అక్షర

బహుముఖాల ద్వానా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అక్షరం ప్రసవించే వేళ’
కవితా సంపుటి
-ద్వా.నా.శాస్ర్తీ
ప్రతులకు: అన్ని
ప్రముఖ పుస్తక
కేంద్రాలలో
--

ఒకే రంగానికి కట్టుబడి వున్నా, బహు వ్యాసంగాలతో నిత్యం సంచరించే వ్యక్తిని, ఏదో ఒక అంశానికి ముడిపెట్టి చూడలేము. ఈ వాక్యానికి సాక్షి సంతకం ద్వా.నా. శాస్ర్తీ. సాహితీ విమర్శకునిగా, సాహిత్య చరిత్ర సంకలన కర్తగా, వ్యాసకర్తగా, కవిగా, రూపక కర్తగా, పోటీ పరీక్షలకు విద్యార్థులను సమాయత్తం చేసే అధ్యాపకునిగా, వక్తగా, బహుళమైన ప్రజ్ఞలున్న వ్యక్తి డా. ద్వా.నా. శాస్ర్తీ. ఆయన తన రచనా వ్యాసంగానికి కవిత్వంతోనే శ్రీకారం చుట్టినా, కవి ద్వానా శాస్ర్తీ మూడో స్థానంలోనే వున్నారు. మొదటి రెండు స్థానాలు, సాహితీ విమర్శకుడైన ద్వానా శాస్ర్తీని, సాహిత్య చరిత్ర కర్త అయిన ద్వానా శాస్ర్తీని, ప్రతిష్ఠించుకున్నాయి. అయినా ద్వానా శాస్ర్తీ కవిగా తన ప్రస్థానాన్ని ఆపలేదు. ఇటీవలే కవిగా అష్టపదిలో ప్రవేశించారు. ‘అక్షరం ప్రసవించే వేళ’ అంటూ తన ఎనిమిదో వచన కవితా సంపుటిని వెలుగులోకి తెచ్చారు. సప్తపది నడిచాకా, అష్టపతి బాంధవ్యాన్ని సుస్థిరం చేస్తుంది కనుక, కవి ద్వా.నా. శాస్ర్తీని, ఈ సంపుటి సుపరిచితుణ్ణి చేసే అవకాశం ఉంది.
అరవై ఎనిమిది ఖండికలతో అందుబాటులోకి వచ్చిన కవితా సంపుటి ఇది. ఇప్పటి దాకా ఆయన రాసిన కవిత్వమంతా వచనమే. కవి తన భావనలను అక్షరాల ద్వారానే ప్రసవించగలడు కనుక, ఈ సంపుటికి ‘అక్షరం ప్రసవించే వేళ’ అని నామకరణం చేసినట్టు తోస్తుంది. ఒక రకంగా నావౌచిత్యాన్ని సాధించినట్టే.. నిజానికి ఈ ప్రసవ వేదనను ఆయనొక కష్టంగా భావించలేదు.
అందుకే ఆయనొక చోట...
‘‘కవిత్వం రాయడం అంటే
అక్షర ప్రసవ వేదనను ఆస్వాదించడం’’
అన్నాడు. ‘వేదనను ఆస్వాదించడం’ అన్నమాటలో ద్వానా కవిత్వముంది. అదే కవితలో మరొకచోట
‘‘ఆత్మను ఆవిష్కరించే అద్భుత రసాయన ప్రక్రియ
కవిత్వం’’
అన్నారు. ఇది కవిత్వానికి ద్వానా శాస్ర్తీ చెప్పిన నిర్వచనంలా ఉంది. చాలామంది కవితల్లో పల్లెటూరు స్థానం సంపాదించుకున్నట్లే, ఈ సంపుటిలోనూ, పల్లె తన జాగాను ప్రకటించింది.
‘‘వినదగునెవ్వరు చెప్పిన’’ మనకు బాగా పరిచయమైన మాటను సూత్రప్రాయంగా తీసుకుని, ఒక కవితను ఆల్లారు. దానికి శీర్షిక ‘శ్రవణ వైభవమ్’’
‘‘శ్రవణమ్
ఒక నిశ్శబ్ద ఆత్మోన్నది
ఒకనోరు, రెండు చెవులున్నాయంటే
శ్రవణ ప్రాధాన్యం గుర్తించమనే’’
‘నిశ్శబ్దం ఆత్మోన్నతి’’ అన్న పదబంధంతో లోతైన ఆలోచన కలిగిస్తూనే, ఆ పక్కనే వున్న పంక్తుల్లో చాలా మామూలు మాటల్తో వౌలికమైన ఆలోచనల్ని కలిగించారు. భావానికి విశేషాంతకాన్ని కల్పించి, వ్యత్యస్థం చేసినట్టుంది.
నిన్న మొన్నటిదాకా మన మధ్య ఆరోగ్యంగా బతికి, ఇప్పుడు కొన ఊపిరితో కోమా లోకి చేరిన ఉత్తరాన్ని గురించి రెండు మంచి మాటలన్నారు.
‘‘కార్డులూ, కవర్లూ
అప్పుడు వ్యక్తిత్వ వికాస వాచకాలు’’
ఈ మాటల్తో, ఆయన ఉత్తరానికిచ్చిన స్థానం పదిమెట్లు పైకి ఎగబాకింది. వ్యక్తిత్వ వికాసం గురించి, పది రకాల ఉపన్యాసాలిచ్చే, ద్వానా శాస్ర్తీ, ఉత్తరంలో వ్యక్తిత్వ వికాసాన్ని దర్శించడం అభినందనీయం. అలాగే
‘‘నాన్న రాసిన ఉత్తరం
ఒక లక్ష్మణ రేఖ’’
ద్వానా శాస్ర్తీ భావ ప్రకటనా పటిమకు ఈ పంక్తులు స్థారుూ భావంలా నిలుస్తాయి. మన చుట్టూ వుంటే అంశాలనే ఈ కవి, తన కవితా వస్తువులుగా, ఎక్కువగా ఎంచుకున్న దాఖలాలు, ఈ సంపుటిలో మనకి కనిపిస్తాయి. మన జీవితంలో విడదీయలేని భాగమైపోయిన సెల్‌ఫోన్ గురించి ఒక కవిత వ్రాశారు. బహుశః సంపుటిలో అదే మొదటి కవితనుకుంటాను. ఎత్తుగడ, నిర్వహణ సామాన్యంగానే సాగుతాయి. మధ్యలో ఒకచోట.
‘‘అది లాండ్‌ను కూడా కబ్జా చేస్తుంది’’ అంటారు. చటుక్కున ద్వానా శాస్ర్తీలోని చమత్కారి మన కళ్ళ ముందు ప్రత్యక్షవౌతాడు. మన ఇళ్ళల్లో లాండ్‌లైను ఫోన్లు దాదాపుగా అంతరించిపోయిన మాట అలా వుంచితే, ‘లాండ్’, ‘కబ్జా’ అన్ని మాటలు అవే పంక్తిలో చేర్చడంతో, వర్తమాన కాలాన్ని స్ఫురింపచేసినట్లుంది. ఈ చమత్కారం ద్వానా మార్కు.

-వోలేటి పార్వతీశం