అక్షర

కోరాడ నిఘంటువుతో తెలుగు వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలుగు దేశ్యవ్యుత్పత్తి
నిఘంటువు’
ఆచార్య కోరాడ
మహదేవశాస్ర్తీ
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
*
తెలుగులో చాలా నిఘంటువులు వచ్చాయి. అవన్నీ ఎక్కువగా సంస్కృత పదాలకు సంబంధించినవే. తెలుగు భాషకు సరైన నిఘంటు నిర్మాణం కోసం ‘కవిగారు’గా పేరొందిన మారేపల్లి రామచంద్ర శాస్ర్తీ కొంత కూర్చారు కానీ అలభ్యం. అచ్చ తెలుగు నిఘంటువులు వచ్చినా దేశీయమైన తెలుగుకి అంతగా ప్రయోజనం లేనివి. ఈ నేపథ్యంలో ఆచార్య కోరాడ మహదేవశాస్ర్తీ ‘తెలుగు దేశ్యవ్యుత్పత్తి నిఘంటువు’ నిర్మించారు. ‘ద్రవిడ వ్యుత్పత్తి కోశం’ అనేక సంపుటాలతో విస్తారంగా రూపొందించబడటం వల్ల పరిశోధకులకే పరిమితమైంది.
‘ఈ పుస్తకం సామాన్య విద్యార్థులకి ఉద్దేశింపబడింది. కనుక సజాతీయ వేదాలను విపులంగా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. చాలావరకు మూలధాతు పునర్నిర్మిత రూపాలను చూపాము. శబ్దవ్యుత్పత్తి తెలియడం వలన పాఠకునకు శబ్దార్థ సంబంధం మీద అవసరమైన పట్టు చక్కగా చిక్కుతుంది.’ అంటూ మహదేవ శాస్ర్తీ తమ లక్ష్యాన్ని, ప్రణాళికను స్పష్టీకరించారు. ఈ నిఘంటు నిర్మాణంలో డా.ఇరిగేపల్లి ముద్దప్ప సహాయ సంపాదకులుగా ఉన్నారు.
ద్రవిడ విశ్వవిద్యాలయం ఈ నిఘంటువును 2003వ సం.లో ముద్రించింది. అయితే దీని ప్రతులు తమ వద్దే ఉంచుకుంది తప్ప వివిధ పుస్తకశాలలకు పంపలేదు. సరైన సమీక్షలూ చేయించలేదు. వెలుగు చూడకపోవటం వల్ల మహదేవశాస్ర్తీ భాషా కృషి మరుగున పడింది.
ఈ నిఘంటువులోని కొన్ని పదాలు పరిశీలించండి.
అప్ప: అక్క, జ్యేష్ఠ సోదరి; తల్లి, తండ్రి నామాలకు అనుప్రయుక్తం. ఉదా.నేతప్ప, కన్నప్ప (కనడం - అప్ప, తమిళం (అప్పన్)
అప్పచ్చి: భక్ష్యం, అప్పం (కన్న-అప్ప = బియ్యపు రొట్టె (బాలభాష) తమి: అప్పమ్ = తీపి రొట్టె. తీపి తినుబండారం
కుక్కి: లోతైనది. తాళువదుల్లై పల్లం పడినది - కుక్కిమంచం
చిలుక, చిలుకు: కన్నడం, తుళు - గిళి; తమి, మల - కిళి; పర్జి-కిల్; కళ్ బహువచన ప్రత్యయంతో కూడిన ప్రాచీన శబ్దం యొక్క అనుచిత విభాగం.
కిళి+కళ్= చిలుకలు
మాండలికంలో చిలుకు - గొళ్లెం; తాళం వేయడానికి వీలుగా అమర్చిన పరికరం.
చిలుకుపెట్టు = గొళ్లెం పెట్టు, తాళం వేయు.
లొట్ట: రుచ్యాలైన పదార్థాలు తిన్నప్పుడు నాలుగు అంగిట చేర్చి చేసే ధ్వని.
లొట్టవేయు.
ఈ విధంగా దేశ్య పదాల గుట్టును చాలవరకు ఎరుకపరిచారు. ద్రవిడ వ్యుత్పత్తి పదకోశం నుంచి వివరణలు స్వీకరించారు. దాదాపు మూడు వేల దేశీయ పదాలు ఇందులో కనపడతాయి. సంస్కృత పదాలకు అర్థాలు చెప్పటం, శబ్ద నిరూపణ చేయటం మనకి అలవాటయింది. చాలామంది సంస్కృత విద్వాంసులు తెలుగుకి పద స్వరూపనిరూపణలేమిటి అని ఎద్దేవా చేస్తారు. అటువంటి వారు దీనిని అధ్యయనం చెయ్యాలి. ద్రవిడ విశ్వవిద్యాలయం ఈ నిఘంటువుకి ప్రాచుర్యం కల్పిస్తే మహదేవ శాస్ర్తీగారి కృషి కొంత సఫలమవుతుంది. లేదా ఒక ప్రచురణ సంస్థకి అప్పజెపితే ఇంకాస్త అందుబాటులోకి వస్తుంది. తెలుగు అధ్యాపకుడు సంస్కృత పదాలకు తప్ప తెలుగు పదాలకు సరైన వివరణలు ఇవ్వలేక పోతున్నాడు. వాళ్లకిది సంప్రదింపు గ్రంథంగా ఉపకరిస్తుంది. అందుకే కోరాడ మహదేవ శాస్ర్తీ ముందు మాటలో ఇలా అన్నారు. ‘ఈ పుస్తకాన్ని ఒక రిఫరెన్స్ నిఘంటువుగా కాక అధ్యయనానికి ఆధార గ్రంథంగా చదవటం ఎక్కువ ప్రయోజనకరం’. తెలుగు భాషాధ్యయన శీలురకు ఎంతో సహకారి. తెలుగు భాషా పరిరక్షణలో ఈ నిఘంటువు ముఖ్య పాత్ర వహించేలా రూపొందించిన మహదేవశాస్ర్తీ గారు స్మరణీయులు.

-ద్వానా శాస్ర్తీ