అక్షర

ఆకట్టుకొన్న ఇందులేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందులేఖ (నవల)
-ఒ.చందుమీనన్
అనువాదం: ఎస్.జయప్రకాశ్
వెల: రూ.305/-
ప్రచురణ: నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా

ఒ.చందు మీనన్ గారిచే 1889లో మలయాళం లో రచించబడిన ఈ నవల 1890లో ఆంగ్లంలోకి అనువదించబడిం ది. ఇప్పుడు ఎస్.జయప్రకాశ్ గారిచే తెలుగులోకి అనువదించబడి నేషనల్ బుక్ ట్రస్ట్ వారిచే ప్రచురించబడింది. ఆంగ్ల నవలలు విస్తృతంగా చదివిన రచయిత అటువంటి ఒక నవలను మలయాళంలో రాయాలను కున్నారనీ, అప్పటివరకు సహజత్వానికి భిన్నంగా ఉండే కథలను చదువుతూ వుండిన తన మలయాళీ స్నేహితులకు వాస్తవ సంఘటనలతో, తమ ఇళ్లల్లో జరిగేటటువంటి సన్నివేశాలతో నిండిన ఒక నవల ఆసక్తి కలిగిస్తుందో లేదో తెలుసుకోవాలనే కోరికతో ఇందులేఖ నవలను రాశారనీ ఈ నవలకు రాయబడిన ఉపోద్ఘాతం చదివితే తెలుస్తుంది.
జన్మతః సంక్రమించిన బుద్ధి చాతుర్యానికీ అందచందాలకీ పేరుగాంచిన నాయర్ అమ్మాయిలకు ఆంగ్ల విద్యను నేర్పిస్తే దానివలన వారికి లభించే గౌరవ మర్యాదలు, ఆత్మవిశ్వాసం, కార్యనిర్వహణా దక్షత ఎలా ఉంటాయో చెప్పాలనే ఆకాంక్షతో ఈ నవలను మలిచారట రచయిత. ఇందులేఖ ఆ ఆకాంక్షకు అనుగుణంగా తీర్చిదిద్దబడిన పాత్ర. అత్యద్భుత సౌందర్యరాశి ఇందులేఖ ఆకారానికి తగిన చదువు సౌశీల్యము వున్న 18 ఏళ్ల యువతి. ఆంగ్ల విద్యాభ్యాసము, పాడడంలోను, పియానో, ఫిడేలు, వీణ మొదలైన వాటిని వాయించడంలోను నేర్పు మాత్రమే కాక ఐరోపాలో స్ర్తిలు కాలక్షేపానికి నేర్చుకునే కుట్టుపని, చిత్రలేఖనం వంటి వాటితోను పరిచయం ఉన్న స్ర్తి. ఈ నవలకు నాయకుడైన మాధవుడు కూడా చక్కటి తెలివితేటలూ, దేహ సౌష్టవము, సౌందర్యము, సుగుణాలు కలిగిన యువకుడు. వారిద్దరి మధ్య ఉదయించే ప్రేమ, ఆ తర్వాత ఇందులేఖ తాతగారు పంజుమీనన్ ఆవేశంలో చేసే ఒక శపథం, ఆ పైన కొందరి స్వార్థం వలన ప్రచారమయే ఒక వదంతి, తత్ఫలితంగా ఇందులేఖకీ మాధవుడికీ కలిగే ఎడబాటు - వీటి ఆధారంగా నడిచిన కథ ద్వారా అప్పటి భారతదేశ పరిస్థితులని, యువతీ యువకుల ఆలోచనలని, భావాలని, మలయాళ దేశపు సంప్రదాయాలని పరిచయం చేస్తుందీ పుస్తకం.
నవలలోని చిన్నా పెద్దా పాత్రలన్నిటినీ కూడా సుదీర్ఘమైన వర్ణనలేమీ చేయకుండానే చాలా సజీవంగా కళ్ల ముందు నిలుపుతారు రచయిత. లోతైన పరిశీలనతో కూడిన ఒకటి రెండు వాక్యాలతో వాళ్ల వ్యక్తిత్వాన్ని వైరుధ్యాలతో సహా అర్థం చేయిస్తారు. ఎక్కువగా సంభాషణల రూపంలో సాగిన ఈ నవల చివర్లో పూర్తిగా సంభాషణలతోనే నడిచిన ఒక పెద్ద అధ్యాయం. ఆస్తిక నాస్తిక సిద్ధాంతాల గురించీ, హిందూ మతం గురించీ, బ్రిటిషు వారి పాలన గురించీ, కాంగ్రెస్ మహా సభ గురించీ అప్పటి యువకుల్లో ఉన్న విభిన్న అభిప్రాయాలను ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది. వాక్య నిర్మాణమూ, పదాల ఎంపిక అక్కడక్కడా కొంచెం ఇబ్బంది కలిగించినా మొత్తం మీద అనువాదం బాగుందనే అనిపిస్తుంది.

-శ్రీ