అక్షర

సాయ గీతాసాగరంలో జ్ఞానామృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయి గీతామృత సా(గ)రం
-సాయి కీర్తన,
వివేకానందరెడ్డి
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
సాయి గీతామృత సా(గ)రంలో వున్నది ‘సాయి సచ్ఛరిత్ర’లోని ఆధ్యాత్మిక అంతరార్థం. ఈ పుస్తకాన్ని రచించిన సాయి కీర్తన, వివేకానంద రెడ్డి ‘స్వాగతం’ అనే తొలి పలుకుల్లో ‘మేము చీమలం. రామసేతు నిర్మాణంలో ఇసుకనెత్తిన ఉడుతలం. సముద్ర జలాన్నంతటినీ తన చిన్న గొంతుతో తాగాలని వ్యర్థ ప్రయత్నం చేసిన తైత్తిరీయ పక్షులం.. అనే తీతువు పిట్టలం..’ అని వినయంగా పలికారు. ‘మా దృష్టిలో భక్తి, జ్ఞానం వేర్వేరు కాదు. పరస్పర పూరకాలు..’ అని చెబుతూ రామకృష్ణ పరమహంస మొదలైన ఎందరో గురువులు భక్తికి ప్రాధాన్యమిచ్చి, భక్తి ద్వారా జ్ఞానం లభిస్తుందని చెప్పిన వైనాన్ని ఉదాహరణల ద్వారా వివరించారు.
రచయితలు మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు బాబా సచ్ఛరిత్రలో వర్ణించబడిన ఎన్నో సంఘటనలకు జ్ఞానపరమైన అర్థాన్ని అన్వయిస్తూ వివరణను ఇచ్చారు.
మొదటి అధ్యాయంలో బాబా షిరిడీలో కలరా జాఢ్యం వదిలించడానికి గోధుమలను విసిరి, పిండిని ఊరి పొలిమేరలలో చల్లించడం, దానితో కలరా జాఢ్యం తగ్గడం.. అనే విషయాన్ని వివరిస్తూ, ఇది సాధారణంగా పైకి కనిపించే విషయమనీ, కానీ ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలిస్తే లోతైన జ్ఞానం కనిపిస్తుందని రచయితలు వివరించారు.
నలుగురు మహిళలు అంటే బాల్యం, కౌమారం, వనం, వార్థక్యం అనే వానవ శరీరం యొక్క నాలుగు దశలు లేదా కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగాలనే నాలుగు యోగ మార్గాలు లేదా నాలుగు వేదాల జ్ఞాన సంపద అంటూ ఒకే సంఘటనకు రకరకాల అర్థాలను అన్వయిస్తూ రచించారు.
సాయి సచ్ఛరిత్ర గ్రంథంలో అక్కడక్కడ వేరే చెడు గుణాల ప్రస్తావన వున్నా ఎక్కువగా అహంకారాన్ని గురించే ప్రస్తావించడం జరిగిందని చెబుతూ వివరణ ఇచ్చారు.
అహంకారం గురించి మన ఇతిహాసాలు, ఋగ్వేదం, గొప్ప యోగులు, మహాత్ములు, అవతార పురుషులు, ఇతర మత గ్రంథాలు, ఆధ్యాత్మిక రచనలు గావించిన రచయితలు ఏ విధంగా నిర్వచించడం జరిగిందో ఉదాహరణలతో సహా ఇచ్చారు. ఈ సంఖ్య కాస్త ఎక్కువగా వున్నట్లు అనిపించినా ఆసక్తి వున్న వారికి గొప్పవారి సూక్తులు తెలుసుకున్న తృప్తి లభిస్తుంది.
ఈ పుస్తకం సాయి సచ్ఛరిత్రలా పారాయణం కోసం రాసినది కాదు. సాయి సచ్ఛరిత్రలో రచించబడిన ఎన్నో సంఘటనల వెనకనున్న అంతరార్థాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో, అనే్వషణతో భక్తితో రాయబడిన రచన ఇది. సాయి సచ్ఛరిత్రలోని అన్ని అధ్యాయాలలోని సంఘటనలను క్లుప్తంగా రాస్తూ తమ మనసులకు స్ఫురించిన భావాలను, అంతరార్థాలను రచయిత రచించారు. ఈ పుస్తకం సాయి భక్తులను అలరిస్తుంది.

-హైమాభార్గవ్