అక్షర

భావాల ముందు తేలిపోయిన రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెర్నాకోల
-ఇసనాక మురళీధర్
వెల: రూ.100
ప్రతులకు: దీపికా
పబ్లికేషన్స్
జె.పి.నగర్
హైదరాబాద్-73.
**
ఇటీవల మినీ కవితా రూపాలు కొన్ని వచ్చాయి. వాటిల్లో ‘రెక్కలు’ ఒకటి. యం.కె.సుగమ్ బాబు వీటిని మొదటగా తెచ్చారు. కొందరు ఈ మార్గంలో కవిత్వం రాసి ‘కవి’ అనిపించుకుంటున్నారు. ఇటువంటి వారిలో ఒకరు ఇసనాక మురళీధర్. ‘చెర్నాకోల’ పేరుతో రెక్కల కవితా సంకలనం తీసుకువస్తే, కె.శివారెడ్డి, సుగమ్ బాబు ముందు మాటల్లో ప్రశంసించారు.
మురళీధర్ హేతువాది. కొండొకచో నిరంకుశుడు కూడా. ఎప్పటి నుంచో గూడు కట్టుకొన్న భావాలను అణచుకోలేక అచ్చువేసేశారు. ఈ హేతువాదానికి పెట్టిన కొత్త పేరు ‘మానవ వాదం’. ఎం.ఎన్.రాయ్ మానవతా హేతువాదంలో ప్రభావాన్వితుడు. వేమన కంటె హేతువాద కవి ఉండడని చెప్పవచ్చు. త్రిపురనేని రామస్వామి హేతువాద రచనలు కంటె వేమన పద్యాలే వ్యాప్తికెక్కాయి. ఇప్పుడు అసలే అనేక వాదాలతో సతమతమవుతూంటే ఈ చెర్నాకోల వచ్చి పడింది. రాజకీయాలు, కులాలు, మతాలు ఓటు బ్యాంక్‌కి వాడుకొంటున్నాయన్న కవి ఈ చెర్నాకోలను రాజకీయాలపై విసరాలి. మతం లేని దేశం వుందని నాకు తెలీదు. విగ్రహారాధన వద్దన్న బుద్ధుడ్నే ఆరాధిస్తున్నాం కదా! మతం అనే నల్ల మందు పూర్వం కొందరికి ఉపయోగపడింది. ఇప్పుడు అందరికీ ఉపయోగపడుతోంది. కొత్త భావాలు చెప్పి, కొత్త ఉపమానాలు వేసి, కదిలింపజేస్తే కొంతైనా ప్రయోజనం ఉంటుంది. నాస్తికులు దీనిని చదవవచ్చు. రాజకీయ నాయకులు దగ్గరికే రారు. ఇటువంటివి భావజాలాన్ని మార్చగలవా? అన్నదే సందేహం. హేతువాదానికి గల ‘సీరియస్‌నెస్’ తగ్గిందనిపిస్తుంది.

-ద్వాదశి