అక్షర

తొలి అడుగు (పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-మర్యాద సురేందర్‌రెడ్డి
ప్రతులకు: రచయిత
ఇ.నెం.14-5-208/1/సి/2
రెడ్డి బాలికల వసతి గృహం ఎదురుగా, కృష్ణానగర్
మహబూబ్‌నగర్-509001
9948431340
**
ఎంతటి ప్రస్థానమైనా తొలి అడుగుతోనే ప్రారంభం. అది సామాజికం కావచ్చు. సాహిత్యం కావచ్చు. వేసే అడుగులు బలంగా ఉన్నప్పుడే ఏదైనా సఫలీకృతం అవుతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సాహిత్యంలోనూ అంతే. రాసే కవిత్వం బలంగా ఉంటేనే అది కలకాలం నిలుస్తుంది. ఆ కవిత్వం బాటలోకి మర్యాద సురేందర్‌రెడ్డి తొలి అడుగులు వేస్తున్నాడు. సామాజిక సమస్యలకు స్పందించే ఏ కవి హృదయమైనా కవిత్వమై ఉప్పొంగక తప్పదు. తొలకరి చినుకై కురవక తప్పదు. ఆ తొలకరి చినుకులే ఈ కవిత్వంలో చూస్తాము. మొత్తం ముప్పై కవితల సమాహారమిది. దేనికదే భిన్నం. కొన్ని మెచ్చుకోలుగా, మరికొన్ని ఆవేదనగా ఉంటాయి. ఇంకొన్ని కరుణ రసాన్ని కురిపిస్తాయి. కవిత్వమంటే నవరసాల సమ్మేళనం కదా. కొన్ని రసాలే ఇందులో కవి పండించాడు. రాసిన ప్రతి కవిత సరళంగా, సూటిగా ఉండడం కవి యొక్క గొప్పతనం. అన్ని కవితలు మనసుకు నచ్చేవే.
*