రాష్ట్రీయం

ఇదీ అమరావతి ముసాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ జారీ
జనవరి వరకు అభ్యంతరాల స్వీకరణ

విజయవాడ/ హైదరాబాద్, డిసెంబర్ 26: అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి సిఆర్‌డిఏ శనివారం రాత్రి మాస్టర్ ప్లాన్ ముసాయిదా జారీచేసింది. దీనికి సంబంధించిన నకళ్లను సిఆర్‌డిఏ కార్యాలయంతోపాటు తెనాలి, మంగళగిరి, గుంటూరు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. వీటిపై అభ్యంతరాలు, సూచనలను జనవరి మాసాంతంలోగా పంపవచ్చని సిఆర్‌డిఏ కమిషనర్ ఎన్ శ్రీకాంత్ పేర్కొన్నారు. 25 గ్రామాల పరిధిలో 217 చ.కిమీ విస్తీర్ణంలో ప్రభుత్వ భవనాలు, అలాగే భూములిచ్చిన రైతులకు కేటాయించబోయే ప్లాట్లు, ఏవేవి ఎక్కడుండాలో ప్రణాళికలో పొందుపర్చారు. నోటిఫికేషన్ జారీకిముందు సిఎం చంద్రబాబు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. కృష్ణాతీరం వెంబడి కరకట్టమీదుగా సాగే ప్రతిపాదిత జాతీయ రహదారి వంకరటింకర లేకుండా సాఫీగా సాగేలా ప్రతిపాదనలు చేశారు. తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, నేలపాడు, శాఖమూరు, ఐనవోలు, మల్కాపురం, మందడం, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్ళూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, పిచ్చికలపాలెం, కొండపరాజుపాలెం, తాడేపల్లి మండలం పరిధిలోని ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాల్టీలోని నులకపేట, డోలాస్‌నగర్‌లు, మంగళగిరి మండలంలోనిక కృష్ణాయపాలెం, నిడమర్రు, నీరుకొండ శివారులోని కురగల్లు, నవులూరు మొత్తం 25 గ్రామాల్లో ప్రధాన, అంతర్గత రహదారులు, ప్రజా రవాణాకు సంబంధించిన రహదారులకు ప్రతిపాదనలు చేశారు. పచ్చదనం పరిఢవిల్లేలా కాల్వలు, చెరువులకు, పార్కులకు కేటాయింపులు జరిపారు. రాజధానిని 9 నగరాలుగా విభజించారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం ఒక నగరం, ఆర్ధికపరమైన కార్యకలపాలకు ఒక నగరం, పర్యాటక నగరం, నాలెడ్జ్ నగరం, హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, జస్టిస్ సిటి, స్పోర్ట్స్ సిటి, మీడియా సిటీగా విభజిస్తూ ప్రతిపాదనలు చేశారు. ఏ గ్రామ పరిధిలో ఏ పట్టణ నిర్మాణం జరుగనున్నదో స్పష్టంగా పేర్కొన్నారు.
తాజా ప్రణాళికతో రాజధాని స్వరూపంలో స్పష్టతవచ్చింది. నివాస ప్రాంతాలను ఆర్-1, 2, 3, 4 సెక్టార్లుగా విభజించారు. ఆర్-1లో ప్రస్తుత గ్రామ కంఠాలు, ఆర్-2లో సాధారణ ప్రజలకు, జి ప్లస్ 7 భవనాలు, ఆర్ -3లో ప్రభుత్వోద్యోగులకు, అధికారులకు జి ప్లస్ 15 భవనాలు, ఆర్-4లో విల్లాలు, పెద్ద పెద్ద భవంతులు నిర్మించనున్నారు. వాణిజ్య ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించి బహుళ ప్రయోజనాలకు పి-1ను, పరిశ్రమలకు పి-2ను కేటాయిస్తారు. సాధారణ పరిశ్రమలకు పి-2, పి-3, టౌన్ సెంటర్ జోన్‌గా పి-4, రీజనల్ సెంటర్ జోన్‌గా పి-5, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ జోన్‌గా పి-6 ఉంటాయి. సీతానగరం, ఉండవల్లి మీదుగా బోరుపాలెం వరకూ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తారు. వెంకటపాలెం, రాయపూడి, తుళ్లూరు ప్రాంతాలను కలుపుతూ రాజధాని నగరంలో రెండురైల్వే మార్గాలు కూడా ప్రతిపాదించారు. వెంకటపాలెం, నీరుకొండ , పెద్దమద్దూరు వద్ద రిజర్వాయిర్లు ప్రతిపాదించారు. నీరుకొండ రిజర్వాయర్ నుండి అమరావతి ప్రభుత్వ భవన సముదాయానికి నీటిని సరఫరా చేయాలని ప్రతిపాదించారు. ఉండవల్లి నుండి కృష్ణాయపాలెం వరకూ గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు కానుంది. ఉండవల్లి గుహల నుండి ప్రకాశం బ్యారేజీ వరకూ ఉద్యానవనాలు, అమరావతి టౌన్‌షిప్, నిడమర్రు, అనంతవరం, బోరుపాలెం వద్ద పారిశ్రామిక వాడలు ఏర్పాటు అవుతాయి. మరోపక్క అమరావతి విద్యుత్ సరఫరా, విద్యుదుత్పత్తి కేంద్రాలకు కూడా ప్రతిపాదనలు చేశారు. తొలి దశలో రెండు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయనున్నారు. 2021నాటికి అవసరాలకు అనుగుణంగా ఐదువేల మెగావాట్ల విద్యుత్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. కామవరపుకోట నుండి విజయవాడ వరకూ అంతర్గత భూగర్భ కేబుళ్ల ద్వారా విద్యుత్ పంపిణీ చేయనున్నారు.