అక్షర

మట్టిగూడు పర్యావరణ కవిత్వ నేత్రం (పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మట్టిగూడు పర్యావరణ కవిత్వ నేత్రం
-జి.సత్యశ్రీనివాస్
వెల: రూ.120/-
ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్ విశాలాంధ్ర బుక్‌హౌస్ ప్రజాశక్తి బుక్‌హౌస్

** ** *******

ఇది పర్యావరణ కవిత్వ సంకలనం కాదు. పర్యావరణ కవిత్వ మూలాలనూ, ప్రేరణలనూ, చోదక శక్తులనూ పరిచయం చేస్తున్న పుస్తకం ఇది. ప్రకృతి విధ్వంసానికి, పర్యావరణ సంక్షోభానికీ దారి తీసిన, దారి తీస్తున్న యధార్థ ఘటనలనూ, వాటి నేపథ్యాలనూ వివరించిన పుస్తకం ఇది. ప్రకృతి విధ్వంసంపై, పర్యావరణ నాశనంపై ప్రతిఘటనలు ఏయే దేశాల్లో - మన దేశంతో సహా - ఎందుకు, ఎప్పుడు, ఎట్లా మొదలై, పెల్లుబికాయో విశే్లషించిన పుస్తకం ఇది. అమలులో ఉంచిన, ఉన్న అటవీ రక్షణ, భూసేకరణ చట్టాల మర్మాలనూ, గిరిజనులు, దళితుల హక్కులలోని డొల్లతనాన్నీ ఎత్తి చూపిన పుస్తకం ఇది. అభివృద్ధి క్రమం, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ చాటున సహజ వనరుల్ని వాణిజ్య వర్తకులు, దొంగ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు ప్రభుత్వాలను మాయ చేసి హస్తగతం చేసుకుంటూ పోయిన, పోతున్న తతంగాలనూ మన కళ్లెదుట నిల్పిన పుస్తకం ఇది. పర్యావరణ సంరక్షణ, ప్రకృతి సమతుల్యత, మనిషి - ప్రకృతి సహజీవనం, వీటి శిక్షణ విషయంలో ఇప్పుడో అప్పుడో తెర మీదకు వచ్చే ప్రజలలో ముఖాముఖి బోలుతనాన్ని సైతం విడమర్చిన పుస్తకం ఇది.