ఆంధ్ర గాథాలహరి

కరిమబ్బులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ఆలో అంతి పుళిందా పవ్వ అసిహర ట్ఠిఆ ధణుడి సణ్ణా!
హత్థి ఉలేహి వ విఝం పూరిజ్జంతం ణవ బ్భేహిం
(హాలియుడు)
సంస్కృత చ్ఛాయ
ఆలోకయంతి పులిందాః పర్వత శిఖరస్థితి ధనుర్నిషణ్ణాః
హస్తికులైరివ వింధ్యం పూర్యమాణం నవాభైః!!
తెలుగు
తే.గీ
ప్రకట వింధ్యా చలము మీద, పరుగులిడెడు
కారుమబ్బుల గములను, గాంచినంత
కడుపునిండ జలము ద్రావి, గంతులిడుచు
కదలిపోయెడు, గజముల కరణితోచు
వింధ్య పర్వతంమీద కదిలిపోతున్న కారు మబ్బుల గుంపులను చూస్తుంటే, కడుపు నిండా నీళ్ళను త్రాగి నెమ్మదిగా కదిలిపోయే నల్లని ఏనుగుల్లా ఉన్నాయట. ఏనుగురంగు, కరి మేఘం రంగూఒకటే భూమి మీద ఏనుగు పెద్దది. ఆకాశంలో మేఘం పెద్ధది. మేఘాల్లో నీరుందని సూచించేదందుకు అవి తృప్తిగా నీళ్లు తాగి వెళ్తున్నా యన్నారు .

--ఇంకావుంది...

-డి.వి.ఎం.సత్యనారాయణ 9885846949