ఆంధ్రప్రదేశ్‌

లిఫ్ట్‌లో చిక్కుకున్న అల్లు అర్జున్,బోయపాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: సినీనటుడు అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌లకు సింహాచలంలో శుక్రవారం నాడు చేదు అనుభవం ఎదురైంది. సింహాచలం ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం గాలిగోపురం నుంచి వస్తుండగా వీరు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. గాలిగోపురం నుంచి బయలుదేరిన లిఫ్ట్ కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. ఆ సమయంలో అందులో ఉన్న అర్జున్, బోయపాటితో పాటు మరో వ్యక్తి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆలయ సిబ్బంది వచ్చి లిఫ్ట్ తలుపులు బద్దలుకొట్టి వారిని బయటకు తీశారు.