ఆంధ్ర గాథాలహరి

అక్రమ సంపాదన అధముల పాలు-52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ఉప్పాఇ అదవ్యాణం, విఖలాణం కోభా అణం ఖలోచ్చేఅ
పక్కా ఇవి ణింబఫలాఇ ణవరం కాఏహి ఖజ్జంతి (పాలితుడు)
సంస్కృతచ్ఛాయ
ఉత్పాదిత ద్రవ్యాణామపి ఖలానాం కోభాజనం ఖలఏవ
పక్వాన్యపి నింబఫలాని కేవలం కాకైః ఖాద్యంతే
తెలుగు
ఆ.వె అధములైనవారి అక్రమార్జనమును
అధములైన వారె అనుభవింత్రు
పృధ్వి యందు చూడ, వేపపండ్లనెపుడు
కాకితినునుగాని, ఘనుడు తినడు
‘‘లోకంలో చెడ్డవాళ్ళు అన్యాయంగా ఆర్జించిన ధనాన్ని చెడ్డవాళ్ళే తింటారు. అది ఎలాగంటే ఎంత పండినవైనా వేపండ్లను కాకులు మాత్రమే తింటాయి’’ అని అన్యాయంగా ధనం ఆర్జించవద్దని నాయిక నాయకుడికి హితోపదేశం చేస్తోంది.
వివరణ: పురుషార్థములు- ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ధర్మాన్ని ముందు చెప్పడంలో ఉద్దేశ్యం- ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించమని. ‘అన్యాయార్జితం విత్తం, దశవర్షాణి అధవా ద్వాదశ వర్షాణి, సమూలం వినశ్యితి’ అని పెద్దలు చెపుతారు. అంటే అన్యాయంగా ఆర్జించిన ధనం పది లేక పనె్నండు సంవత్సరాలలో సమూలంగా (ఇంతకుముందున్న దానితో సహా) నశిస్తుందని అర్థం. అధర్మబద్ధంగా సంపాదించిన సొమ్ముకు అధములే వారసులౌతారని ఈ గాథ ప్రతిపాదిస్తుంది. వారసులు అధములు, నీచులు కాకూడదనుకుంటే ధర్మబద్ధంగా ధనం సంపాదించాలని అంతరార్థం.
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949