ఆంధ్ర గాథాలహరి

కొత్త కోడలి కోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
దిట్ఠా చూఆ అగ్ఘా ఇఅసురా దక్ఖిణానిలో సహిఓ
కజ్జాఇం వ్వి అ గరు ఆ ఇ మామికోవల్ల హూ కస్స (కొంతకురుడు)
సంస్కృత ఛాయ
దృష్టాశ్చూతా ఆఘ్రాతా సురా దక్షిణానిల స్సోఢః
కార్యాణ్యేవ గురుకాణి మాతులాని కోవల్లభః కస్య
తెలుగు
తె.గీ
మంద మలయానిలమ్ములు, మలయుచుండ
కిసలయాస్వాదమత్తకోకిలలు కూయ
భ్రమర ఝంకార రవములే, భగ్నప్రణయ
విరహగీతమ్ములనిదోప, వెనుదిరుగడు
పనులె ముఖ్యమని తలచి పయనవౌను
అసలే మధుమాసం. చల్లని మలయా నిలం ఒంటికి తగులుతూంది. లేత మామిడి చివుళ్ళు తిన్న కోయిలల కిలకిలారావాలు చెవిని పడుతూన్నాయి. తుమ్మెదల ఝంకారాలు విరహగీతాలుగా అనిపించేట్లు వినిపిస్తున్నాయి. అయినా నీ కొడుకేమిటి?అత్తా! అలా పనులే ముఖ్యమని పొలానికి వెళుతున్నాడు’’ అని గునుస్తోంది కొత్త కోడలు.
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949