అక్షర

విద్యార్థుల కరదీపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన సారథులు
-గడ్డం కేశవమూర్తి
ప్రచురణ: జికెఎం ఏజన్సీస్
హౌస్ నెంబర్ 4-7-138/1
కుమరపల్లి, హన్మకొండ, వరంగల్-506001
08008794162
ధర : 200 రూపాయలు
పేజీలు: 264
**
చారిత్రక పుస్తకాలు, నవలలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు కామెడీ, జనరల్ నాలెడ్జిపై చాలా పుస్తకాలు వస్తుంటాయి, కాని ఈ రచయిత చేసిన గొప్ప ప్రయత్నం భిన్నమైన పుస్తకాన్ని అందించడం. ఆంగ్లంలో సైతం ఈ తరహా పుస్తకాలు అరుదుగా వస్తుంటాయి. జనసారథులు పేరిట ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల జీవిత విశేషాలతో కూడిన పుస్తకం ఇది. మంచి వ్యక్తిత్వం, సంప్రదాయం, సంస్కృతి, ఉన్నతవిలువలున్న 63 మంది సివిల్ సర్వీసు అధికారుల విశేషాల సమాహారం ఈ పుస్తకం. సివిల్ సర్వీసు అధికారులుగా ఎంపికైన విధానం, నేపథ్యం, సన్నాహక తీరుతెన్నులు, లక్ష్యాలు, ఆశయాలు, తమ విజయాలు ఒకొక్కరూ చెబుతుంటే మనం ఎందుకు అదే బాటలో సివిల్ సర్వీసు అధికారులు కారాదనే స్ఫూర్తి రగిలిస్తుంది ఈ పుస్తకం. సమాజంలో కొంత మంది వ్యక్తుల జీవిత విశేషాలు ఎంతో మందికి ఇదే తరహాలో ప్రేరణ రగిలిస్తాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు చేసిన కృషి, వారు తమ సర్వీసులో తృప్తిపడిన సంగతులతో పాటు వారి వ్యక్తిగత సమాచారాన్ని వెలుగులోకి ఈ పుస్తకం ద్వారా రచయిత తీసుకువచ్చారు. వివిధ పోటీపరీక్షలు రాసే వారికే కాదు, ఉద్యోగాలు చేస్తున్న వారికి, మేధావులకు, విద్యార్థులకు, యువతకు, అధ్యయన కారులకు సైతం ఈ పుస్తకం ఒక దిక్సూచిలా కరదీపికలా ఉపయోగపడుతుంది. సామాజిక సమస్యల పట్ల అవగాహనతో ఎన్నో విశేషాలను పరిచయం చేస్తూ ఆసక్తి గొలిపే విషయాలను పుస్తక రూపంలో అందించారు. చాలా మందికి ఇది మంచి రిఫరెన్స్‌గా కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన వారు, పనిచేస్తున్నవారు 400కుపైగానే సివిల్ సర్వీసు అధికారులున్నారు, అందరి గురించి రాయాలంటే విస్తృతి పెరుగుతుంది, పరిధి దృష్ట్యా ఎంపిక చేసిన అధికారుల గురించి మాత్రమే ఇందులో ప్రస్తావన ఉంది...పరిశోధక కోణంలో కంటే వ్యక్తిగత ప్రేమాభిమానాలు రచయిత అధికారులపై బాగా కురిపించడం ప్రామాణికతను ప్రశ్నించేదిగా ఉంది.

-బి.వి.ప్రసాద్