అక్షర

సార్వజనీన సరళ రచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శంకర శతకము’
-నూతలపాటి
వెంకటరత్న శర్మ;
పుటలు: 36;
వెల: రు.25/-;
ప్రతులకు: ఎన్.వి.రత్నశర్మ, హెచ్.నెం.4-239/ఎఫ్ 205, రోహిత్ హోమ్స్,
గీతానగర్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్- 500 047.
**
నిశ్చల శివభక్తి తత్త్వంతో నిండిన ‘శంకర శతకం’ సరళమైన నూరు పద్యాలతో సాఫీగా సాగిపోయిన రచన. కృతికర్త నూతలపాటి వెంకటరత్నశర్మగారు అలతి అలతి పదాలతో అందరికీ అర్థమయ్యేట్టుగా పద్య రచన చేశారు. అన్ని పద్యాలకూ మకుటం (అంత్యపదం) ‘శంకరా!’ అంటూ సంబోధనార్థక పదం.
‘శం సుఖం కరోతీతి శంకరః (సుఖమును కలిగించువాడు- శంకరుడు) అని వ్యుత్పత్త్యర్థం. శివుడు అంటే శుభస్వరూపుడు అని అర్థం. సమానార్థక పదాలైన ‘శివ’/ ‘శంకర’ నామలను నూరుసార్లు ఉచ్చరిస్తే ‘నమశ్శివాయ’అనే పంచాక్షరీ మంత్రాన్ని నూరుసార్లు జపించిన ఫలితం ఇస్తుందనే ఉద్దేశంతో ‘శంకర’ శబ్దమకుటంతో, శర్మగారు ఈ శతకం రాయటంలో చూపించిన వస్త్ధ్వుని ప్రశంసనీయం.
కొన్ని పద్యాలలోని భావ శబలత బాగుంది.
విభూతి రాసుకొని ‘నమశ్శివాయ’ అంటూ ముముక్షువుగా ధ్యానం చేయటం మానసిక పూజ. నిరంతరం వేదమంత్రోచ్చారణ చేస్తూ ఉండటం వాగ్రూప పూజ. పుణ్యక్షేత్ర దర్శనం కర్మమార్గపూజ. ఈ మూడు (వాక్కాయకర్మ) మార్గాలలో ఏ ఒక్క రీతిలో మనం సాగినా ఫాలాక్షుడు రక్షిస్తాడు అనే కవి విశ్వాసానికి ఒక ఆధారపీఠం ఉంది. శివునకున్న ‘ఆశుతోషుడు (సత్వర సంతోషి- లేక- అల్పసంతోషి)‘అనే పేరు ఈ విశ్వాసానికి నేపథ్యం, బలమైన మూలం. ఇది ఇందులోని వివక్షితాన్యపర వాచ్యధ్వని; భావశమలతా మనోహరత.
అక్కడక్కడ కావ్యలింగం, విషమాలంకారం మొదలైన అలంకారాలు చోటుచేసుకున్నాయి. ‘ఈశానాననా! (ఐశ్వర్య పూర్వకముఖము కలవాడా)’ అంటూ రెండు మూడు చోట్ల సంబోధించటం విస్తృతార్థ మనోహరంగాను, బహుళార్థ సాధకంగాను ఉంది. అలాగే ‘పంచాననా!’ అనే సంబోధన కూడా. ‘స్నానించు’అనే పదప్రయోగం కవియొక్క ఆధునికతా ధోరణికి తార్కాణం.
కొన్నిచోట్ల క్రియాపదాలు కర్తననుసరించలేవు. ‘చేస్తివిగదే’లాంటి పద ప్రయోగాలు లాక్షణికమైన హుందాతనానికి కొంచెం భంగం కలిగిస్తాయి. మొత్తం మీద ఇందులో చాలా పద్యాలు శర్మారి నిక్కపు భక్తికి, నిరాడంబరతకు, నిజాయితీకి నిదర్శనాలు.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం