ఆంధ్ర గాథాలహరి

సుజనమైత్రి- శిలాక్షరం( ఆంధ్రగాథాలహరి-66)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
కీరంతీవ్వి అ ణాసఇ ఉ అఏ రేహవ్వ ఖల అణే మేత్తీ సా ఉణ సు అణమ్మి కఆ అణహోపాహాణరేహవ్వ (సరళుడు)
సంస్కృత చ్ఛాయ
క్రియ మాణైవ నశ్యత్యుదకీ రేఖేవ ఖలజనే మైత్రీ
సాపునః సుజనే కృతా అనఘా పాషాణరేఖేవ
తెలుగు
ఆ.వె దుష్ట జనుల మైత్రి, తోయమ్ముపై వ్రాత
పగిది, అనయము క్షణ భంగురమ్ము
శిష్ట జనుల మైత్రి శిలపైన చెక్కిన
అక్షరమ్మువోలె, అక్షరమ్ము
భావం:
సుజనులతో మైత్రి రాతిమీద వ్రాతలాగా శాశ్వతంగానూ, దుర్జనులతో మైత్రి నీటిమీది వ్రాతలాగా క్షణికంగానూ ఉంటాయనేది హితోపదేశం.
వివరణ
మైత్రికి కృష్ణార్జునులనే చెపుతారు. వారి మైత్రి లోకోపకారకమైంది. మానవాళికి భగవద్గీతను ప్రసాదించింది. అందువల్ల గొప్పవారితో స్నేహం శిలాక్షరంగా శాశ్వతంగా నిలచి ఉంటుంది. ఆ మాటకొస్తే కర్ణ దుర్యోధనుల మధ్య స్నేహం కూడా అంత తేలికైందేమీ కాదు. కానీ వారి స్నేహం దుష్టచతుష్టయం (దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని)లో భాగంగా లోకంలో ప్రచారం పొందింది. దుష్టులతో స్నేహం స్వార్థంతో కూడి వుంటుంది. ఉదాహరణకు కర్ణ, దుర్యోధనుల స్నేహంలో- తనకు క్షత్రియులతో పోరాడడానికి అవకాశం కల్పించాడని, అంగరాజ్యా ధికారం ఇచ్చాడని కర్ణుడు థుర్యోధనుని గురించి అనుకొని స్నేహం చేస్తానని మాటిచ్చినందుకు కట్టుబడి ఉంటే తనకు రాజకీయంగా అండగా ఉంటాడని, అర్జునుని నిలువరించే యోధుడు కర్ణుడేనని దుర్యోధనుడికి నమ్మకం. అందువల్ల వారి స్నేహంలో స్వార్థం పాలే ఎక్కువ. రామసుగ్రీవులు ఒకరికొకరు సాయం చేసుకున్నా వారిద్దరూ సుజనులు కనుక ఎంతోకాలం ఆ స్నేహం నిలిచి ఉంది. అందుకని మంచివాళ్ళతో స్నేహమే మంచిదని గాథాకారుని తీర్పు. - ఇంకావుంది...

-డి.వి.ఎం.సత్యనారాయణ 9885846949