అక్షర

‘ప్రవాస’ మనసుల ప్రతిబింబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్తకి
అమెరికా సాంఘిక నవల
-సోమ సుధేష్ణ
వెల: రూ.150 డాలర్లలో 25.
కాపీలకు - అమెరికాలో -
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హోస్టన్, టిఎక్స్).
ఇండియాలో - జె.వి.పబ్లికేషన్స్, హైదరాబాద్. 8096310140

** *** ***

సోమ సుధేష్ణగారు భారతీయ ప్రవాసి. ప్రతి విషయాన్ని కళాత్మకంగా చూడగలిగే తెలుగు గృహిణి. అమెరికాలోని ప్రవాసాంధ్రుల జీవితాన్ని, వారు ఎదుర్కొనే సంతోషాలు, సమస్యలు, అక్కడ అడుగుపెట్టిన మరుక్షణం నుంచీ నా అనేవాళ్లు లేని భయం, సంఘ రీతి, ఆటాపాటా, వేషభాషలు - అన్నీ క్రొత్తే! అయినా, మొక్కవోని దీక్షతో పట్టుదలతో, అమెరికా జీవితంలో ఒదిగిపోయి సుమారు రెండు లక్షల జనాభాకు చేరుకున్న తెలుగు వారిని అధ్యయనం చేసారు. ఏ నేల మీద కాళ్లూన్చి బ్రతుకుతున్నారో, ఆ నేల జీవిత తత్త్వాన్ని అర్థం చేసుకున్నారు. తెలుగు భాషాభిమానం ‘రక్తంలో రంగు’గా మారింది.
దేశాన్ని వీడాక తెలుగు లెస్సు అనకుండా తెలుగు లెస్స అంటూ ఎన్నో కథలు, గేయాలు, వ్యాసాలు, అక్కడి తెలుగు పత్రికల్లో రాస్తూ, ప్రశంసలందుకున్నారు. ప్రస్తుత నవల ‘నర్తకి’ రచన -అనే మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురించారు. దానే్న ఇప్పుడు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి సహకారంతో మన ముందుకు తెచ్చారు.
నాట్యంపైన ఆసక్తి ఉన్న ఈ రచయిత్రి అక్కడి నాట్య రీతుల్ని పరిశీలిస్తూ, మన కూచిపూడి, భరతనాట్యం లాంటి ప్రక్రియల్ని పోల్చుతూ, ‘రష్యన్ బాలె’ నృత్యాన్ని ఈ నవలలో కథావస్తువుగా తీసుకున్నారు.
అమెరికాలో స్థిరపడుతూన్న తెలుగు దంపతులు రమేష్ మరియు నిర్మల రతనాల. వీరికి సుష్మ, సుజన కూతుళ్లు. కూచిపూడి నృత్యం పట్ల అభిరుచి ఉండి కూడా, పరిస్థితులు అనుకూలించక నేర్చుకోలేదు నిర్మల. తన అభిరుచిని తన పెద్ద కూతురు సుష్మ ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటుంది నిర్మల. అందుబాటులో ఉన్న ‘బాలె’ నృత్యం నేర్పిస్తుంది. సహాధ్యాయి డేవిడ్‌తో సుష్మ పరిచయం వారిద్దరిని మరింత దగ్గరగా తెస్తుంది. భారతీయత, భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మీద ఎనలేని అభిమానం ఉన్న నిర్మలకు, ఇది ఒక ఊహించని శరాఘాతం. ‘రెక్కలొచ్చిన పిల్లల్ని స్వేచ్ఛగా ఎగరనివ్వాలి’ అని నమ్మే నిర్మల సుష్మ వివాహం డేవిడ్‌తో జరిపిస్తుంది. చురుకైన సుష్మ బాలె నృత్యంలో పలువురి ప్రశంసలు అందుకుంటుంది. ఇది గమనించిన డేవిడ్ కొంత అసహనానికి గురవుతాడు. సుష్మకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూంటారు. ఇది గమనించిన నిర్మల దంపతులు సంయమనంతో వ్యవహరించి, ఇద్దరినీ తిరిగి దగ్గరకు చేరుస్తారు.
