ఆంధ్ర గాథాలహరి

వెఱ్ఱివాని విలాసం -80

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె లేతమావి చిగురు పూతను సిగదాల్చి
వెఱ్ఱివాడొకండు వెడలుచుండ
ముద్దుసఖియనుగొని, పోవుచుండెననియు
వాని వెంబడించె,భ్రమర సమితి
ఒక పల్లెటూరివాడు లేత మామిడిపూల గుత్తిని గోటితో గిల్లి తలలో ముడుచుకొని పోతూ ఉండగా, తమ ఇష్టసఖిని వాడు బంధించి తీసుకొని వెళుతున్నాడనుకొని భ్రమపడి గండు తుమ్మెదలు వాడిని వెంబడించాయట. మన పూర్వీకుల్లో పురుషులు కూడా పూలను ధరించే సంప్రదాయం ఉందని మనకు ఈ గాథవల్ల తెలుస్తోంది.
వివరణ
సాధారణంగా మల్లెలు, చామంతులు, కలువలు వంటివాటినే ఆడవాళ్ళుగానీ, మగవాళ్లుగానీ (నాడు) ధరిస్తారు. ఎవరో వెఱ్ఱిబాగులవాడు తప్ప మామిడిపూతను ధరించడం ఉండదు. అలా ధరించినవాడి వెంట తుమ్మెదలు పడటంలో ఆశ్చర్యం లేదు. ‘తిక్కలాడు తిరుణాలకు పోతే గుడిమెట్లు ఎక్కనూ, దిగనే సరిపోయిందని’ సామెత. అట్లాంటివాడి గాథే ఇది.
పాపం అమాయకత్వం అలాంటిది. తనకు తెలియకపోయ పెట్టుకున్నా ఆస్వాదించేవానికి ఆ ఆస్వాదన ఫలం తెలుస్తుందన్నట్టు మామిడి పూత నుంచి వచ్చే మంచి పరిమళం కూడా ఆస్వాదించదగినదే కదా. ఆ పూత పరిమళాన్ని చూస్తూ రాబోయే కాలంలో వచ్చే మామిడి కాయల, పండ్ల రుచిని వూహించుకుని మురిసిపోవచ్చు కదా. అంతా భావనలోనే కదా జగం. వూహల వూయలనెక్కితే

ప్రాకృత మూలం
ణక్ఖక్ఖుడి అం సహ ఆర మంజరిం పామరస్స సీసమ్మి
బందిమ్మివ హీరంతీం భమరజు ఆణా అణుసరంతి (మహారాయుడు)
సంస్కృత ఛాయ
నఖోత్ఖండితాం సహకార మంజరీం పామరస్య శీర్షే
బందీమివ హ్రియ మాణాం భ్రమరయు వానో నుసరంతి!
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949