అక్షర

తెలంగాణలో సాగునీటి వనరుల సమగ్ర రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తెలంగాణ: సాగునీటి వనరులు-
అవకాశాలు’’
సారంపల్లి మల్లారెడ్డి
వెల: రు.80/-
పేజీలు: 144
నవ తెలంగాణ
పబ్లిషింగ్ హౌస్

దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నదులైన కృష్ణా, గోదావరి నదుల మధ్య దక్కన్ పీఠభూమిలో తెలంగాణ ప్రాంతం వున్నది. ఈ రెండు నదులకు అనేకమైన ఉప నదులు, వాగులు వంకలు మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని ఆవరించి వున్నాయి. దక్కన్ పీఠభూమిలో సహజంగా కనిపించే ఎత్తుపల్లాలు అప్పటి ఆంధ్ర పాలకులకు భౌగోళిక అననుకూలతగానే కనిపించాయి. కాని ఈ భౌగోళిక స్థితిగతులనే, తెలంగాణ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పాలించిన రాజవంశాలు అనుకూలతగా మార్చుకుని, అపారంగా వున్న జల వనరులను సాగుకు మళ్ళించ గలిగాయి. కాకతీయుల నుండి అసఫ్‌జాహీల దాకా తెలంగాణ అంతటా వేలాది చెరువులు నిర్మాణం అయినాయి.
తెలంగాణలో వున్న విస్తారమైన జల వనరులను వినియోగంలోకి తీసుకురావాలన్న ఆలోచన నిజాం ప్రభుత్వానికి వచ్చింది. అలా నిజాం ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతిభా వంతుడు అయిన ఇంజనీరు అలీనవాజ్ జంగ్ నేతృత్వంలో సమగ్ర జలవనరుల అభివృద్ధి పథకం రూపుదిద్దుకుంది. అయితే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, తెలంగాణ జల వనరుల దోపిడికి ప్రాతిపదిక అయింది. ఎస్సార్సీ చట్టం రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణకు పూర్వమే రూపొందించిన, నిర్మాణంలో వున్న ప్రాజెక్టులను పునర్ వ్యవస్థీకరణ అనంతరం కూడా కొనసాగించాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయరాదని స్పష్టీకరించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, హైదరాబాద్ రాష్ట్రం రూపొందించిన కొన్ని ప్రాజెక్టులను బుట్టదాఖలు చేశాయి. మరి కొన్నింటిని కుదించారు. చిన్న నీటి చెరువులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురిఅయినాయి. సరిగ్గా వర్షాలులేకపోవడం, విపరీతంగా బోర్లు వేయడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. దాంతో సాగునీటికే కాదు, తాగే నీటికి కూడా కొరత ఏర్పడింది.
ప్రస్తుతం రాష్ట్రంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా సాగు భూమిలో 5.74 శాతానికి మాత్రమే నీటి వనరులున్నాయి. 32 శాతం భూమి 18.40 లక్షల బావుల ద్వారా సాగుఅవుతున్నది. వర్షాలు బాగా పడిన రోజులలో 32శాతం సాగవుతున్నది. వర్షాలు సరిగాలేకపోతే, బావుల కింద నాలుగోవంతుకు తగ్గిపోతుంది. లిఫ్టు పథకాలువున్నా పనిచేయడం లేదు. ఎక్కడైనా నామమాత్రంగా వున్నా విద్యుత్ సరఫరా గ్యారంటీ లేదు. ఇరవై సంవత్సరాల కింద చేపట్టిన ఇరిగేషన్ పథకాలు ఏ ఒక్కటీ నేటికీ పూర్తికాలేదు. దీనివల్ల కాంట్రాక్టర్లు మాత్రమే లాభం పొందగలిగారు.
ఈ విషయాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించిన రచయిత సారంపల్లి మల్లారెడ్డి- కృష్ణా, గోదావరి నదుల జలాలను వినియోగంలోకి తేవడం ద్వారా రాష్ట్రంలో కరువులను శాశ్వతంగా నివారించవచ్చు. త్రాగు నీటి సమస్యను పరిష్కరించవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాన్ని, అందుబాటులో వున్న జలాలను, ఉన్న ప్రాజెక్టులను, పూర్తిచేయాల్సినవి- కొత్తగా కట్టాల్సిన ప్రాజెక్టులను, ఎత్తిపోతల పథకాలను, లిఫ్టుల గురించి సోదాహరణంగా గణాంకాలతో సహా వివరించిన విధానం బాగుంది. ఈ ప్రాజెక్టుల చుట్టూ వున్న వివాదాలను ప్రస్తావించడంతోపాటు మిషన్ కాకతీయ గురించి కూడా విమర్శనాత్మకంగా తెలియజేశారు. కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అనుమానిస్తూ, సాగు నీటి వనరుల నిర్మాణాలు పూర్తయ్యేవరకు సమైక్య ఉద్యమం ద్వారా ప్రభుత్వాలను నిలదీయడమే కార్యక్రమంగా కొనసాగాలని పిలుపునివ్వడం గమనించదగ్గ విషయం.

-కె.పి.అశోక్‌కుమార్