఇతర ప్రముఖ పుస్తక విక్రేతలు
**

ఒక రచయిత/ రచయిత్రి/ప్రతిభాపాటవాలు అవగతం చేసుకోవాలంటే, రాసిన కథలన్నీ కనీసం కొన్నైనా- ఏకబిగిన చదవాలి. అప్పుడే, ఆ రచయిత శైలి, కథ, కథనం, ఎత్తుగడలోని గొప్పతనం పాఠకునికి అర్ధం అవుతుంది. ‘స్వప్న సాకారం’ కథా సంకలన రచయిత్రి వారి హిరణ్మయిదేవిగారు గత ముప్పయి అయిదు ఏళ్ళనుండీ రాస్తున్నారు. ఇప్పటివరకు రెండు వందలకు పైగా కథలు వ్రాసారట. ఇది వారి తొలి సంకలనం. ఇందులో చేర్చబడిన 22 కథలు 1998నుండి 2014వరకు పలు ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురించబడినవి. వీరి కథల్లోని పాత్రలన్నీ, మన చుట్టూ ఉండి మనతోబాటుగా మెసులుతున్నవే! సంఘటనలు, పరిసరాలు... అన్నీ, నిత్య జీవితంలో ఎదురవుతున్నవే! మధ్యతరగతి కుటుంబాల్లో దొరికే ప్రేమ, వాత్సల్యం, అవి లోపించిననాడు కలిగే కల్లోలం; ఎయిడ్స్ మహమ్మారి ప్రవేశిస్తే కలిగే బీభత్సం; ఇంటాబయటా ఆఫీసులోనూ, అధరము కదిలించీ, కదిలించక, గాంభిర్యం చూపే బాసు నష్టపోతున్నదేంటో...; ‘మెంటల్లీరిటార్డెడ్’ కూతురు పట్ల చూపాల్సిన ప్రేమ... కాదేదీ కథకు అనర్హం అన్నట్లు చిత్రీకరించారు.
ప్రతీ కథలోనూ అంతర్లీనంగా ఓ సందేశం ఇచ్చే ప్రయత్నం బాగుంది. ‘ఆదర్శం’ అన్న మొదటి కథలో, పిల్లలకు తల్లిదండ్రులు ‘ప్రేమ ఇస్తేనే, ప్రేమ వస్తుంది’ అని చెప్పారు. సమాజానికి సేవలందించే వారంతా చిరంజీవులు అని ‘చిరంజీవులు’లో చెప్పారు. ‘పంతాలకుపోయి పచ్చని సంసారాన్ని పాడుచేసుకోవద్దనీ’, ‘స్ఫూర్తి’ కథలో వివరించారు. ఎంత గొప్పవారైనా పరిస్థితుల ప్రాబల్యానికి తలొగ్గాల్సిందేనని ‘అబద్ధానికి ఆమడ దూరంలో’ చెప్పారు. అలాగే ‘ఆడదానికి ఆడదే శత్రువుకారాద’ని ‘ఆమని ఆగమనం’లో చెప్పారు. జరామరణాలు అందరికీ ఉండేవే. మన పెద్దలను మనం ఆదరించే తీరే రేపు మన బిడ్డలకు ఆదర్శమవుతుందని, ‘కంటేనే అమ్మ అంటే ఎలా?’లో విశదీకరించారు. కనుమరుగవుతున్న పచ్చదనం, కాంక్రీటు జంగిల్‌లా మారుతున్న పట్టణాల గురించి ‘ఓ పచ్చని స్పర్శ’లో మనసుకు హత్తుకుపోయేలా వివరించారు రచయిత్రి. సమాజంలోని చెడుని నిరసించాలనీ, మంచిని పెంచాలని సందేశాత్మకంగా వ్రాసిన కథలు ఇవి. చెబుతున్న విషయాలు నలుగురికి తెలిసినవే అయినా, కథాగమనం ఎన్నుకున్న భాష, సారళ్యత, సాటి మనుషులయెడ ప్రకటించే కరుణ పాఠకులను ఆకట్టుకుంటాయి.

-కూర చిదంబరం