అక్షర

అనుక్షణం.. జీవించు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవించు.. మరణంలో కూడా
డా.పి.విజయలక్ష్మి
వెల: రూ.90.. పే.100
పాలపిట్ట బుక్స్.
*
జననం ఎంతో సంబరం. మరణం అంత దుర్భరం. అయితే మధ్యలో జీవితం ఎంతో విలువైనదయి ఉండాలి. జీవితం అంత అపురూపమైనదయితే, మనం ఎందుకు గుర్తించడం లేదు. అసలు మనం ఎందుకు బతుకుతున్నాం? ఎలా బతుకుతున్నాం? ఈసురోమంటూ గడియారం ముల్లులా యాంత్రికంగా బతుకుతున్నామా? విజయ సాధనలో, సంపాదనల మీద ప్రేమతో పరిగెత్తుతూ, పరిగెత్తుతూ తలమునకలవుతూనా? బ్రతకాలి కాబట్టి బ్రతుకుబండి లాగుతూనా? సుఖాలు అన్నీ జుర్రుకోవాలన్న ఆత్రంతోనా? ఎలా బ్రతుకుతున్నాం?
సుఖ సంతోషాలకు దూరంగా జీవితమంతా డబ్బు, సంపదల చుట్టూ తిరిగి, చివరకు పిల్లల నిదారణతో, అనారోగ్యానికి గురయి తన గురించి పట్టించుకునేవారు ఒక్కరు కూడా లేకుండా ఏమి బ్రతుకురా ఇది అని కుమిలిపోవడంలో అర్థం లేదు. డబ్బు సంపాదనలాగే సుఖ సంతోషాలున్నాయని చాలామంది భ్రమపడుతుంటారు. సంతోషంగా బతికే నిరుపేదలు కూడా వున్నారు. ఇష్టమైన తిండి, శరీర మసాజ్, సిగరెట్టు, ఆల్కహాలు, సెక్స్, వినోద విహారాలు సుఖానుభూతిని కలిగిస్తాయి. ఇవన్నీ భౌతిక సుఖాలు. సంతోషం మానసికమైనది. అసలు సంతోషం అంటే ఏమిటి? దిగులు లేకుండటమా, కాదు. ఆరోగ్యంగా ఉండటమా, కాదు. ఆర్థికంగా సౌకర్యంగా ఉండటమా, కాదు. మరి, అది ఒక ఆనందానుభూతి. మానసిక ఉల్లాసం. ఆరోగ్యంకన్నా సంపదకన్నా ఇదే జీవితంలో ఆవశ్యకం.
చావు కంటే భయంకరమైనది ఏమిటో తెలుసా? జీవితం విలువ తెలుసుకోకుండా బ్రతకడం. మరణ ఘడియలు ఆసన్నమైనప్పుడే జీవితం విలువ తెలుస్తుంది. జీవితంలో తథ్యం అయిన ఆఖరి ఘట్టం చావు. ఎవ్వరం తప్పించుకోలేనిది. ఒప్పుకోవడానికి ఇష్టపడని పదం. చనిపోవడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. మనం చావు గురించి మాట్లాడుకోవడానికి అస్సలు ఇష్టపడం. చావు అన్న మాటకి, చచ్చిపోతాం అన్న ఊహని జయించడమే. చావు భయం జయిస్తే మన జీవనశైలి మారుతుంది. జీవితం గురించి మన దృక్పథమే మారిపోతుంది. జీవితాన్ని ఇంకా అందంగా జీవించగలుగుతాం. ఏ శ్వాస మన చివరి శ్వాస అవుతుందో, కనుక ప్రతి శ్వాస అనుభూతి చెందాలి. జీవితాన్ని పూర్తిగా పరిపూర్ణంగా జీవిద్దాం. మృత్యువు దొంగలాగ ఏ నిశిరాత్రి వచ్చినా దానిని తీసికెళ్లడానికి ఏం మిగలకుండా ఆనందంగా జీవిద్దాం.
రచయిత్రి ఈ విషయాలనే ప్రధానంగా చర్చించింది. కనువిప్పు కలిగించే ప్రయత్నం చేసింది. వ్యాధులు, ప్రమాదాలు మనల్ని అడిగి రావు. హఠాత్తుగానే వస్తాయి. వాటికి ముందుగానే సంసిద్ధులం కావాలి. మరణాన్ని గురించి మాట్లాడటం, మన వాళ్లతో ఆ విషయాన్ని చర్చించడం అనవసరం అనుకుంటాం. ఎప్పుడో వచ్చేదాన్ని ముందే తలచుకోవడం ఎందుకు అంటాం. ముందు జాగ్రత్త పడటం అవివేకం కాదు. ఏ సమస్య అయినా ఒక పరిష్కారాన్ని ఆశిస్తుంది. మనకు తోచకపోతే మన శ్రేయస్సు కోరేవారు సహాయం చేస్తారు. ఈ అవసరాన్ని డా.పి.విజయలక్ష్మి అనుభవంతో, ఆలోచనతో మేళవించి గాఢంగా వ్యక్తీకరించింది. నాకెందుకులే అనుకోకుండా నలుగురికీ తెలియపరచాలని ఈ గ్రంథం ద్వారా ప్రయత్నించింది.
చిన్నచిన్న ప్రయాణాలకే ఎంతో ఆలోచిస్తాం. సర్దుకుంటాం. తగిన ఏర్పాట్లు చేసుకుంటాం. మహాప్రస్థానానికి మనల్ని మనం ఎందుకు సన్నద్ధం చేసుకోకూడదు. మనవారితో ఆ ఏర్పాట్లను గురించి ఎందుకు చెప్పకూడదు అని సహేతుకంగా ప్రశ్నిస్తుంది రచయిత్రి. వైద్య వృత్తిలో ఉండడం వలన అనుదినం జనన మరణాలను, వాటి మధ్య నలిగిపోయే జీవితాల్ని చూడడం వలన రచయిత్రి సామాన్యులకు తెలియని ఎన్నో విషయాలను చెప్పగలిగారు. జీవించడం నేర్చుకోండి. అదెలాగో చెప్పే ఈ గ్రంథాన్ని చదవండి.

-కె.పి.అశోక్‌కుమార్