నవల ఆసాంతం నిర్మల; ఆమె ఆలోచనలు, అమెరికాలో స్థిరపడే సగటు తెలుగువారి మనఃస్తత్వం చిత్రీకరించబడింది. ఇటు ఇండియాకు దూరమై, అటు అమెరికా జీవిత విధానంలో ఇమడలేక పడే అంతర్మథనం చాలా బాగా చెప్పబడిందీ నవలలో. అక్కడి పెద్ద మాల్స్, చిన్న ‘స్ట్రిప్ స్టోర్స్’ అనే దుకాణాలు, వంటలు, తనకి తప్ప, అందరికీ అన్నీ ఉన్నాయన్న గ్రూపు మనస్తత్వం, అక్కడ ఎదిగిన పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛ, డేటింగ్‌కు వెళ్లకపోతే పిల్లల్లో ఏదో లోపం ఉందని బాధపడే తల్లిదండ్రులు, కాలేజీకి వెళ్లటంతో మొదలయ్యే పిల్లల ప్రయాణం, ఆ తర్వాత పేరెంట్స్ దగ్గరకు అతిథుల్లాగే వచ్చి పోతూండటం, వెరైటీ వంటలు, ఇండియా వస్తే తప్ప దొరకని ఆత్మీయత, బంధుత్వంలోని మాధుర్యం, కూతురు అమెరికన్‌ను ప్రేమించిందనీ, అతనే్న పెళ్లాడుతుందని తెలిసిన నిర్మల ఆలోచనలు, ఆమెకు రాయాలన్న ప్రేరణ కలుగుతుంది. ఆ ఉత్తరం చదివే ప్రతీ సగటు తల్లికి, మనసు ద్రవించుతుంది. ఒక తల్లి, తన కూతురు సంప్రదాయానికి దూరంగా వెళ్తూ, పరాయిదవుతున్న బాధ ఆ తల్లికే కాదు, పాఠకుడికి కూడా కలుగుతుంది. ‘డాన్సు అన్న పదం పుట్టింది సంస్కృతంలో. దాని అర్థం డిజైర్ టు లివ్’ (పే.201) అని చెప్పటం, ‘్భ’ అంటే భావాలు తెలుపటం, ‘ర’ అంటే రాగం పాడటం, ‘త’ అంటే తాళం బీట్ (పే.23) అవన్నిటిని చూపించేది భరతనాట్యం’ అని నిర్మల ద్వారా చెప్పటం. రచయిత్రికి నాట్యం మీద ఉన్న అభిరుచే కాదు దాని లోతుపాతులు కూడా తెలుసుననిపిస్తుంది. ఇదే కాదు. జ్ఘూశషళూఒ’ ఇ్ఘజశఒ ఘూళ జశ దళూ చిళళఆ (పే.50) అనటం చాలా గొప్పగా ఉంది. మనసు పెట్టి చేస్తే గాని, ఏ పనీ ప్రశంసల్ని అందుకోలేదు.
ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి - పరాయిగడ్డపై తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకై వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి పాత్ర ఎంతో ప్రశంసనీయం. రెండేళ్లకోసారి తెలుగు సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నారు. అమెరికాలో మరియు ఇండియాలో పోటీలు, సాహిత్య ప్రసంగాలు నిర్వహిస్తున్నారు. వికలాంగులకు, వృద్ధులకు ఇండియాలో చేదోడు వాదోడుగా విరాళాలిస్తున్నారు. ఇంతవరకు వారు 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.ముప్పై కోట్లు) వితరణ గావించారట. రచయిత్రి మనసులోంచి వచ్చిన, మనసుల్ని తాకే నవల. ప్రవాసాంధ్రుల జీవితం ప్రతిబింబించిన నవల.

-కూర చిదంబరం.. 8885552423