ఆంధ్ర గాథాలహరి

పిడికిలిలో నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
అద్దం సణేణ పుత్తఅ! సుట్ఠు విణేహాణు బంధ ఘడి ఆఇం!
హత్థ ఉడపాణి ఆఇం వ కాలేణ గలంతి పేమ్మాఇం! (వహరసుడు)
సంస్కృత చ్ఛాయ
ఆదర్శనేన పుత్రక! సుష్ట్వపిస్నేహానుబంధ ఘటిబాని!
హస్తపుట పానీయానీవ కాలేన గలంతి ప్రేమాణి!!
తెలుగు
తె.గీ కనగ చిరకాల మెడబాటు కలుగుకతన
ఒకరినొకరు చూచుకొనక యున్న యంత
ప్రేమ ఎంతైన ప్రేయసీ ప్రియులమధ్య
నిలచునే? పిడికిటనున్న, నీటివోలె!
‘‘అబ్బారుూ! మనసుల్లో ఎంత ప్రేమ ఉన్నా ఎక్కువ కాలంపాటు మీరు ఒకర్నొకరు చూసుకోకుండా ఉండటం మంచిది కాదు. ఎందుచేతంటే, ప్రేమ పిడికిలిలో వున్న నీళ్లలాగా క్రమంగా మాయమవుతుంది’’ అని ప్రియురాలికి చిరకాలం దూరంగా ఉన్న నాయకుణ్ణి వృద్ధదూతిక హెచ్చరిస్తోంది.
వివరణ: ‘ఆషాఢం’ లాగా అప్పుడప్పుడూ ఎడబాటు అవసరమేగానీ, సంవత్సరాలకు తరబడి భార్యాభర్తలు దూరంగా ఉండడం మంచిది కాదని ఈ గాథలోని సందేశం. అలా దూరంగా ఉంటే ఒకర్నొకరు మర్చిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. దీర్ఘకాలికమైన ఎడబాటువల్ల మగవాళ్ళు సన్యాసులుగా (సన్నాసికాదు) మారిన సందర్భాలూ ఉన్నాయి. ఏదన్నా పనిమీద విదేశానికి వెళ్లినా సతిని వెంట తీసుకెళ్ళడమో, వెంటనే రావడమో మంచిది. ఇది నేటి పరిస్థితుల్లోనూ మంచిదే కదా.

ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949